గుర్‌దాస్‌పూర్ జిల్లా
పంజాబు రాష్ట్రంలో, మాఝా ప్రాంతం లోని జిల్లాలలో గుర్‌దాస్‌పూర్ జిల్లా (పంజాబీ: ਗੁਰਦਾਸਪੁਰ ਜ਼ਿਲ੍ਹਾ) ఒకటి. జిల్లా కేంద్రం గుర్‌దాస్‌పూర్ పట్టణం. జిల్లా సరిహద్దులలో నరోవల్ జిల్లా (పాకిస్థాన్ పంజాబు), జమ్మూ కాశ్మీరు కేంద్రపాలిత ప్రాంతం లోని కథువా జిల్లా, పంజాబ్ లోని అమృత్‌సర్, హోషియార్‌పూర్, హిమాచల్ ప్రదేశ్ లోని చంబా, కాంగ్రా జిల్లాలు ఉన్నాయి. జిల్లాలో బియాస్, రావి నదులు ప్రవహిస్తున్నాయి. మొగల్ సామ్రాజ్యాధినేత అక్బర్, జిల్లా లోని కలనౌర్ పట్టణం లోని తోటలో పట్టాభిషిక్తుడయ్యాడు. అక్బర్ చక్రవర్తి పట్టాభిషేకంతో ఈ పట్టణం చారిత్రక ప్రసిద్ధిచెందింది.[1] ఈ జిల్లా హిమాలయపర్వత పాదాల వద్ద ఉంది.
గుర్‌దాస్‌పూర్ జిల్లా
ਗੁਰਦਾਸਪੁਰ ਜ਼ਿਲ੍ਹਾ | |
---|---|
దేశం | India |
రాష్ట్రం | పంజాబ్ |
Named for | గురియా జీ |
ముఖ్య పట్టణం | గుర్‌దాస్‌పూర్ |
విస్తీర్ణం | |
• Total | 2,610 కి.మీ2 (1,010 చ. మై) |
జనాభా (2001)‡[›] | |
• Total | 21,04,011 |
• జనసాంద్రత | 810/కి.మీ2 (2,100/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | పంజాబీ |
Time zone | UTC+5:30 (IST) |
అక్షరాస్యత | 63.95% |
2011 గణాంకాలను అనుసరించి పంజాబు రాష్ట్రంలో గుర్‌దాస్‌పూర్ జిల్లా జనసఖ్యాపరంగా 3వ స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాలలో లుధియానా, అమృత్‌సర్ జిల్లాలు ఉన్నాయి.[2]
చరిత్ర
మార్చుగ్రీకు వీరుడు అలెగ్జాండర్ ప్రపంచ విజేత కావాలన్న లక్ష్యంతో బియాస్ నదిని దాటి గుర్‌దాస్‌పూర్ జిల్లాలోని ఫతేగఢ్ వద్ద ఉన్న సంగ్ల వద్ద కతియాన్లతో యుద్ధం చేసాడు.
షాహి సామ్రాజ్యం
మార్చు10వ శతాబ్దం నుండి సా.శ. 1919 వరకు ఈ ప్రాంతాన్ని షాహి వంశస్థులు పాలించారు. 14- 16 వ శతాబ్దం మద్య కాలంలో ఢిల్లీ చక్రవర్తుల పాలనలో ఈ జిల్లాలోని కలనౌర్ ప్రాంతానికి అత్యధిక ప్రాధాన్యత ఉంటూ వచ్చింది. జసరత్ ఖోకర్ నిష్ఫలమైన దండయాత్ర తరువాత 1422, 1428లో లాహోరు మీద తిరిగి దాడి చేసాడు. మాలిక్ సికిందర్ సైన్యంతో వచ్చి జసరత్ తో పోరాడి ఓడించి ఈ ప్రాంతాన్ని విడిపించాడు. 1556 ఫిబ్రవరిలో అక్బరు, బైరం ఖాన్‌ను ఈ ప్రాంతానికి ఏలికగా నియమించాడు. నగరానికి తూర్పుగా 1.5కి.మీ దూరంలో మిషనరీ సంస్థ స్థాపించబడింది.
