గుంటూరు హిందూ నాటక సమాజం

గుంటూరు హిందూ నాటక సమాజం తెలుగు నాటకరంగంలో ఆధునికకాలంలో ప్రథమ దశలో స్థాపించబడిన నాటక సంస్థ.

ప్రారంభం

మార్చు

కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి తన మిత్రులైన తోలేటి అప్పారావు, పాతూరి శ్రీరాములు, పోలూరి హనుమంతరావు, ఇతర శిష్యులతో 1880-81 లలో ఈ సమాజాన్ని స్థాపించారు.[1] దీనికంటే ముందు కందుకూరి వీరేశలింగం పంతులు 1880వ సంవత్సరం నవంబరు, డిసెంబరు నెలలో స్థాపించిన సమాజం విద్యార్థి నాటక సమాజవడం వల్ల, అది కొద్దిరోజుల్లోనే అంతరించిపోవుట వల్ల గుంటూరు హిందూ నాటక సమాజమే మొదటిది అవుతుంది.[2][3] గుంటూరు అగ్రహారంలోని ఏడుగొందుల సందులో నాటకశాలను నిర్మించుకున్నారు.[4]

ఈ సమాజ ప్రదర్శన లకు తగిన ప్రదేశంలో పాకలు వేయడం, తెరలు సిద్ధంచేయడం, నాటక పాత్రలకు కావలసిన దుస్తులు, అలంకారాలు మొదలైనవి పొత్తూరు కృష్ణయ్య, భువనగిరి హనుమద్దీక్షితులు, భాగవతుల రాఘవయ్యలు చూసుకునేవారు.[5] ప్రతి నాటకంలో నాయక పాత్రలను కలపటపు నరసంహం అనే విద్యార్థి, స్త్రీ పాత్రలను చెన్నూరి సూర్యప్రకాశరావు, భువనగిరి సూర్యనారాయణ అనేవారు వేసేవారు.

ఈ సమాజం నాలుగైదు సంవత్సరాలు మాత్రమే నడిచింది. ధనాపేక్ష లేకుండా వినోదం కోసమే నాటకాలను ప్రదర్శించారు. రాజమహేంద్రవరంలో హరిశ్చంద్ర నాటక మొదటి ప్రదర్శన సమయంలో ప్రదర్శన పాకపై ఎవరో నిప్పువేయడంతో స్వల్ప ప్రమాదం జరిగింది. మరలా 1884లో రెంవడసారి ప్రదర్శన విజయవంతగా జరిగింది. ఈ సమాజంవారు ఎక్కువగా వచన నాటకాలను ప్రదర్శించేవారు. అందుచేత, వచన నాటకాలకు వరవడి దిద్దినది గుంటూరు హిందూ నాటక సమాజమేనని చెప్పవచ్చు.

మూలాలు

మార్చు
  1. గుంటూరు హిందూ నాటక సమాజం, తెలుగు నాటక వికాసము, పి.ఎస్.ఆర్. అప్పారావు, నాట్యమాల ప్రచురణ, ప్రథమ ముద్రణ (డిసెంబర్ 23, 1967), పుట. 513.
  2. నవతెలంగాణ. "తెలంగాణ తొలి నాటక కర్త కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి". Retrieved 19 July 2017.[permanent dead link]
  3. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.690.
  4. తొలి తెలుగు సంచార నాటక సమాజం, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 2 జనవరి 2017, పుట.14
  5. గుంటూరు హిందూ నాటక సమాజం, తెలుగు నాటక వికాసము, పి.ఎస్.ఆర్. అప్పారావు, నాట్యమాల ప్రచురణ, ప్రథమ ముద్రణ (డిసెంబర్ 23, 1967), పుట. 514.