ఎ.చంద్రశేఖర్

(ఎ.చంద్రశేఖర్‌ నుండి దారిమార్పు చెందింది)

ఎ.చంద్రశేఖర్‌ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు మరియు మాజీ మంత్రి. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పని చేశాడు.

ఎ.చంద్రశేఖర్‌

మాజీ మంత్రి
నియోజకవర్గం వికారాబాదు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1960
మర్పల్లి గ్రామం, వికారాబాదు జిల్లా, తెలంగాణ రాష్ట్రం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి తెలుగుదేశం పార్టీ
నివాసం వికారాబాదు

జననం సవరించు

ఎ.చంద్రశేఖర్‌ 1960లో తెలంగాణ రాష్ట్రం , వికారాబాదు జిల్లా , మర్పల్లి గ్రామం లో జన్మించాడు.

రాజకీయ జీవితం సవరించు

డాక్టర్‌ ఎ.చంద్రశేఖర్‌ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1985లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి దేవదాస్ పై 20361 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1989, 1994, 1999 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేసి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. [1]

డాక్టర్‌ ఎ.చంద్రశేఖర్‌ 2001లో తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ లో చేరాడు. ఆయన 2004 ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తరుపున (కాంగ్రెస్, టిఆర్ఎస్, సిపిఎం, సిపిఐ కలిసి ఆనాడూ కూటమిగా పోటీ చేశాయి) పోటీ చేసి టీడీపీ అభ్యర్థి బి.మధురవేణి పై గెలిచాడు.[2]ఆయన 2004లో గెలిచిన అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పని చేశాడు. తెలంగాణ వ్యూహంలో భాగంగా 2008లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ చేతిలో ఓటమి పాలయ్యాడు. ఆయన 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు.

డాక్టర్‌ ఎ.చంద్రశేఖర్‌ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత తెలంగాణ రాష్ట్ర సమితి కి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ లో చేరాడు. ఆయన 2014లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేయలేడు. ఎ.చంద్రశేఖర్‌ 2018లో కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[3][4] ఆయన 2019 లోక్‌సభ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ ఓడిపోయాడు. ఎ.చంద్రశేఖర్‌ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 18 జనవరి 2021న భారతీయ జనతా పార్టీలో చేరి[5][6], 2023 ఆగష్టు 12న పార్టీకి రాజీనామా చేశాడు. అతను 2023 ఆగష్టు 18న తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాడని ప్రకటించారు [7]

మూలాలు సవరించు

  1. Sakshi (3 November 2018). "హ్యాట్రిక్‌ వీరులు!". Archived from the original on 30 జూలై 2021. Retrieved 30 July 2021.
  2. Sakshi (23 November 2018). "మెజారిటీల్లో రికార్డు." Archived from the original on 30 జూలై 2021. Retrieved 30 July 2021.
  3. Elections in India (2018). "Vikarabad Election Result 2018 Live Updates: Candidate List, Winner, Runner-up MLA List". Archived from the original on 31 జూలై 2021. Retrieved 31 July 2021.
  4. News18 (2018). "Vikarabad Assembly constituency (Telangana): Full details, live and past results". Archived from the original on 31 జూలై 2021. Retrieved 31 July 2021.
  5. Sakshi (12 January 2021). "18న బీజేపీలో చేరనున్న మాజీ మంత్రి". Archived from the original on 31 జూలై 2021. Retrieved 31 July 2021.
  6. Sakshi (19 January 2021). "డీఎన్‌ఏ పరీక్షకు నేను సిద్ధం.. కేసీఆర్‌ సిద్ధమా?". Archived from the original on 31 జూలై 2021. Retrieved 31 July 2021.
  7. Eenadu (13 August 2023). "భాజపాకు మాజీ మంత్రి చంద్రశేఖర్‌ రాజీనామా". Archived from the original on 13 August 2023. Retrieved 13 August 2023.