గడ్డవరపు పుల్లమాంబ

పేరాల పుల్లమాంబ గారు రచయిత్రి, స్త్రీల సాహిత్య వేదిక స్థాపకురాలు. ఈమె బాపట్ల మాయబజారులోని ఉమ్మారెడ్డి వీధిలో 1931 ఆగస్టు 6వ తేదీన కోన సత్యనారాయణ, శ్రీలక్ష్మమ్మలకు జన్మించారు. ఈమె 15వ ఏట తండ్రి మృతి చెందారు. అప్పటి నుంచి ట్యూషన్లు చెప్పుకుంటూ వచ్చిన సంపాదనతో ప్రైవేటుగా బి.ఎ., బి.ఇడి. చదివి 1954లో స్థానిక సరస్వతి మెమోరియల్‌ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా ఉద్యోగంలో చేరారు. అనంతరం ఎం.ఎ. చేసి 1958లో రాజమండ్రిలోని ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకురాలిగా చేరి 1989లో కడపలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపల్‌గా పదవీవిరమణ చేశారు.

రచనలు

మార్చు

మల్లంపల్లి శర్మయ్య శిష్యరికంలో సంస్కృతం నేర్చుకుని ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, కనపర్తి వరలక్ష్మి, నాయని కృష్ణమూర్తి, తురగా జానకీరాణి, పేరాల భరతశర్మ, పిల్లుట్ల హనుమంతరావు వంటి ప్రముఖ రచయితలతో కలిసి రచనలు చేశారు.

  • మనము మన మనస్సు, సమస్యలను ఎదుర్కోండి, ది రెడ్‌ అనే ఆంగ్ల కథలను తెలుగులో అనువదించారు.
  • శ్రీశ్రీ సాహిత్యంలోని సాంప్రదాయం, "చలం స్త్రీలకు చేసిన మేలు", విశ్వనాథ రచన శిల్పం వంటి రచనలు రాశారు. రవీంద్రనాథ్‌ఠాగూర్‌ రాసిన ఏక్‌లాగ్‌చెలో అనే గేయాన్ని తెలుగులో ఒకడినే నేనొక్కడినే అనే గేయంగా, గార్డెనర్‌ అనే గేయాల సంపుటిని తోటమాలిగా అనువదించారు.

అవార్డులు

మార్చు
  • 'మనస్సులోని పొరలు' అనే కథకు అమెరికాలోని సాహితీ అకాడమీ 2001 అవార్డు వచ్చింది.
  • 1984లో విశ్వనాథ నాటకాలపై పరిశోధన వ్యాసం రాశారు. విశ్వనాథ సాహిత్య పీఠం వారి నుంచి అవార్డును అందుకున్నారు.