గుర్మీత్ బావా
గుర్మీత్ బావా (1944 ఫిబ్రవరి 18 - 2021 నవంబరు 21) భారతీయ పంజాబీ భాషా జానపద గాయని. ఆమె దాదాపు 45 సెకన్ల పాటు శ్వాసను పట్టుకోవడం ద్వారా లంబి హెక్ డి మలికా గా ప్రసిద్దిచెందింది. భారతీయ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్‌కాస్టర్ దూరదర్శన్లో పాడిన మొదటి పంజాబీ మహిళా గాయని ఆమె. ఆమెకు 2022లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు (మరణానంతరం)ను అందజేసింది.[1]
గుర్మీత్ బావా | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | కోతే, పంజాబ్ ప్రావిన్స్, బ్రిటిష్ ఇండియా | 1944 ఫిబ్రవరి 18
మరణం | 2021 నవంబరు 21 అమృతసర్, పంజాబ్, భారతదేశం | (వయసు 77)
సంగీత శైలి | పంజాబీ జానపదం |
వృత్తి | గాయని |
క్రియాశీల కాలం | 1968–2021 |
సంబంధిత చర్యలు | కిర్పాల్ బావా |
జీవితం తొలి దశలో
మార్చుగుర్మీత్ బావా 1944లో బ్రిటీష్ పంజాబ్‌లోని కోతే గ్రామంలో ఎస్. ఉత్తమ్ సింగ్, రామ్ కౌర్ దంపతులకు గుర్మీత్ కౌర్‌గా జన్మించింది.[2] ఈ గ్రామం ఇప్పుడు భారతదేశంలో పంజాబ్లోని గుర్‌దాస్‌పూర్ జిల్లాలో భాగంగా ఉంది.[3]
ఆమెకు రెండేళ్ల వయసులో తల్లి చనిపోయింది.[3] అప్పట్లో పెద్దల అనుమతి లేకుండా ఆడపిల్లలు చదువుకోవడమో, బయటికి వెళ్లడమో చేసేవారు కాదు కానీ టీచర్ కావాలని కలలు కన్న ఆమె జూనియర్ బేసిక్ ట్రైనింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఈ ప్రాంతానికి చెందిన మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా నిలిచిన ఘనత దక్కించుకుంది.[3]
కెరీర్
మార్చుఆమె 1968లో తన వృత్తిని ప్రారంభించింది. ఆమె అల్గోజా, చిమ్తా, ఢోల్కీ, తుంబితో సహా పంజాబీ జానపద వాయిద్యాలతో పాడింది. ఆమె కెరీర్ ప్రారంభంలో ముంబైలో పంజాబ్ అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రేమ్ చోప్రా, ప్రాణ్, రాజ్ కపూర్ వంటి బాలీవుడ్ తారల నుండి ప్రశంసలు అందుకుంది. కపూర్ ప్రముఖంగా బోలి, మెయిన్ జట్టి పంజాబ్ డి, మేరీ నర్గీస్ వార్గీ అఖ్ అని ఆమెను అభివర్ణించాడు.
ఆమె విదేశాల్లో కూడా పలు ప్రదర్శనలు ఇచ్చింది. 1987లో USSRలో, 1988లో జపాన్‌లో నిర్వహించిన ఫెస్టివల్ ఆఫ్ ఇండియా సందర్భంగా ఆమె భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఆమె 1988లో బ్యాంకాక్లోని థాయ్‌లాండ్ కల్చర్ సెంటర్‌లో ప్రదర్శన ఇచ్చింది. బోస్రా ఉత్సవం, 1989లో ట్రిపోలీ, లిబియాలో జరిగిన 25వ జషన్-ఇ-ఆజాదీ ఉత్సవంలో కూడా దేశం తరపున ప్రాతినిధ్యం వహించింది.
ఆమె తన హెక్, జానపద పద్యాలను ఒకే శ్వాసలో పాడగల సామర్థ్యంతో ప్రసిద్ది చెందింది. ఆమె పాట పాడే సమయంలో కనీసం 45 సెకన్ల పాటు శ్వాస నిలుపగల లక్షణంతో లంబి హెక్ డి మలికా అంటే సుదీర్ఘ శ్వాసలో పాడే రాణి అని గుర్తింపుతెచ్చుకుంది.