మొఘల్ సామ్రాజ్యం
మార్చుమొఘల్ సామ్రాజ్యం పతనం తరువాత ఈ ప్రాంతంలో సిక్కుల శక్తి తలెత్తింది. ఈ జిల్లాలో కొందరు సిక్కు గురువులు సన్నిహిత సంబంధం కలిగి ఉన్నారు. 1469లో లాహోర్ జిల్లాలో గురునానక్ జన్మించాడు. ఆయన 1485లో మూల్చంద్ కుమార్తె సుల్ఖాను బటాలా తాలూకాలో వివాహం చేసుకున్నాడు. అందుకు గుర్తుగా గురుదాస్పూర్‌లో ఇప్పటికీ జులానా మహల్ ఉంది. రహీలా పేరుతో ఉన్న ఈ పట్టణాన్ని సిక్కు గురువు హర్గోబింద్ శ్రీ హర్గోబింద్‌పూర్‌గా పునర్నిర్మించాడు. గుర్‌గోబింద్ శిష్యుడు బందాసింగ్ బహదూర్ ఈ పట్టాణన్ని కేంద్రంగా చేసుకుని రాజ్యాన్ని లాహోర్ వరకు విస్తరింపజేసాడు. 1711లో బహదూర్‌షా చక్రవర్తి బందాసింగ్ బహదూర్ మీద దాడిచేసాడు. అయినప్పటికీ అది తాత్కాలిక ప్రయత్నమే అయింది. బందా బహదూర్ చివరిసారిగా గురుదాస్ నగర్ వద్ద మొగల్ సైన్యంతో పోరాడి పట్టుబడ్డాడు. తతువాత దోఅబ్ ప్రాంతంపై పెత్తనం కోసం రాంగర్హియా మిస్ల్, కంహలియా మిస్ల్ ల మధ్య జరిగిన పోరాటంలో ఈ ప్రాంతం క్షీణదశను చూసింది.
రంజిత్ సింగ్
మార్చు1808లో పంజాబీ రైతులు ఎదుర్కొన్న సంక్షోభాన్ని నివారించేందుకు 1811లో మహారాజా రంజిత్ సింగ్ ఊరట కలిగిస్తూ దీనానగర్ జిల్లాలో కాలువ నిర్మాణంచేసి ఈ ప్రంతన్ని మామిడి తోటగా మార్చాడు. తరువాత ఆయన తన జీవిత కాలమంతా జూన్, మే మాసాలలో మహారాజా రంజిత్ సింగ్ ఈ ప్రాంతంలోనే గడిపాడు. 1947లో భారత్ పాక్ విడిపోయిన తరువాత గుర్‌దాస్‌పూర్ జిల్లా భవిష్యత్తు మాత్రం చాలాకాలం సందిగ్ధంలో ఉండి పోయింది. అందుకు కారణం జిల్లాలో 51.14% ప్రజలు ముస్లిములు ఉండడమే. గుర్‌దాస్‌పూర్ జిల్లాలోని షకర్‌గర్ తాలూకా పాకిస్థాన్కు ఇచ్చి మిగిలిన భూభాగం మాత్రం భారత్ భూభాగంలో చేర్చబడింది. జిల్లాలోని ముస్లిములు పాకిస్థాన్‌కు వలస వెళ్ళగా పాకిస్థాన్‌కు చెందిన సైలగర్, షకర్‌గర్‌కు చెందిన హిందువులు భారత్‌కు శరణార్ధులుగా వచ్చి చేరారు.
