గాలిగూడెం
ఈ గ్రామం - "గాలిగూడెం" - పేరు సంబంధిత మండలం పేజీలో లేదు. ఈ పేజీలో ఉన్న సమాచారం సరైనదో కాదో నిర్ధారించుకోవాలి. లేదా మండలం పేజీలో ఈ గ్రామం వేరే పేరుతో ఉందేమో చూసి, ఉంటే... ఈ రెండు పేజీలను విలీనం చెయ్యాలి |
గాలిగూడెం (Galigudem) మహబూబ్ నగర్ జిల్లాలోని కొందుర్గ్ మండలంలోని ఒక గ్రామం.
గాలిగూడెం | |
— రెవిన్యూ గ్రామం — | |
Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided. |
|
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | మహబూబ్ నగర్ జిల్లా |
మండలం | కొందుర్గ్ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామ పేరు - చరిత్ర
మార్చుకొందుర్గ్ మండలంలోని పెద్దేల్కిచర్ల గ్రామానికి 2 కిలో మీటర్ల దూరంలో, రంగారెడ్డి జిల్లా ముజాహిద్‌పూర్కు వెళ్ళే మార్గంలో రోడ్డు పక్కన పచ్చని పంటపొలాల మధ్యన ఓ పెద్ద మర్రి వృక్షం ఉంది. 200 సంవత్సరాల వయస్సున్న ఈ వృక్షం కింద ఓ దేవుడు వెలిశాడు. వీరన్న అను భక్తుడు పూజలు చేయడం ప్రారంభించడం వలన ఈ స్వామికి వీరన్న స్వామిగా పేరు స్థిరపడిపోయింది. ఈ వీరన్న స్వామికి ఇద్దరు భార్యలని, ఒకరు ఎల్లమ్మ అని, మరొకరు గాలెమ్మ అని చెబుతారు. వీరి పేరు మీదుగానే కొందుర్గ్ మండలంలో వీరన్న స్వామి పేరు మీద వీరన్నపేట, ఎల్లమ్మ పేరు మీదుగా ఎల్కిచర్ల, గాలెమ్మ పేరు మీదుగా గాలి గూడెం గ్రామాలు ఏర్పడ్డాయని చెబుతారు[1].
గ్రామ పంచాయితీ
మార్చు- గాలిగూడెం 1995 నుండి గ్రామ పంచాయితీ. తొలి సర్పంచిగా కనకం నాగమణి పనిచేయగా , ఆమె తర్వాత క్యాత్రమోని రాములు ముదిరాజ్ , క్యాత్రమోని చంద్ర శేఖర్ ముదిరాజ్ s/o రాజ లింగం ,సర్పంచులుగా పనిచేశారు . డా . పాలమూరి యాదయ్య (ప్రస్తుతం ) సర్పంచుగా పనిచేస్తున్నారు .
- ఈ పంచాయితీలో ఏడు గ్రామాలు ఉన్నాయి. అవి : నంద్యా నాయక్ తండా, ధర్మ నాయక్ తండా, పాల్త్యా నాయక్ తండా, దామరిగిద్ద తండా, సుక్యా తండా, లంగదాస్య తండా, గాంగ్య తండా.
విశేషాలు
మార్చు- గాలిగూడెం మొత్తం జనాభా 2,000 కంటే ఎక్కువ ఉంది.
- ఈ గ్రామంలో 5 నీటి చెరువులు ఉన్నాయి. అవి మానెం చెరువు, పత్తిరేణు కుంట, కర్ణమోని కుంట, ఒంగోలు కుంట, రాజ కుంట ఉన్నాయి.
- ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం, శివాలయం, మల్లికార్జున ఆలయం, వెంకటేశ్వర దేవాలయం, పోచమ్మ ఆలయం, మైసమ్మ దేవాలయం ఉన్నాయి.
- ఈ గ్రామంలో 3 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి.
- ఇక్కడ ప్రధాన పంటలు : పల్లపు ప్రాంతాలలో వరి, జొన్న, మొక్కజొన్న, పత్తి, మెట్ట ప్రాంతాలలో రాగులు, ఉలవలు, నువ్వులు.
- పబ్లిక్ రవాణా వ్యవస్థ బస్సు ద్వారా షాద్ నగర్ నుండి రెగ్యులర్ బస్సు సేవలు నడుస్తుంది.
- ఇక్కడ తపాలా కార్యాలయం ఉంది.
- సమీప ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం కొందుర్గ్ వద్ద నున్నది.
- సమీప రైల్వే స్టేషను షాద్ నగర్.
- సమీప విమానాశ్రయం ఉంది రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, షంషాబాద్.
మూలాలు
మార్చు- ↑ సూర్య దినపత్రిక, ప్రథమ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక, మహబూబ్ నగర్ జిల్లా, అక్టోబర్, 2008, పుట - 42