గాలిమేడలు (నాటకం)
గాలిమేడలు 1949, డిసెంబరులో అనిసెట్టి సుబ్బారావు రాసిన సాంఘీక నాటకం. మానవునిలో అంతర్లీనంగా దాగివున్న పాశవిక ప్రవృత్తి వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో చూపించిన ఈ నాటకం, 1950 ఆగస్టులో ఆంధ్ర ఆర్ట్సు థియేటరు అధ్వర్యంతో తొలిసారిగా ప్రదర్శించబడింది.[1]
గాలిమేడలు | |
కృతికర్త: | అనిసెట్టి సుబ్బారావు |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | నాటకం |
ప్రచురణ: | దేశికవిమండలి, విజయవాడ |
విడుదల: | జనవరి 1953 |
పేజీలు: | 118 |
కథానేపథ్యం
మార్చుసమాజంలో డబ్బుకు ఎంతటి విలువ ఉందో, డబ్బున్నవారికి సమాజంలో ఎలాంటి గౌరవ మర్యాదలు లభిస్తాయో ఈ నాటకంలో చూపించబడింది. కలల్లో తేలియాడే మధ్యతరగతి వారి మనస్తత్వాన్ని, మందహాసాన్ని ఈ నాటకం వ్యంగ్యంగా చిత్రించింది. మోసం, ద్రోహం, స్వార్ధబుద్ధితో ఉంటూ... డబ్బుకే ప్రాధాన్యత ఇస్తున్న నేటి సాంఘిక వ్యవస్థ మారాలని ఈ నాటకం ద్వారా సందేశం ఇవ్వబడింది.[2]
మధ్యతరగతి మనిషి జీవితంలో నిత్యం ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు దారిలేక అవకాశం దొరికినప్పుడల్లా స్వప్నంలో తన సమస్యలను మర్చిపోయి ఆనందకర జీవితాన్ని అనుభవించినట్టు చూపించబడింది.[3]
పాత్రలు
మార్చు- మాణిక్యాలరావు
- అన్నపూర్ణ
- కృష్ణ
- కాబూలీవాలా
- నారాయణరావు
- ఆంజనేయులు
- సీతారామయ్య
- హోటల్ యజమాని
- పోలీస్ ఆఫీసర్
- నరసయ్య
- వెంకట్రావు
- వెయిటర్
ఇతర వివరాలు
మార్చు- సిగ్మండ్ ఫ్రాయిడ్ మనో విశ్లేషణ సిద్ధాంతం ఆధారంగా ఈ నాటకం రాయబడింది.
- బెర్టోల్ట్ బ్రెహ్ట్ ప్రతిపాదించిన ఎలియనేషన్ సిద్ధాంతం అనే ప్రయోగాన్ని ఆధునిక నాటకరంగంలో తొలిసారిగా ఈ నాటకంతోనే ప్రారంభమయింది. ప్రదర్శన సమయంలో ప్రేక్షకుల నుండి పాత్రలు రంగస్థలంపైకి ప్రవేశిస్తాయి.
- విజయవాడలోని ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ నాటక సంస్థ ఆధ్వర్యంలో సినీనటులు నాగభూషణం, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, కర్నాటి లక్ష్మీనరసయ్య, కారెపు అప్పలస్వామి వంటి వారు ఈ నాటకాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శించారు.
మూలాలు
మార్చు- ↑ సంచలనం సృష్టించిన గాలిమేడలు, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 16 అక్టోబరు 2017, పుట.10
- ↑ ఆంధ్రజ్యోతి, సాహిత్య వార్తలు (16 October 2017). "సంచలనం సృష్టించిన గాలిమేడలు". lit.andhrajyothy.com. కందిమళ్ల సాంబశివరావు. Archived from the original on 26 అక్టోబరు 2017. Retrieved 22 October 2019.
- ↑ https://shodhganga.inflibnet.ac.in/bitstream/10603/63481/9/09_chapter%204.pdf