బ్రిటిష్ పాలన
మార్చుబ్రిటిష్ పాలనాకాలంలో గుర్‌దాస్‌పూర్ జిల్లా లాహోర్ సబ్ డివిషన్‌లో ఉండేది. జిల్లా తిరిగి 4 తాలూకాలుగా (గుర్‌దాస్‌పూర్, బటాలా, షకర్‌గర్, పఠాన్‌కోట్. 1881 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 823, 695. 1891 నాటికి ఇది 943, 922 చేరింది. అయినప్పటికీ 1901 నాటికి జనసంఖ్య 940, 334 కు చేరుకుంది. 44, 000 మంది వలస వెళ్ళి ఫైసలాబాద్ లోని చీనాబ్ కాలనీలో స్థిరపడడం ఇందుకు కారణం. 1901 గణాంకాలను అనుసరించి 463, 371 (49%) మంది ముస్లిములు, 380, 636 (40%) మంది హిందువులు, 91, 756 (10%) సిక్కులు ఉన్నారు. అహమ్మదీయ మతస్థాపకుడైన మిర్జా మహమ్మద్‌కు అనుయాయులు ఉన్నారు. [3]
స్వాతంత్రం తరువాత
మార్చు1947లో భారత్- పాక్ విభజన సమయంలో పంజాబు భారత్- పాక్ లకు విభజించబడింది. షకర్గర్ తాలూకా పాకిస్థాన్కు చెందిన సైల్‌కోట్ జిల్లాలో చేర్చబడింది. మిగిలిన గుర్‌దాస్‌పూర్ ప్రాంతం జిల్లాగా మారి భారత భూభాగంలో చేర్చబడింది.[4] జిల్లా విభజన తరువాత రెండు దేశాల మధ్య జనాభా విభజన కూడా జరిగింది. ముస్లిములు పాకిస్థాన్‌కు చేరుకున్నారు. హిదువులు భారత్‌కు చేరుకున్నారు. 2011 27 న గుర్‌దాస్‌పూర్ జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి పఠాన్‌కోట్ జిల్లా రూపొందించబడింది. పఠాన్‌కోట్ ఉపవిభాగాలు (పఠాన్‌కోట్, ధర్కలన్), ఉప తాలూకాలు (నరోట్ జైమల్ సింగ్, బమియల్ ) విభజించబడింది.
శ్రీపిండోదరి ధాం
మార్చుశ్రీ పిండోదరి ధాం (గుర్‌దాస్‌పూర్) సంస్థ పంజాబు రాష్ట్ర సంక్షేమానికి, ప్రజాసంక్షేమానికి సహకరించే కార్యక్రమాలు చేపట్టింది. దీనిని యోగరాజ్ శ్రీ భగవాన్ స్థాపించారు. మొగల్ చక్రవర్తి జహంగీరుకు సేవచేసిన కారణంగా బహుమానంగా యోగరాజ్ శ్రీ భగవాన్ దీనిని సాధించారు. ఆయన ఇక్కడ ప్రశాంతమైన అశ్రమం నిర్మించాడు. ఈ ఆశ్రమం లోని ఆధ్యాత్మికత జహంగీరు చక్రవర్తిని విపరీతంగా ఆకర్షించిన కారణంగా ఆయన ఈ ఆశ్రమనికి విస్తారమైన నిధులు, భూమిని సమకూర్చాడు. అప్పటి నుండి ఇక్కడ అనాథలకు, నిస్సహాయులకు సహాయసహకారాలు అందించబడుతున్నాయి. ఇప్పటి వరకు ఇక్కడ సన్యాసులు, శిష్యులు ఆధ్యాత్మిక బోధలు అందిస్తున్నారు. ఆశ్రమం అందిస్తున్న ఆధ్యాత్మిక ప్రబోధాలకు ప్రభావితులైన పలువురు రాజులు ఈ ఆశ్రమానికి ఆర్థిక సహాయం అందిస్తున్నారు.
విశ్వనాథ్ పీఠం
మార్చుసా.శ.ే శ్రీ స్వామి రాందాస్ (విశ్వనాథ్ పీఠ్ ద్వారాచార్య శ్రీ స్వామి రాందాస్) స్వచ్ఛంద సేవకు, దాతృత్వానికి చిహ్నంగా ఉన్నాడు. ఆయన నిరాడబరం, స్వయంక్రమబద్ధత కలిగిన జీవితానికి ఆయన మార్గదర్శిగా ఉన్నాడు. ఆయన మానవత్వం, కరుణాభరితం అయిన వ్యక్తిత్వం కలిగి ఉన్నడని భావిస్తున్నారు. ఆయన దర్బారులో లభించిన ఆదాయాన్ని ఉపయుక్తంగానూ, దేవుడిసేవకు ఉపయోగిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన శిష్యడు వారసుడు మహంత్ గోబింద్ దాస్ ఆశ్రమాన్ని ఆయన గురువు అడుగుజాడలలో నడిపిస్తున్నాడు.
