జి. వివేకానంద్
గడ్డం వివేక్ వెంకటస్వామి, అని కూడా పిలువబడే గడ్డం వివేకానంద్, భారత జాతీయ కాంగ్రెస్‌కు చెందిన తెలంగాణ రాజకీయ నాయకుడు. ఇతను 15వ లోక్‌సభలో మాజీ పార్లమెంటు సభ్యుడు.[2] అతను పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో చెన్నూరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గా గెలిచాడు. [3]
జి. వివేకానంద్ | |||
| |||
లోక్‌సభ సభ్యులు
| |||
పదవీ కాలం 2009 నుండి 2014 | |||
ముందు | జి. వెంకటస్వామి | ||
---|---|---|---|
తరువాత | బాల్క సుమన్ | ||
నియోజకవర్గం | పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | సరోజ | ||
సంతానం | వ్రితిక, వంశీ, వైష్ణవి, వెంకట్ | ||
నివాసం | హైదరాబాద్ | ||
వెబ్‌సైటు | జి. వివేకానంద్ అధికారిక జాలగూడు | ||
మూలం | [1] |
జననం
మార్చుఈయన 1957, నవంబరు 30న ప్రముఖ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు, పార్లమెంట్ జి.వెంకటస్వామి, కళావతి దంపతులకు కరీంనగర్ లో జన్మించాడు.
విద్యాభ్యాసం
మార్చుబేగంపేట లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో పాఠశాల విద్యను చదివాడు. ఉస్మానియా వైద్య కళాశాల నుండి వైద్య విద్యను పూర్తిచేశాడు.
రాజకీయ ప్రస్థానం
మార్చుజి. వివేక్ తన తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చి 2009లో పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఎంపీగా గెలిచి పార్లమెంట్ బొగ్గు, ఉక్కు కమిటీల సభ్యుడిగా ఉన్నాడు. ఆయన తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పతాక స్థాయికి చేరిన సమయంలో 2 జూన్ 2013న కాంగ్రెస్ పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత 2014 మార్చి 31న తిరిగి కాంగ్రెస్‌లో చేరాడు. ఆయన 2014లో చెపెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. జి. వివేక్ తర్వాత 2016లో టీఆర్‌ఎస్‌లో చేరి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితుడయ్యాడు.[5]
జి. వివేక్ 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున టికెట్ రాకపోవడంతో ఆ పార్టీకి 2019 మార్చి 25న రాజీనామా చేశాడు.[6][7] ఆయన 2019 ఆగస్టు 9న భారతీయ జనతా పార్టీలో చేరాడు.[8][9] ఆయన 2021 అక్టోబరు 7న భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యవర్గ సభ్యుడిగా నియమితుడయ్యాడు.[10][11] వివేక్ వెంకట స్వామి 2023 అక్టోబరు 5న బిజెపి మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా నియమితుడై[12], బీజేపీ అధిష్టానం పట్ల అసంతృప్తితో ఉన్నఆయన బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తూ నవంబరు 01న తన రాజీనామా లేఖని రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించాడు.[13]
నిర్వహించిన పదవులు
మార్చు- 15వ లోక్‌సభ పార్లమెంట్ సభ్యుడు
- బొగ్గు, ఉక్కు కమిటీల సభ్యుడు
- భారతీయ పరిశ్రమ యొక్క సమాఖ్య (సిఐఐ), ఆంధ్రప్రదేశ్ చాప్టర్, (2006-2007) ల అధ్యక్షుడు
- తయారీదారుల సంఘం అధ్యక్షుడు
- విశాఖ పరిశ్రమ సంస్థల ప్రచార ఉపాధ్యక్షుడు
- హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు
- చెన్నూరు శాసన సభ సభ్యుడు .[14]
ఆస్తులు-కేసులు
మార్చుమూలాలు
మార్చు- ↑ Loksabha (2021). "Dr. Gaddam Vivekanand". Archived from the original on 19 జనవరి 2022. Retrieved 19 January 2022.
- ↑ Congress MPs fight over Group-I exams. Deccan Chronicle, 7 September 2010.
- ↑ Congress MPs fight over Group-I exams. deccanchronicle.com. 7 September 2010
- ↑ Andhrajyothy (9 December 2023). "ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం". Archived from the original on 10 December 2023. Retrieved 10 December 2023.
- ↑ వి6 న్యూస్. "వివేకానంద్ కు ఘన సన్మానం". Archived from the original on 21 జనవరి 2017. Retrieved 18 March 2017.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (25 March 2019). "టీఆర్‌ఎస్‌కు వివేక్ గుడ్‌బై". Archived from the original on 19 జనవరి 2022. Retrieved 19 January 2022.
- ↑ BBC News తెలుగు (24 March 2019). "సీటివ్వలేదని టీఆర్ఎస్‌కు టాటా చెప్పిన వివేక్". Archived from the original on 19 జనవరి 2022. Retrieved 19 January 2022.
- ↑ HMTV (9 August 2019). "బీజేపీలో చేరిన మాజీ ఎంపీ వివేక్". Archived from the original on 19 జనవరి 2022. Retrieved 19 January 2022.
- ↑ Sakshi (9 August 2019). "అమిత్ షా సమక్షంలో బీజేపీలోకి వివేక్". Archived from the original on 19 జనవరి 2022. Retrieved 19 January 2022.
- ↑ V6 Velugu (7 October 2021). "బీజేపీ కొత్త కార్యవర్గంలో వివేక్ వెంకటస్వామి" (in ఇంగ్లీష్). Archived from the original on 19 జనవరి 2022. Retrieved 19 January 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ NTV (7 October 2021). "జాతీయ కార్యవర్గ సభ్యులను ప్రకటించిన బీజేపీ." Archived from the original on 19 జనవరి 2022. Retrieved 19 January 2022.
- ↑ V6 Velugu (5 October 2023). "బీజేపీ యాక్షన్ స్టార్ట్..ఎన్నికల కోసం 14 కమిటీలు". Archived from the original on 1 November 2023. Retrieved 1 November 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (1 November 2023). "భాజపాకు షాక్.. మాజీ ఎంపీ వివేక్ రాజీనామా". Archived from the original on 1 November 2023. Retrieved 1 November 2023.
- ↑ Sakshi (1 April 2017). "హెచ్‌సీఏ అధ్యక్షుడిగా వివేక్". Archived from the original on 19 జనవరి 2022. Retrieved 19 January 2022.
- ↑ 15.0 15.1 "Gaddam Vivekanand(Indian National Congress(INC)):Constituency- CHENNUR (SC)(MANCHERIAL) - Affidavit Information of Candidate:". www.myneta.info. Retrieved 2023-11-26.