ప్రేమ్ చోప్రా (జననం 1935 సెప్టెంబరు 23) హిందీ చిత్రాలలో భారతీయ నటుడు. దాదాపు 60 ఏళ్ల ఆయన కెరీర్ లో 380 సినిమాల్లో నటించాడు. చాలా సినిమాల్లో విలన్‌గా నటించినప్పటికీ సాఫ్ట్‌ డిక్షన్‌ని కలిగి ఉన్నాడు. ఆయన విలన్‌గా, రాజేష్ ఖన్నా ప్రధాన పాత్రలో నటించిన 19 చిత్రాలు ప్రేక్షకుల మన్ననలు, విమర్శకుల ప్రశంసలు పొందాయి.[1]

ప్రేమ్ చోప్రా
2013లో ప్రేమ్ చోప్రా
జననం (1935-09-23) 1935 సెప్టెంబరు 23 (వయసు 89)
లాహోర్, పంజాబ్ ప్రావిన్స్, బ్రిటిష్ ఇండియా.
(ప్రస్తుత పంజాబ్, పాకిస్తాన్ )
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1960–2021
జీవిత భాగస్వామి
ఉమా మల్హోత్రా
(m. 1969)
పిల్లలు3
బంధువులుశర్మన్ జోషి (అల్లుడు)
వికాస్ భల్లా (అల్లుడు)
ప్రేమ్ నాథ్ (బావమరిది)
రాజేంద్ర నాథ్ (బావమరిది)
నరేంద్ర నాథ్ (బావమరిది)
రాజ్ కపూర్
వెబ్‌సైటుhttp://www.premchopra.com

ఏప్రిల్ 2014లో, ఆయన జీవిత చరిత్రను ప్రేమ్ నామ్ హై మేరా, ప్రేమ్ చోప్రా అనే పేరుతో అతని కుమార్తె రకితా నందా పుస్తకం విడుదలచేసింది.[2]

ప్రారంభ జీవితం

మార్చు

పంజాబీ హిందూ కుటుంబానికి చెందిన రణబీర్ లాల్, రూపాణి చోప్రా దంపతుల ఆరుగురు సంతానంలో మూడవ వాడు అయిన ప్రేమ్ చోప్రా, 1935 సెప్టెంబరు 23న లాహోర్‌లో జన్మించాడు.[3][4] భారతదేశ విభజన తర్వాత, వారి కుటుంబం సిమ్లాకు మారింది. అతని చదువు అక్కడే కొనసాగింది.[5][6] ఆయన పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాడు.

కెరీర్

మార్చు

తన కళాశాల రోజుల్లో అనేక నాటకాలలో పాల్గొనడం వల్ల నటనపై ఆసక్తిని పెంచుకున్నాడు. అతని తల్లిదండ్రుల నుండి గట్టి వ్యతిరేకత ఉన్నప్పటికీ, అతను బాలీవుడ్ చిత్రాలలో నటించాలనే తన కలను సాకారంచేసుకోవడానికి బొంబాయి చేరుకున్నాడు. అయితే, చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టడానికి ప్రయత్నిస్తున్న సమయంలో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేసాడు. బెంగాల్, ఒరిస్సా, బీహార్‌లలో పేపర్ సర్క్యులేషన్‌ను చూసుకోవాల్సరావడంతో ఆయన నెలలో 20 రోజులు పర్యటించవలసి వచ్చేది. తన టూరింగ్ టైమ్‌ను తగ్గించుకోవడానికి, రైల్వే స్టేషన్‌లలోనే తనను వచ్చి కలవమని ఏజెంట్లను కోరేవాడు.[7] ఈ క్రమంలో ఒకరోజు సబర్బన్ రైలులో ప్రయాణిస్తుండగా, ఒక అపరిచితుడు మీకు సినిమాల్లో నటించడానికి ఆసక్తి ఉందా అని అడిగాడు. అలా ప్రేమ్ చోప్రా తన మొదటి సినిమా అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు.[8]

అతని తొలి చిత్రం చౌదరి కర్నైల్ సింగ్, పంజాబీ సినిమా. ఇండో-పాక్ విభజన నేపథ్యంలో సాగే హిందూ-ముస్లిం రొమాంటిక్ ప్రేమకథ. అది పెద్ద విజయాన్ని సాధించింది. ఈ చిత్రం ఉత్తమ నటి, ఉత్తమ చిత్రం విభాగాల్లో జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది.[9] తన తొలి చిత్రానికి రూ.2500 చెల్లించారు.[10] సినిమా పూర్తి కావడానికి దాదాపు మూడేళ్లు పట్టింది.

