గుదిబండి వెంకటరెడ్డి

గుదిబండి వెంకటరెడ్డి సీనియర్ రాజకీయ నేత, దుగ్గిరాల మాజీ ఎమ్మెల్యే.

గుదిబండి వెంకటరెడ్డి

జీవిత విశేషాలు

మార్చు

ఆయన ఒకప్పటి దుగ్గిరాల నియోజకవర్గం పరిధిలోని కొల్లిపరలో 1944 ఏప్రిల్ 1 న కామేశ్వరమ్మ, నరసింహారెడ్డి దంపతులకు ఆయన జన్మించాడు. ఆయన తొలుత కొల్లిపర పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం అధ్యక్షుడిగా తొమ్మిదేళ్లు పనిచేశారు. 1989లో దుగ్గిరాల ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరఫున ఎన్నికయ్యారు. అక్కడి నుంచే వరుసగా నాలుగు పర్యాయాలు 1989 నుండి 2004 వరకూ విజయం సాధించి ఆనవాయితీని బ్రేక్ చేశారు. విలువలు కలిగిన ప్రజానాయకుడిగా గుర్తింపు పొందారు.

2009లో నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణలో దుగ్గిరాల నియోజకవర్గం రద్దవడంతో వెంకటరెడ్డి ఆ తర్వాత ఎన్నికల్లో పోటీచేయలేదు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆప్తుడైన ఆయన ఆ అభిమానంతోనే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అభిమానిగా ఉంటూ, 2014 ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం పాటుపడ్డాడు.[1]

వీరి హయాంలో ఈ గ్రామాలలో చాలావరకూ అభివృద్ధి సాధించారు. పలుచోట్ల వంతెనలు, కాలి వంతెనల నిర్మాణం, కరకట్ట పనులు, గ్రామాలలో భారీగా సిమెంటు రహదారులు వేయించారు.[2]

కొంతకాలంగా మధుమేహంతో బాధపడుతున్న ఆయన గుంటూరులోని ఓ కార్పొరేట్ వైద్యశాలలో అక్టోబరు 7 2016 న మరణించాడు.

మూలాలు

మార్చు