బాగా ప్రాచూర్యంలోకి వచ్చిన ఆమె సింగిల్స్‌లో జుగ్ని (ట్రాన్స్‌ల్. స్పిరిట్ ఆఫ్ లైఫ్) కవర్ ఉంది. భారతీయ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్‌కాస్టర్ దూరదర్శన్లో పాడిన మొదటి పంజాబీ మహిళా గాయని కూడా ఆమె. ఆమె ఇతర ప్రసిద్ధ పాటల్లో ఘోరియన్ (పంజాబీ వివాహ పాట), మీర్జా (మీర్జా సాహిబాన్ పంజాబీ గాథ) ఉన్నాయి. పంజాబీ జానపద గాయకులు ఉపయోగించే గాలి వాయిద్యమైన అల్గోజాతో ఆమె ప్రదర్శనలు చేసింది. అల్గోజా, ధోల్, చిమ్తా ఇలా వివిధ పంజాబీ జానపద వాయిద్యాలను ప్రాచుర్యంలోకి తెచ్చినందుకు ఆమెను పమ్మీ బాయి మెచ్చుకుంది.
వ్యక్తిగత జీవితం
మార్చుఆమెకు కిర్పాల్ బావా అనే పంజాబీ జానపద గాయకుడితో వివాహం జరిగింది.[3] వారికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో ఇద్దరు లచి బావా, గలోరి బావా గాయకులు. కాగా లచి బావా, ఫిబ్రవరి 2020లో మరణించింది.[4]
అవార్డులు
మార్చుసంగీత నాటక అకాడమీ ద్వారా రాష్ట్రపతి పురస్కార గ్రహీత[4] కూడా అయిన ఆమె పలు పురస్కారాలు అందుకుంది. కళారంగంలో చేసిన విశేష కృషికి జనవరి 2022లో ఆమె మరణానంతరం పద్మభూషణ్ పురస్కారంతో భారత ప్రభుత్వం స్మరించుకుంది.[5]
- 1991లో పంజాబ్ ప్రభుత్వంచే రాష్ట్ర అవార్డు[3]
- పంజాబ్ నాటక అకాడమీ ద్వారా సంగీత పురస్కారం
- 2002లో మధ్యప్రదేశ్ ప్రభుత్వంచే జాతీయ దేవి అహిల్య అవార్డు
- 2008లో పంజాబీ భాషా శాఖచే శ్రోమణి గయికా అవార్డు
మరణం
మార్చుగుర్మీత్ బావా 77 వయస్సులో 2021 నవంబరు 21న అమృత్‌సర్‌లోని ఒక ఆసుపత్రిలో మరణించింది.[6]
మూలాలు
మార్చు- ↑ "President Kovind presents Padma Awards at 2022 - Sakshi". web.archive.org. 2023-05-04. Retrieved 2023-05-04.
- ↑ "ਲੰਮੀ ਹੇਕ ਦੀ ਮਲਿਕਾ ਗੁਰਮੀਤ ਬਾਵਾ". The Punjabi Tribune. 1 October 2011. Retrieved 10 May 2012.
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 "Shiromani Gayika award for Bawa". The Tribune. Amritsar. 8 August 2008. Retrieved 10 May 2012.
- ↑ 4.0 4.1 "Punjabi folk singer Gurmeet Bawa passes away at 77". Hindustan Times (in ఇంగ్లీష్). 22 November 2021. Retrieved 24 November 2021.
- ↑ Goyal, Divya (26 January 2022). "'Lambi hek di mallika' Gurmeet Bawa awarded Padma Bhushan". The Indian Express (in ఇంగ్లీష్). Archived from the original on 26 January 2022. Retrieved 26 January 2022.
- ↑ Bagga, Neeraj. "Punjabi singer Gurmeet Bawa dies at 77". The Tribune (in ఇంగ్లీష్). Archived from the original on 21 November 2021. Retrieved 21 November 2021.