గద్వాల విజయలక్ష్మి

గద్వాల విజయలక్ష్మి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె హైదరాబాదు మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) మేయర్‌గా 2021, ఫిబ్రవరి 11న బాధ్యతలు చేపట్టింది.[2] విజయలక్ష్మి భారత్ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన నాయకురాలు. ఆమె బీఆర్ఎస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె. కేశవ్ రావు కూతురు.[3]

గద్వాల విజయలక్ష్మి
గద్వాల విజయలక్ష్మి


మేయర్ - హైదరాబాదు మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
11 ఫిబ్రవరి 2021 - ప్రస్తుతం
ముందు బొంతు రామ్మోహన్

వ్యక్తిగత వివరాలు

జననం 21 జూన్ 1964 [1]
హైదరాబాద్, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి బాబిరెడ్డి
నివాసం బంజారాహిల్స్, హైదరాబాద్, తెలంగాణ
పూర్వ విద్యార్థి సుల్తాన్‌ ఉల్‌ ఉలూమ్‌ లా కాలేజ్ , ఉస్మానియా యూనివర్సిటీ

జననం సవరించు

గద్వాల విజయలక్ష్మి, హైదరాబాదులో కె. కేశవరావు, వసంత కుమారి దంపతులకు జన్మించింది.

విద్యాభాస్యం సవరించు

గద్వాల విజయలక్ష్మి హైదరాబాదులోని హోలీ మేరీ స్కూల్‌లో పదవతరగతి వరకు చదివింది. రెడ్డి మహిళా కాలేజీలో డిగ్రీ, భారతీయ విద్యాభవన్‌లో జర్నలిజం, సుల్తానా ఉల్ లూమ్ లా కాలేజీలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసింది.[4]

వివాహం సవరించు

గద్వాల విజయలక్ష్మి 1988, డిసెంబరు‌ 24న గజ్వేల్‌కు చెందిన బాబిరెడ్డిని ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది.[5] పెళ్లి తర్వాత విజయలక్ష్మి దంపతులు ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లారు. ఆమె అమెరికాలోని కరోలినా యూనివర్సిటీలో కార్డియాలజీ విభాగంలో రీసెర్చ్ అసిస్టెంట్‌గా పనిచేసింది.

రాజకీయ ప్రస్థానం సవరించు

విజయలక్ష్మి దాదాపు 18 ఏళ్లపాటు తరువాత 2007లో భారత్ తిరిగి వచ్చింది. రాజకీయాల పట్ల ఉన్న ఆసక్తితో ఆమె తన అమెరికా పౌరసత్వాన్ని వదిలేసుకుంది. 2016లో హైదరాబాదు మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) కి జరిగిన ఎన్నికల్లో ఆమె టీఆర్ఎస్ తరఫున బంజారాహిల్స్‌ కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలిచింది. 2021లో జీహెచ్ఎంసీకి జరిగిన ఎన్నికల్లో బంజారాహిల్స్‌ కార్పొరేటర్‌గా రెండవసారి గెలిచి, మేయర్‌గా ఎన్నికయ్యింది.[6][7]

గ్రేటర్ హైదరాబాద్ మేయర్‌గా సవరించు

  1. గ్రేటర్‌లోని ఆస్పత్రులను సందర్శించిన మేయర్ [8]గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి 3 జూన్ 2021న కుత్భుల్లాపూర్‌లోని ఆరు చెరువులు, బంజారాహిల్స్ రోడ్ నెంబ‌రు-1లోని తాజ్ బంజారా స‌మీపంలో ఉన్న చెరువును పరిశీలించింది.[9]
 
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తో

మూలాలు సవరించు

  1. Namasthe Telangana (21 June 2021). "జీహెచ్ఎంసీ మేయ‌ర్‌కు ఎంపీ సంతోష్ కుమార్ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు". Namasthe Telangana. Archived from the original on 21 June 2021. Retrieved 21 June 2021.
  2. సాక్షి (22 February 2021). "జీహెచ్‌ఎంసీ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన విజయలక్ష్మి". Sakshi. Archived from the original on 8 April 2021. Retrieved 8 April 2021.
  3. Sakshi (11 February 2021). "మేయర్‌గా కేకే కుమార్తె". Archived from the original on 4 April 2022. Retrieved 4 April 2022.
  4. TV5 News (11 February 2021). "GHMC కొత్త మేయర్ గద్వాల విజయలక్ష్మి గురించి ఈ విషయాలు మీకు తెలుసా?" (in ఇంగ్లీష్). Archived from the original on 4 April 2022. Retrieved 4 April 2022.
  5. TV9, తెలుగు వార్తలు » తెలంగాణ (14 February 2021). "ప్రేమికుల రోజున తమ ప్రేమ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న మేయర్ విజయలక్ష్మి". TV9 Telugu. Archived from the original on 8 April 2021. Retrieved 8 April 2021.
  6. నమస్తే తెలంగాణ (13 February 2021). "గల్లీగల్లీ తిరుగుతా". Namasthe Telangana. Archived from the original on 8 April 2021. Retrieved 8 April 2021.
  7. Andhrajyothy (22 April 2021). "మేయర్ గద్వాల ఆకస్మిక తనిఖీ.. ఆయన అవుట్!". Archived from the original on 22 April 2021. Retrieved 22 April 2021.
  8. Andhrajyothy (26 May 2021). "ఇటు మేయర్‌.. అటు డిప్యూటీ మేయర్‌". www.andhrajyothy.com. Archived from the original on 26 May 2021. Retrieved 26 May 2021.
  9. Namasthe Telangana (3 June 2021). "చెరువుల‌పై నెటిజ‌న్ల విజ్ఞ‌ప్తి.. మేయ‌ర్‌కు మంత్రి కేటీఆర్ ఆదేశాలు". Namasthe Telangana. Archived from the original on 3 June 2021. Retrieved 3 June 2021.