గడియారం
గడియారం (ఆంగ్లం: Watch) మనకు సమయం తెలుసుకోవడానికి ఉపయోగపడే యంత్రము, నిత్యావసర వస్తువు.
ఇవి చిన్నవిగా సులువుగా మనతో ఉండేటట్లుగా తయారుచేస్తారు. కొన్ని గడియారాలలో సమయంతో సహా రోజు, తేదీ, నెల, సంవత్సరము వంటి వివరాలు కూడా తెలియజేస్తాయి. ఆధునిక కాలంలో ఎక్కువమంది గడియారాన్ని చేతికి పెట్టుకొనడం మూలంగా వీటిని చేతివాచీ అంటారు. కొన్ని గోడ గడియారాలు ప్రతి గంటకి శబ్దం చేస్తాయి.
పాతకాలంలోని యాంత్రికమైన గడియారాలు స్ప్రింగ్ తో తిరిగేవి. వీటికి రోజూ లేదా రెండురోజుల కొకసారి 'కీ' ఇవ్వాల్సి వచ్చేది. కొన్ని రకాలలో ధరించిన వాని చేతి కదలికల నుండి తయారైన యాంత్రిక శక్తిని ఉపయోగించి పనిచేస్తాయి. ఆధునిక కాలంలో ఇవి ఎక్కువగా బాటరీలతో నడుస్తున్నాయి.
కొన్ని గడియారములలో మనము ఎప్పుడు అవసరము అనుకుంటే అప్పుడు గంట మోగే సదుపాయం కూడా ఉంటుంది. ఉదాహరణకు మనము నిద్ర లేవడానికి అలారం పెట్టడం.
పూర్వము ఎండ-నీడల సహాయముతో కాలమును గణించేవారు. అంతే కాక ఇసుక గడియారాలు కూడా వాడుకలో ఉండేవి. ఈ ఇసుక గడియారాల్లో రెండు బాగాలుగా ఉంటాయి. ఒక భాగంలో ఇసుక నింపబడి ఉంటుంది. మొత్తం ఇసుక ఒక భాగం నుంచి మరొక భాగానికి రాలడానికి ఒక నిర్దిష్టమైన సమయం పడుతుంది.
ప్రస్తుత కాలంలో ముల్లులు లేకుండా అంకెల గడియారములు (డిజిటల్ గడియారాలు) కూడా ఉన్నాయి. వీటిలో అంకెలను డిస్‌ప్లే చేయడానికి ఎలక్ట్రానిక్ లెడ్ లను ఉపయోగిస్తారు. వీటికి చాలా తక్కువ విద్యుత్తు ఖర్చవుతుంది. అలాగే సమయాన్ని మాటలలో కూడా చెప్పే సౌకర్యం కూడా ఉంటుంది. ఇటువంటివి అంధులకు చాలా ఉపయోగకరము.
గడియారంలో భాగాలు
మార్చుమువ్మెంట్ (కదలికలు)
మార్చుమూవ్మెంట్ అనేది కాలగమనాన్ని కొలిచి ప్రస్తుత సమయాన్ని చూపే గడియారంలోని భాగం. కదలికలు గడియారంలో యాంత్రికమైనవి కావచ్చు, వైద్యుత మైనవి కావచ్చు, కొన్ని సార్లు రెండు కలిసి కూడా మూవ్‌మెంట్ ఉండవచ్చు. ప్రస్తుతం చాలా గడియారాలు వైద్యుత కదలిక ద్వారా దర్శని (డిస్ప్లే) లో ముళ్ళను తిప్పుతూ ఉంటాయి.
యాంత్రిక కదలికలు
మార్చువైద్యుత కదలికలు
మార్చుపవర్ సప్లై
మార్చుడిస్ప్లే
మార్చువినియోగాలు
మార్చుగడియారాలలో రకాలు
మార్చు- చేతి గడియారం
- గోడ గడియారం
- డిజిటల్ గడియారం
- ఇసుక గడియారం
- సూర్య గడియారం
- స్ట్రీట్ క్లాక్ (వీధి గడియారం)
- కారు తాళంచెవి గడియారం: వాచీలో 8 నుంచి 9 అంకెల మధ్యలో స్థలాన్ని తాకితే కారు డోర్లు తెరుచుకుంటాయి. 3 నుంచి 4 అంకెల మధ్యలో తాకితే డోర్లు మూసుకుంటాయి. అదే ఒకేసారి రెండింటినీ తాకితే కారు ఫ్లాష్ లైట్లు వెలుగుతాయి. (ఈనాడు 22.2.2010)
చరిత్ర
మార్చు1500 : జర్మనీ : పీటర్ హెన్లెన్ మొదటి జేబు గడియారము తయారు చేసెను.
1485 : లియమనార్డొ డా విన్సి ఫుజీ (fusee) ని గీసెను .
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చుబయటి లింకులు
మార్చు- బోస్టన్ - అమెరికా గడియారం తయారీ పుట్టినిల్లు
- Origins of Waltham Model 57
- టైమ్ మ్యూజియం, ఇల్లినోయ్, అమెరికా
- 1876లో అమెరికా, స్విస్ వాచి తయారీ గురించి - Jacques David
- అమెరికాలో వాచి ఫ్యాక్టరీలు- by Henry G. Abbott (1888)
- అమెరికాలో ఆధునిక వాచి తయారీ (2009)
- స్విస్ వాచి పరిశ్రమ
- FHH Fine Watchmaking Foundation
- AWCI American Watchmakers-Clockmakers Institute (United States)
- NAWCC The National Association of Watch and Clock Collectors (United States)
- A Reliquary of Obscure Timepieces of Bygone Eras as well as the Cutting Edge Watches of Today
- Chronocentric.com
- The British Horological Institute Limited
- Vintage & Modern Watch Designs
- The Most Expensive Watches
- Tendancehorlogerie.com Archived 2021-03-02 at the Wayback Machine All about watches