గజనిమ్మ

(గజ నిమ్మ నుండి దారిమార్పు చెందింది)

గజనిమ్మను ఆంగ్లంలో పొమెలొ (Pomelo) అంటారు. దీని వృక్ష శాస్త్రీయ నామం సిట్రస్ మాక్సిమా లేక సిట్రస్ గ్రాండిస్. కరుకుదనం కలిగిన ఈ నిమ్మజాతి పండు దక్షిణ, ఆగ్నేయ ఆసియాకు చెందినది. ఈ గజనిమ్మ పండు సాధారణంగా లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. మాగినప్పుడు పసుపుపచ్చ రంగుకి మారుతుంది. ఈ పండు మెత్తని చాలా మందమైన తోలును కలిగి ఉంటుంది. ఈ పండు లోపలి కండ బత్తాయి కాయకు ఉన్నట్టు తెల్లగా ఉంటుంది. చాలా అరుదుగా గులాబీ రంగులోను లేక ఎరుపు రంగులోను ఉంటుంది. అతిపెద్ద గజనిమ్మ పండ్లు 15 నుంచి 25 సెంటీమీటర్ల (5.9 నుంచి 9.8 అంగుళాలు) వ్యాసాన్ని కలిగి 1 నుంచి 2 కిలోగ్రాముల బరువుతో ఉంటాయి. బాగా పుల్లగా ఉండే ఈ గజనిమ్మ కాయ దబ్బలను ఉప్పు అద్దుకొని లేక చల్లుకొని తింటారు, ఇంకా ఊరగాయ తయారు చేస్తారు.

గజనిమ్మ
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
C. maxima
Binomial name
Citrus maxima
Pomelo seedling


చిత్రమాలిక

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

పులుసునిమ్మ

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=గజనిమ్మ&oldid=4346668" నుండి వెలికితీశారు