భౌగోళికం
మార్చుపంజాబు రాష్ట్రంలో గుర్‌దాస్‌పూర్ ఉత్తరసరిహద్దులో ఉంది. ఇది జలంధర్ డివిషన్‌లో ఉంది. ఇది రవి, బియాస్ నదుల మద్య ఉంది. ఈ జిల్లా ఉత్తరంగా 310-36', 320-34' అక్షాంశంలో అలాగే తూర్పుగా 740-56', 750-24' డిగ్రీల రేఖాంశంలో ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులలో పఠాన్ కోట, ఈశాన్య సరిహద్దులో రవి, బియాస్ నది, ఆగ్నేయ సరిహద్దులో హోషియార్‌పూర్, దక్షిణ సరిహద్దులో కపూర్తలా, నైరుతీ సరిహద్దులో అమృత్‌సర్, వాయవ్య సరిహద్దులో పాకిస్థాన్ ఉన్నాయి.
నైసర్గిక స్వరూపం
మార్చుగుర్దాస్పూర్ జిల్లాలోని తాలూకాలైన గుర్‌దాస్‌పూర్, బటాలా, దెరా బాబా నానక్ మైదానాలు పంజాబు రాష్ట్రంలో ఉన్న ఇతర మైదానాలను పోలి ఉంటాయి. జిల్లాలో భూభాగం అసమానతలతో ఉంటుంది. భూభాగాలను రెండుగా విభిజించారు నదీ మైదానాలు ఉన్న దిగువ భూములు, ఎగువ భూములు. జిల్లా దక్షిణప్రాంతం వైశాల్యం 128 చ.కి.మీ. ఇది ఎగుడు దిగుడు భూములు ఉన్న ఎగువ భూభాగం. ఇది సముద్ర మట్టానికి 305 నుండి 381 మీటర్ల ఎత్తు ఉంటుంది. రవి, బియాస్ నదీ పరివాహిక ప్రాంతాలు ఎగువభూములను దిగువభూములతో వేరు చేస్తుంటాయి. నదీ పరివాహిక ప్రాంతాలలో ఇసుక అధికంగా ఉంటుంది. ఎగువభూములలో వైవిధ్యత అధికంగా ఉంటుంది. ఎగువభూములు జిల్లాలోఅధికభాగం ఆక్రమించి ఉన్నాయి. ఈ భూములు జిల్లా ఈశాన్య భాగంలో సముద్రమట్టానికి 305 మీటర్ల, ఆగ్నేయ భూభాగంలో సముద్రమట్టానికి 213 మీటర్ల ఎత్తు ఉంటుంది. .
వాతావరణం
మార్చుజిల్లాలో సాధారణంగా వాతావరణం శీతాకాలం, వేసవి కాలం అని వేరుపడతాయి. ఏప్రిల్ నుండి జూలై వరకు వేసవి కాలం ఉంటుంది. శీతాకాలం నవంబరు నుండి మార్చి వరకు ఉంటుంది. వేసవి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. జూన్ అత్యంత వేడి మాసం, జనవరి అత్యంత చలి మాసంగా ఉంటుంది. జూలైలో వర్షం అధికంగా ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి మాసాలలో శీతాకాలపు వర్షాలు పడుతుంటాయి. మే నుండి జూన్ వరకు ధూళి తుఫాన్ వస్తుంటుంది.
వర్షపాతం
మార్చుఆగ్నేయ వర్షపాతం సాధారణంగా జూలై మొదటి వారం నుండి ఆగస్టు వరకు ఉంటాయి. ఈ సమయంలో దాదాపు 70% వర్షపాతం ఉంటుంది.
పర్యావరణం
మార్చుజిల్లాలో పత్యావరణంలో అత్యధికంగా మార్పులు సంభవించాయి. జనసంఖ్య అభివృద్ధి, నగరీకరణ, పారిశ్రామీకరణ వేగవంతం అయినందువలన అరణ్యాల నరికి వేత అధికం అయినందున పర్యావరణం క్షీణించడం మొదలైంది. కనుక జిల్లా ప్లానింగ్‌లో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఉంది. జిల్లాలో వైవిధ్యమైన వృక్షసంపద ఉంది. వృక్షసంపద నైసర్గిక స్వరూపం, భూభాగం ఎత్తు, మట్టి మీద ఆధారపడి ఉంది. ఆటవీశాఖ మైదానాలలో చెట్లను నాటే కార్యక్రమం ఆరంభించారు. జలవనరులు అధికంగా లభ్యమౌతున్న ప్రదేశాలలో షీసం, మలబరీ, యూకలిఫ్టస్, ఇతర చెట్లు నాటబడుతున్నాయి. కల్లర్ ప్రాంతంలో కికర్ ప్రిసోపిస్, యూకలిఫ్టస్ మొక్కలు నాటబడ్డాయి. జిల్లాలో మామిడి, మలబరి పండ్లతో ఆరంజ్, కిన్నో లెమన్ వంటి ఇతర పండ్ల తోటలు కూడా విస్తారంగ ఉన్నాయి.
