హర్ప్‌‌స్ జొస్టర్

(గజకర్ణము నుండి దారిమార్పు చెందింది)

Herpes Zoster (హెర్పెస్ జోస్టర్, తెలుగు: కంచిక), శింగెల్స్ అని పిలుస్తారు. చర్మం పైన దద్దుర్లు, బొబ్బలు శరీరంలో ఏదో ఒకే ప్రాంతంలో, ఒకే ప్రక్కను ( కుడి లేదా ఎడమ ) రావటం దీని ప్రధాన లక్షణం. varicella zoster virus (VZV) చిన్నప్పుడు పిల్లల్లో చికెన్ పాక్స్ ( అమ్మవారు ) రూపంలో వచ్చి తగ్గిపోతుంది. కాని ఆ వైరస్ శరీరంలో అలాగే దాగి వుంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత దానికి అనువైన పరిస్థితులు (వృద్దాప్యం, HIV లాంటి వ్యాధుల వల్ల) ఏర్పడ్డాక Herpes Zoster రూపంలో బయట పడుతుంది.[1] ఇది CD4 సంఖ్యతొ సంబంధం లేకుండా ఎప్పుడైనా రావచ్చు, కాని CD4 సంఖ్య 50 కంటే తగ్గినప్పుడు రావటానికి అవకాశాలు ఎక్కువ, కంటి పై వచ్చినప్పుడు చివరకు అంధత్వం తెప్పించే అవకాశం కూడా ఎక్కువ.

హర్ప్‌‌స్ జొస్టర్
ప్రత్యేకతInfectious diseases, dermatology, neurology Edit this on Wikidata

లక్షణాలు

మార్చు

ముందుగా ఈ వ్యాధి జ్వరం, చలి, తలనొప్పి, కాళ్ళు, చేతులు మొద్దు బారటం అలాగే జలదరించటం లక్షణాలను చూపుతుంది. ముందుగా వీటిని సాధారణ జ్వరంగా భ్రమపడే అవకాశం ఉంది. ఈ లక్షణాలు కనపడ్డ కొన్ని రోజులకే చర్మం పైన దుద్దుర్లు, బొబ్బలు (ద్రవంతో నిండినవి) శరీరంలో ఏదో ఒకే ప్రాంతంలో, ఒకే ప్రక్కను (కుడి లేదా ఎడమ) రావటం ప్రారంభిస్తాయి. ఈ శింగెల్స్ పూర్తిగా తగ్గటానికి దాదాపుగా ఆరువారాలు తీసుకుంటాయి. చాల అరుదుగా చెవిలోనికి ప్రవేశించి చెవుడును తెప్పించే అవకాశము ఉంది.

చికిత్స[2]

మార్చు

అన్ని జొస్టర్ వైరస్ లలానే దీన్ని కూడా బాగు చేయవచ్చు. Acyclovir, Valacyclovir, Famciclovir లాంటి ఆంటి వైరల్ మందులను వాడి పూర్తిగా తగ్గించవచ్చును. కొన్ని సార్లు వైరస్ రెజిస్టెన్స్ వల్ల HIV రోగులలో మందులు పనిచేయకపోతే రెండు మందులను కలిపి వాడాల్సి వుంటుంది.

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-07-12. Retrieved 2012-07-18.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-07-12. Retrieved 2012-07-18.

https://te.wikipedia.org/wiki/%E0%B0%8E%E0%B0%AF%E0%B0%BF%E0%B0%A1%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D?wprov=sfl