గునిపాటి రామయ్య
గునిపాటి రామయ్య కడప జిల్లా రాజంపేట టీడీపీ పార్లమెంట్ ఇన్‌చార్జీ, మాజీ పార్లమెంటు సభ్యుడు.
జీవిత విశేషాలు
మార్చుఆయన కడప జిల్లా రాజంపేట పరిధిలోని మంగంపేటలో నిరుపేద కుటుంబంలో జన్మించారు.ఆయన తండ్రి పేరు చెన్నయ్య.[1] ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. 1999లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఆయనకు రాజంపేట ఎంపీ టికెట్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో ఆయన విజయఢంకా మోగించి పార్లమెంటులో అడుగుపెట్టారు. 1999 నుంచి 2004 వరకు రాజంపేట ఎంపీగా ఉన్నారు. ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు కాస్తంత దూరంగా జరిగిన రామయ్య మళ్లీ 2009 లో పీఆర్పీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఓడిపోయారు[2]. 2014 ఎన్నికల్లో మళ్లీ క్రియాశీలకంగా మారి రాజంపేట అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తరువాత ఆయన రాజంపేట అసెంబ్లీ టీడీపీ ఇన్ చార్జీగా వ్యవహరిస్తున్నారు.[3]
మరణం
మార్చుకొద్ది రోజులుగా అనారోగ్యంతో నగరంలోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 13 2016 న మరణించారు.[4]