హైడ్రాకజీ
మార్చుజిల్లాలోని నీరు వ్యవసాయానికి, గృహావసరాలకు ఉపకరిస్తున్నాయి. భూ అంతర్గత జలాలు 5 నుండి 8 మీటర్ల లోతులో లభ్యమౌతాయి.
మట్టి
మార్చుఈ ప్రాంతంలో బంకమట్టి అధికంగా ఉంటుంది. లైం స్టోన్ తక్కువగా ఉన్నా మెగ్నీషియం శాతం అధికంగా ఉంటుంది. పొటాషియం, ఫోస్ఫరిక్ ఆసిడ్ శాతం అధికంగా ఉంటుంది. మట్టి గుణాన్ని ఆధారం చేసుకుని వ్యవసాయం ఆధారపడి ఉంటుంది. వ్యవసాయం మీద వాతావరణ ప్రభావం అధికంగా ఉంటుంది. జిల్లాలో మట్టి సారవంతంగా ఉంటుంది.
జిల్లాలో 3 విధాలైన మట్టి ఉంటుంది. రియార్కి, బంగర్, బెట్. ధరివల్ ఘుమన్, క్వాడియన్, హర్చొవల్, శ్రీ హర్గోబింద్‌పూర్‌లు రియార్క్ వర్గానికి చెంది ఉంటాయి. ఖనువన్ చెరువు పశ్చిమ తీరంలో, అలివల్ కాలువ మద్య భాగం బంగర్ వర్గానికి చెందింది. వ్యవసాయానికి అనుకూలమైన భూభాగంలో పొదలు లేక అరణ్యాలు నిండి నిరుపయోగంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో చింగ్ గ్రాస్, వెదురు పొదలు, పండ్లతోటలు ఉన్నాయి. ఖాళీ ప్రదేశాలు మొత్తం స్థిరమైన పసరిక భూములు, పశువుల మేత భూములు మొదలైనవి ఉన్నాయి.
ఖనిజాలు
మార్చుబటాలా సమీపంలో ధరంకోట్ వద్ద ఇసుక భూములు ఉన్నాయి. బటాలాకు పశ్చిమంలో 6.5 చ.కి.మీ.ఇసుక నేల ఉంది. బటాలా - దెరా బాబా నానక్ రోడ్డు సహజసిద్ధమైన 20% బంకమట్టితో కూడిన ఇసుక భూములు ఉన్నాయి. బటాలా క్వాడియన్ రోడ్డులో 6కి.మీ దూరం వరకు దాదాపు 4 మీటర్ల మందంలో ఇసుక పొర ఉంది. భగవాన్‌పూర్ వద్ద 15 కి.మీ పొడవున ఇసుక భూములు ఉన్నాయి. గుర్‌దాస్‌పూర్ గురుదాస్‌పూర్ నౌషరా రహదారిలో ఇసుక బంకమట్టి మిశ్రితభూములు ఉన్నాయి. తిక్రివాలా, పండోరీ గ్రామాలు ధవాన్, చతౌగర్, బటాలా తాలూకాలోని బడోవల్ చౌడుభూములు ఉన్నాయి. టపాసులు, గన్‌పౌడర్, అగ్గిపెట్టెల తయారీ వంటి పరిశ్రమలకు ప్రధాన ముడిసరుకుకుగా ఉపకరించే పొటాషియం నైట్రేట్ ఈ ప్రాంతంలో విరువిగా లభ్యంఔతుంది. అంతేకాక చక్కెర ప్రరిశ్రమ, ఎతువులతయారీలో కూడా ఇది ఉపకరిస్తుంది.
