అంజనా ప్రొడక్షన్స్
అంజనా ప్రొడక్షన్స్, తెలుగు సినీ నిర్మాణ సంస్థ. సినీ నటుడు చిరంజీవి, అతని సోదరుడు నాగేంద్ర బాబు 1988లో హైదరాబాదులో ఈ సంస్థను స్థాపించారు. ఈ సంస్థకు వారి తల్లి అంజనా దేవి పేరు పెట్టారు. తెలుగు సినిమారంగంలోని ముఖ్య నిర్మాణ సంస్థలలో ఒకటైన ఈ అంజనా ప్రొడక్షన్స్, అల్లు-కొణిదెల కుటుంబానికి చెందిన నిర్మాణ సంస్థగా పరిగణించబడుతోంది.[1][2]
రకం | ప్రైవేటు |
---|---|
పరిశ్రమ | సినిమారంగం |
స్థాపన | 1988 (హైదరాబాదు) |
స్థాపకుడు | చిరంజీవి |
ప్రధాన కార్యాలయం | , |
కీలక వ్యక్తులు | చిరంజీవి నాగేంద్ర బాబు పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ |
ఉత్పత్తులు | సినిమాలు |
అనుబంధ సంస్థలు |
|
సినిమా నిర్మాణం
మార్చుఅంజనా ప్రొడక్షన్స్ సంస్థ నుండి మొదటగా 1988లో కె. బాలచందర్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రుద్రవీణ అనే సంగీత ప్రధాన సినిమా రూపొందింది. ఈ సినిమా భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో జాతీయ ఉత్తమ సమైక్యతా చిత్రం గా నర్గిస్ దత్ అవార్డును గెలుచుకుంది. [3] ఈ సంస్థ, తరువాత త్రినేత్రుడు (1988), ముగ్గురు మొనగాళ్ళు (1994), బావగారూ బాగున్నారా? (1998) వంటి చిత్రాలను నిర్మించింది.[1]
2000-2009
మార్చునాగేంద్రబాబు ప్రధాన పాత్రలో కౌరవుడు (2004) సినిమా వచ్చింది. తరువాత, పవన్ కళ్యాణ్ తో గుడుంబా శంకర్ (2004), చిరంజీవితో కలిసి స్టాలిన్ (2006) సినిమాలు తీశారు[1][4]
2010
మార్చు2010లో రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఆరెంజ్ సినిమా ఫెయిల్ అవడంతో తనకు తీవ్ర నష్టాలు వచ్చాయిని, ఇకపై సినిమాలు నిర్మించబోనని నాగేంద్రబాబు ప్రకటించాడు.[5][6]
సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా పేరు | తారాగణం | దర్శకుడు |
---|---|---|---|
1988 | రుద్రవీణ | చిరంజీవి, శోభన | కె. బాలచందర్ |
1988 | త్రినేత్రుడు | చిరంజీవి, భానుప్రియ, నాగేంద్ర బాబు | ఎ.కోదండరామిరెడ్డి |
1994 | ముగ్గురు మొనగాళ్ళు | చిరంజీవి, నగ్మా, రోజా, రమ్యకృష్ణ | కె. రాఘవేంద్రరావు |
1998 | బావగారూ బాగున్నారా? | చిరంజీవి, రంభ, రచన | జయంత్ సి పరాన్జీ |
2000 | కౌరవుడు | నాగేంద్ర బాబు, రమ్యకృష్ణ | జ్యోతి కుమార్ |
2004 | గుడుంబా శంకర్ | పవన్ కళ్యాణ్, మీరా జాస్మిన్ | వీర శంకర్ బైరిశెట్టి |
2005 | రాధా గోపాళం | శ్రీకాంత్, స్నేహ, బ్రహ్మానందం | బాపు |
2006 | స్టాలిన్ | చిరంజీవి, త్రిష, కుష్బూ | మురుగ దాస్ |
2010 | ఆరెంజ్ | రామ్ చరణ్, జెనీలియా డిసౌజా, షాజాన్ పదమ్సీ | భాస్కర్ |
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 "నేడు నాగబాబు పుట్టినరోజు" [Today is Nagababu's birthday]. Prajasakti. 29 October 2015. Archived from the original on 26 October 2016. Retrieved 21 January 2021.
- ↑ Bhargavi (2014-01-02). "Mega banners Geetha Arts, Anjana Productions out of work?". www.thehansindia.com. Retrieved 21 January 2021.
- ↑ Rajadhyaksha, Ashish; Willemen, Paul (1998) [1994]. Encyclopedia of Indian Cinema (PDF). Oxford University Press. p. 486. ISBN 0-19-563579-5.
- ↑ "Archived copy". Archived from the original on 17 June 2012. Retrieved 21 January 2021.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ kavirayani, suresh (2018-05-02). "I lost my confidence after Orange: Naga Babu". Deccan Chronicle. Retrieved 21 January 2021.
- ↑ "All's not well between Chiru & brothers - Times of India". The Times of India. Retrieved 21 January 2021.
ఇతర లంకెలు
మార్చు- అంజనా ప్రొడక్షన్స్ on IMDbPro (subscription required)