గుడుంబా శంకర్ వీరశంకర్ దర్శకత్వంలో 2004 లో విడుదలైన తెలుగు చిత్రం. ఇందులో పవన్ కళ్యాణ్, మీరా జాస్మిన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని నాగేంద్రబాబు అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించాడు. మన్యం రమేష్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించాడు. మణిశర్మ సంగీత దర్శకత్వం వహించాడు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి, చంద్రబోస్, మాస్టార్జీ పాటలు రాశారు. ఛోటా కె. నాయుడు కెమెరామెన్ గా పనిచేశాడు.[1] ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సగటు చిత్రంగా నిలిచింది.

గుడుంబా శంకర్
దర్శకత్వంవీరశంకర్ బైరిశెట్టి
రచన
నిర్మాత
తారాగణంపవన్ కళ్యాణ్
మీరా జాస్మిన్
ఆశిష్ విద్యార్థి
ఛాయాగ్రహణంఛోటా కె. నాయుడు
సంగీతంమణిశర్మ
పంపిణీదార్లుఅంజనా ప్రొడక్షన్స్ & క్యాడ్ మూవీస్
విడుదల తేదీ
2004 సెప్టెంబరు 10 (2004-09-10)
దేశంభారత్
భాషతెలుగు

కథ మార్చు

గుడుంబా శంకర్ చిల్లర దొంగతనాలు చేసుకుంటూ పొట్ట పోసుకునే వ్యక్తి. పోలీసుల పేరుతో మోసం చేసి డబ్బులు దోచేస్తుంటాడు. ఒకసారి దొంగతనం చేసి పారిపోతుండగా గౌరి అనే అమ్మాయి తారసపడుతుంది.

నటులు మార్చు

సాంకేతికవర్గం మార్చు

పాటలు మార్చు

ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకత్వం వహించాడు. ఇందులో మొత్తం ఆరు పాటలున్నాయి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి, చంద్రబోస్, మాస్టార్జీ పాటలు రాశారు.

  • లేలే లేలే (గానం: కెకె) రచన: చంద్రబోస్
  • చిగురాకు చాటు చిలకా (ఎస్. పి. చరణ్, సుజాత) రచన: సిరివెన్నెల
  • చిలకమ్మా , రచన: చంద్రబోస్ , గానం. కార్తీక్, శ్రీ వర్డిని
  • చిట్టి నడుమునే చూస్తున్నా (మల్లికార్జున్) రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
  • ఏమంటారో , రచన: చంద్రబోస్, గానం. ఎస్ పి. చరణ్, హరిణి
  • కిళ్ళి కిళ్ళి కిళ్ళి కిళ్ళి నమిలాకా బాగున్నదే నాగమల్లి (గానం: ఖుషి మురళిదర్ , పవన్ కళ్యాణ్ ) రచన: మాస్టర్ జీ

మూలాలు మార్చు

  1. "Telugu cinema Review - Gudumba Shankar - Pawan Kalyan, Meera Jasmine". www.idlebrain.com. Retrieved 2020-09-15.
  2. "Meera Jasmine's luminous charm and performance". The Times of India (in ఇంగ్లీష్). 2018-09-10. Retrieved 2020-09-15.

బయటి లంకెలు మార్చు