గాదె వెంకటరెడ్డి

గాదె వెంకటరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పనిచేశాడు.

గాదె వెంకటరెడ్డి

మాజీ మంత్రి
నియోజకవర్గం బాపట్ల నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 10 జూలై 1940
పావులూరు గ్రామం, ఇంకొల్లు మండలం, ప్రకాశం జిల్లా , ఆంధ్రప్రదేశ్
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి వీరాంజనేయమ్మ
సంతానం గాదె మధుసూదన్‌రెడ్డి
నివాసం హైదరాబాద్

జననం, విద్యాభాస్యం

మార్చు

గాదె వెంకటరెడ్డి 1940 జూలై 10లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, ఇంకొల్లు మండలం, పావులూరు గ్రామం లో జన్మించాడు. ఆయన ఎల్.ఎల్.బి వరకు చదువుకున్నాడు.

రాజకీయ జీవితం

మార్చు

గాదె వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరుచూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన తరువాత 1972 లో కాంగ్రెస్ అభ్యర్థిగా 1978 లో జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి రెండు సార్లు మద్దుకూరి నారాయణ రావుపై పరాజయం చెందారు. 1983, 1985,1989 ఎన్నికల్లో వరుసగా తెలుదేశం పార్టీ అభ్యర్థుల చేతులలో ఓటమి పాలయ్యాడు.

వెంకటరెడ్డి 1991 ఉప ఎన్నికల్లో, 1994 సార్వత్రిక ఎన్నికల్లో పరుచూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ ఎన్నికల్లో గెలుపొందిన తరువాత నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశాడు.[1]

గాదె వెంకటరెడ్డి 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై, 2004లో, 2009లో జరిగిన ఎన్నికల్లో బాపట్ల నుండి ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి, కొణిజేటి రోశయ్య మంత్రివర్గంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశాడు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు.

గాదె వెంకటరెడ్డి 2016 ఏప్రిల్ 29లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరాడు.[2] ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి 2020 మార్చి 16న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[3]

మూలాలు

మార్చు
  1. Sakshi (16 March 2019). "ఉద్దండుల అడ్డా.. పర్చూరు గడ్డ..!". Archived from the original on 16 January 2022. Retrieved 16 January 2022.
  2. Andrajyothy (29 April 2016). "మాజీమంత్రి గాదె నేడు దేశంలో చేరిక". Archived from the original on 30 July 2021. Retrieved 30 July 2021.
  3. Sakshi (16 March 2020). "వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ మంత్రి వెంకటరెడ్డి". Archived from the original on 30 July 2021. Retrieved 30 July 2021.