సమాజ్ కో బాదల్ దాలో (1970), హల్చల్ (1971) వంటి చిత్రాలలో ఆయన ప్రధాన పాత్రలు పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఆయన తెలుగు సినిమా నటీమణులు కాంచన, శారద సరసన కూడా జతకట్టాడు.

ముహమ్మద్ రఫీ పాడిన "తుమ్ అప్నీ సహేలీ కో ఇత్నా బతా దో కి ఉస్సే కోయి ప్యార్ కర్నే లగా హై", కిషోర్ కుమార్ పాట "రహ్ మే కలియా" లతో ప్రేమ్ చోప్రా మరింత ప్రజాదరణ పొందాడు. బాబీ సినిమాలోని "ప్రేమ్ నామ్ హై మేరా, ప్రేమ్ చోప్రా" అనే డైలాగ్ బాగా పాపులర్ అయింది.

ఇలా తన సుదీర్ఘ బాలీవుడ్‌ కెరీర్‌లో విలన్ పాత్రలకు ప్రసిద్ధి చెందాడు.

అవార్డులు

మార్చు
  • 1971 – హిమ్మత్ చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు నామినేట్ చేయబడింది
  • 1976 – దో అంజానే చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు
  • 1976 – మెహబూబా చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు నామినేట్ చేయబడింది
  • 2004 – అట్లాంటిక్ సిటీలో లెజెండ్ ఆఫ్ ఇండియన్ సినిమా అవార్డు[11]
  • జెయింట్స్ - లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
  • లయన్స్ క్లబ్ అవార్డు
  • అశోక అవార్డు
  • ఆశీర్వాద అవార్డు
  • పంజాబీ కళా సంగం అవార్డు[12]
  • 2023: 68వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

మూలాలు

మార్చు
  1. Ravi Sharma (16 December 2017). "Prem Chopra is an Exceptional Human Being - Sharman Joshi". Bollywood Helpline. Archived from the original on 2 February 2019. Retrieved 16 December 2017.
  2. "Book Review: Prem Naam Hai Mera, Prem Chopra". news.biharprabha.com. Indo-Asian News Service. Archived from the original on 10 August 2017. Retrieved 21 April 2014.
  3. [1] Archived 26 మార్చి 2018 at the Wayback Machine, fridaymoviez.com. Retrieved 6 April 2014.
  4. "Prem Chopraa: Official site". Archived from the original on 24 January 2009. Retrieved 22 December 2008.
  5. "आखिर क्यों नम हुईं प्रेम चोपड़ा की आंखें?". Amar Ujala. Archived from the original on 11 October 2020. Retrieved 2019-11-25.
  6. "Official website of actor Prem Chopra". Archived from the original on 25 July 2013. Retrieved 6 April 2014.
  7. [2] Archived 6 ఏప్రిల్ 2014 at the Wayback Machine. Retrieved 6 April 2014.
  8. [3] Archived 17 అక్టోబరు 2013 at the Wayback Machine. Retrieved 6 April 2014.
  9. "Official website of actor Prem Chopra". Archived from the original on 25 July 2013. Retrieved 6 April 2014.
  10. [4] Archived 17 అక్టోబరు 2013 at the Wayback Machine. Retrieved 6 April 2014.
  11. [5] Archived 8 మే 2006 at the Wayback Machine
  12. "Prem Chopra : Official site". Archived from the original on 14 October 2007. Retrieved 19 September 2007.