గిరిజా కళ్యాణం (నవల)

గిరిజా కళ్యాణం నవల ప్రముఖ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి రచించింది.

గిరిజా కళ్యాణం
గిరిజాకళ్యాణం పుస్తక ముఖపత్రం
కృతికర్త: యద్దనపూడి సులోచనారాణి
అంకితం: రచయిత్రి కుమార్తె శైలూకి
ముఖచిత్ర కళాకారుడు: బాపు
దేశం: భారత దేశం
భాష: తెలుగు
ప్రక్రియ: నవల
ప్రచురణ: ఎమెస్కో బుక్స్
విడుదల: 2005(ఎమెస్కో ద్వారా పునర్ముద్రణకు)
పేజీలు: 280

రచన నేపథ్యం

మార్చు

నవలాదేశపు రాణి బిరుదు పొందిన యద్దనపూడి సులోచనారాణి గిరిజా కళ్యాణం నవల రచించగా అనంతరం ఆగస్టు 2005, ఆగస్టు 2011ల్లో పునర్ముద్రణలు పొందింది. పునర్ముద్రణలకు ఎమెస్కో బుక్స్ సంస్థ ప్రచురణ చేసింది. యద్దనపూడి సులోచనారాణి తన కూతురికి నా జీవితంలో ఆశాదీపం అయిన ప్రియమైన శైలూకి ప్రేమతో - అమ్మ అంటూ అంకితమిచ్చారు.

ఇతివృత్తం

మార్చు

పెళ్ళంటే పవిత్రమైన బంధమనే అభిప్రాయమున్న కథానాయిక గిరిజ. జీవితమంటే భార్య, పిల్లలు, బాధ్యత అనే ఎలాంటి బాదరబందీ లేకుండా ఆకాశంలో విహంగంలా స్వేచ్ఛగా, ఆనందంగా సాగిపోవాలంటాడు చెందూ. విధివశాత్తూ భిన్నధృవాల వంటి వారిద్దరూ భార్యాభర్తలు అవుతారు. పెళ్ళయిన మొదటి రాత్రే చెందూ ఇది కేవలం తాతయ్య పోరు పడలేక చేసుకున్న పెళ్ళి, నీకూ నాకూ నాకూ ఎలాంటి సంబంధమూ లేదు. త్వరలో నీకు డైవోర్స్ ఇచ్చేస్తాను అని చెప్పేసి గిరిజని నిశ్చేష్టురాలిని చేశాడు. వారి జీవితం ఏ మలుపులు తీసుకుందన్నది ప్రధానమైన ఇతివృత్తంగా నవల వ్రాశారు.

మూలాలు

మార్చు