బొంతు రామ్మోహన్

బొంతు రామ్మోహన్ (జననం 1973 జూలై 5) తెలంగాణ రాష్ట్ర గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ మేయర్. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రాజకీయ నాయకుడు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రామ్మోహన్ హైదరాబాద్ నగరానికి మొదటి మేయర్.[1] [2]

బొంతు రామ్మోహన్
బొంతు రామ్మోహన్


గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ యొక్క మేయర్
పదవీ కాలం
ఫిబ్రవరి 11, 2016 – 11 ఫిబ్రవరి 2021
ముందు మహ్మద్ మజీద్ హుస్సేన్

వ్యక్తిగత వివరాలు

జననం జూలై 5, 1973
నేరడ, కురవి మండలం, మహబూబాబాదు జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు భారత్ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి బొంతు శ్రీదేవి
సంతానం కుజిత, ఉషశ్రీ
నివాసం హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
పూర్వ విద్యార్థి ఉస్మానియా విశ్వవిద్యాలయం

జననం - కుటుంబం

మార్చు

వరంగల్ జిల్లా, మహబూబాబాద్‌ వాసులైన బొంతు వెంకటయ్య, కమలమ్మ దంపతులకు 1973, జూలై 5న రామ్మోహన్‌ జన్మించాడు. రామ్మోహన్‌కు ఇద్దరు అక్కచెల్లెళ్లున్నారు. 2004 లో హైదరాబాద్‌ కు చెందిన శ్రీదేవిని వివాహం చేసుకున్నాడు.వీరికి ఇద్దరు కుమార్తెలు (కుజిత, ఉషశ్రీ) ఉన్నారు.[2]

చదువు

మార్చు

బొంతు రామ్మోహన్ ఒకటో తరగతి నుండి ఐదో తరగతి వరకు ఆమనగల్‌‌లో, ఎనిమిది వరకూ నేరడలో, మహబూబాబాద్‌ కంకరబోడ్ హైస్కూల్‌ లో 10వ తరగతి పూతి చేశాడు. ఇంటర్ విద్యను మహబూబాబాద్‌ లోని ఎస్.ఎస్.సి. జూనియర్ కళాశాలలో,వరంగల్ లోని ఆదర్శ కళాశాలలో డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ, ఎల్‌ఎల్‌ఎం, పీహెచ్‌డీ (పాలిటిక్స్)‌‌ పూర్తి చేశాడు. [2]

విద్యార్థి నాయకుడిగా

మార్చు

ఉస్మానియా విశ్వవిద్యాలయం లో విద్యార్థిగా ఉన్న సమయంలో అక్కడి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. విద్యార్థి నాయకుడిగా ఏబీవీపీలో పనిచేశారు. [2]

వివాహం

మార్చు

బొంతు రామ్మోహన్ 7 ఫిబ్రవరి 2004న శ్రీదేవిని ప్రేమ వివాహం చేసుకున్నాడు.[3]

రాజకీయ జీవితం

మార్చు

బొంతు రామ్మోహన్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంతో 2002లో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి, తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డాడు. ఆయన 2005లో విద్యార్ధి విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులై 2007 వరకు పని చేశాడు. రామ్మోహన్ 2007 నుంచి 2009 వరకు టీఆర్ఎస్ కార్యదర్శిగా, విద్యార్ధి విభాగం ఇన్‌ఛార్జిగా పని చేసి, 2009 నుండి 2016 వరకు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడిగా పని చేశాడు. బొంతు రామ్మోహన్ 2016లో గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థకు జరిగిన ఎన్నికలలో చర్లపల్లి డివిజన్ నుంచి కార్పోరేటర్ గా 7,869 ఓట్ల మెజారిటీతో గెలిచి, మేయర్ సీటును దక్కించుకున్నారు.[4][5]

బొంతు రామ్మోహన్ 2024 ఫిబ్రవరి 16న గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు.[6]

మూలాలు

మార్చు
  1. సాక్షి, హైదరాబాద్, కథ. "'గ్రేటర్' మేయర్‌గా బొంతు రామ్మోహన్". Retrieved 7 January 2017.{{cite news}}: CS1 maint: multiple names: authors list (link)
  2. 2.0 2.1 2.2 2.3 ఆంథ్రజ్యోతి, తెలంగాణ ముఖ్యాంశాలు. "గ్రేటర్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌". Archived from the original on 17 మే 2016. Retrieved 7 January 2017.
  3. Sakshi (14 February 2017). "మేయర్‌ ఇన్‌ లవ్‌." Archived from the original on 19 August 2021. Retrieved 19 August 2021.
  4. Deccan Chronicle (12 February 2016). "New Hyderabad Mayor Bonthu Rammohan vows to make life of citizens better" (in ఇంగ్లీష్). Archived from the original on 17 ఫిబ్రవరి 2017. Retrieved 19 August 2021.
  5. Janam Sakshi (12 February 2016). "మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఏకగ్రీవం". Archived from the original on 4 April 2022. Retrieved 4 April 2022.
  6. V6 Velugu (16 February 2024). "కాంగ్రెస్లో చేరిన పట్నం సునీతారెడ్డి, బొంతు రామ్మోహన్". Archived from the original on 16 February 2024. Retrieved 16 February 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)