గురి 2004, మార్చి 5 న విడుదలైన తెలుగు చలనచిత్రం. భరత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీహరి, నవీన్ వడ్డే, సంఘవి, పొన్నాంబళం, ధర్మవరపు సుబ్రమణ్యం నటించగా, సురేష్ సంగీతం అందించారు.[1]

గురి
దర్శకత్వంభరత్‌
నిర్మాతతలమంచి నరసారెడ్డి
తారాగణంశ్రీహరి, నవీన్ వడ్డే, సంఘవి, పొన్నాంబళం, ధర్మవరపు సుబ్రమణ్యం
ఛాయాగ్రహణంతోట ఎం నాయుడు
కూర్పుశ్రీనివాస్ మేగన, పసుపులేటి శ్రీను
సంగీతంసురేష్
నిర్మాణ
సంస్థలు
శ్రీ దాక్షాయణి క్రియేషన్స్; ఏలూరు సురేందర్ రెడ్డి ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2004 మార్చి 5 (2004-03-05)
సినిమా నిడివి
122 నిముషాలు
దేశంభారతదేశం

కథ మార్చు

శ్రీహరి ఒక రైతు. ఆయన తండ్రి విత్తనాల ఎజెంట్‌. లోకల్‌ డిస్ట్రిబ్యూటర్‌ పంపిణీ చేసిన నకిలీ విత్తనాలను పంచి రైతుల నష్టాలకు కారణమవుతాడు. కానీ ఇందులో నా తప్పేమీ లేదని, డిస్ట్రిబ్యూటర్‌ మోసం చేశాడని, ఆయన ఒక లెటర్‌ రాసి భార్య, కూతురుతో సహా ఆత్మహత్య చేసుకుంటారు. తన తండ్రి నిర్దోషని నిరూపించేందుకు కలెక్టర్‌, డిస్ట్రిబ్యూటర్‌, ఎస్పీ, వ్యవసాయ శాఖ మంత్రిని కలుస్తాడు. కానీ వారు అంతా ఒకటేనని తెలుసుకొని వారిని అంతమొందించేందుకు ప్రయత్నిస్తాడు.

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • దర్శకత్వం: భరత్‌
  • నిర్మాత: తలమంచి నరసారెడ్డి
  • సంగీతం: సురేష్
  • ఛాయాగ్రహణం: తోట ఎం నాయుడు
  • కూర్పు: శ్రీనివాస్ మేగన, పసుపులేటి శ్రీను
  • నిర్మాణ సంస్థ: శ్రీ దాక్షాయణి క్రియేషన్స్; ఏలూరు సురేందర్ రెడ్డి ప్రొడక్షన్స్
  • పాటలు: భారతీబాబు
  • గానం: శ్రీకాంత్, లలితా సాగరి, నిత్యసంతోషిణి, శ్రీహరి

మూలాలు మార్చు

  1. IndianCine.ma. "Guri". indiancine.ma. Retrieved 6 November 2018.[permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=గురి&oldid=4103847" నుండి వెలికితీశారు