మౌళిక సదుపాయాలు
మార్చునదులు , విద్యుత్తు ఉత్పత్తి
మార్చుజిల్లా గుండా ప్రధానంగా బియాస్, రవి నదులు ప్రవహిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ సరిహద్దులో ఉన్న రోహితంగ్ పాస్ వద్ద రెండు నదులకు జన్మస్థానంగా ఉంది. పంజాబులోని ఇతర నదులలాగా బియాస్ రవి నదీ జలాలు కూడా సీజన్‌కు సీజన్ సంవత్సరానికి సంచత్సరం మారుతూ ఉంటాయి. నదీజాలాలు వర్షపాత ఆధారంగా వ్యవసాయ భూములకు నీటిని అందిస్తుంటాయి. జిల్లాలో పలు నీటి మడుగులు (చాంబ్) ఉన్నాయి. వీటిలో దిన్‌రాజ్, నరోద్, బుదియుల్‌జమా, పనియర్, బుచ నంగల్, నరంవాలి ప్రధానమైనవి. జిల్లాలో చక్కగా నీటికాలువల నిర్మాణం జరిగింది. అప్పర్ బరి డోయాబ్ కెనాల్ సిస్టం జిల్లాలోని పలు వ్యవసాయభూములకు జలాలను అందిస్తున్నాయి. దీని ప్రధాన ఉపశాఖలలో లాహోరు శాఖ, కసౌర్ శాఖ, సభ్రాయన్ శాఖ ముఖ్యమైనవి. రవి, బియాస్ సంధి 1954లో నిర్మాణం పూర్తిచేసుకుంది. రవీ నదీ జలాలను బియాస్ నదికి ఉపనది అయిన చఖ్ఖి ఖాదుకు తరలిస్తున్నారు.
రహదార్లు
మార్చు
|
ప్రభుత్వం , రాజకీయాలు
మార్చుతాలూకాలు
మార్చు
|
ఉపతాలూకాలు
మార్చు
|
కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులు
మార్చు
|
పురపాలకాలు
మార్చు
|
అభివృద్ధి చెందిన పట్టణాలు
మార్చు
|
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 2, 299, 026, [2] |
ఇది దాదాపు. | లాట్వియా దేశ జనసంఖ్యకు సమానం.[5] |
అమెరికాలోని. | న్యూ మెక్సికో నగర జనసంఖ్యకు సమం.[6] |
640 భారతదేశ జిల్లాలలో. | 196 వ స్థానంలో ఉంది.[2] |
1చ.కి.మీ జనసాంద్రత. | 649 [2] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 9.3%.[2] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 895:1000 [2] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 81.1%.[2] |
జాతియ సరాసరి (72%) కంటే. |
సంస్కృతి
మార్చుమతం
మార్చు- 1947 లో జిల్లాలో మతానుయాయుల సంఖ్య
- ముస్లిములు 3%
- హిందువులు 7%
- సిఖ్ఖులు 90%
నగరాలు, పట్టణాలు , గ్రామాలు
మార్చుగుర్దాస్పూర్లో ప్రముఖ పట్టణాలు, నగరాలు, గ్రామాలు:
దీనా నగర్
మార్చుదీనానగర్ పట్టణం గుర్‌దాస్‌పూర్‌కు 14 కి.మీ దూరంలో ఉంది. 1730లో హాసిల్ తీరంలో అదినాబెగ్ ఈ నగరాన్ని స్థాపించాడు. ఆయన ఈ పట్టణం కేంద్రంగా చేసుకుని తజరాజ్యాన్ని పాలించాడు.
వేసవి విడిది
మార్చుదీనా నగర్ మహారాజా రంజిత్ సింగ్‌కు అభిమాన వేసవి విడిదిగా ఉండేది. దినా నగర్ మహారాజా రంజిత్ సింగ్‌కు వేసవి కాల దర్బారు కేంద్రంగా ఉంటూ వచ్చింది. ఇది మహారాజా రంజిత్ సింగ్‌కు వేసవి రాజధానిగా ఉంటూ వచ్చింది. ప్రతిసంవత్సరం మే, జూన్ మాసాలలో మహారాజా రంజిత్ సింగ్ దీనా నగర్‌లో గడిపాడు. 1838 మే మాసంలో మక్నాగ్టెన్ మిషన్ కాబూల్ రాజ్యం నుండి కొంత భూమిని కోరి తీసుకున్నారు.
బ్రిటిష్ ప్రభుత్వం
మార్చు1949 మార్చి 29లో దీనానగర్‌ను పంజాబు ప్రాంతంతో చేర్చిన తరువాత దీనానగర్ కేంద్రంగా అదినానగర్ జిల్లా ఏర్పాటు చేయబడింది. గుర్‌దాస్‌పూర్ తాలూకా, బటాలా తాలూకాలోని అధిక భూభాగం, పఠాన్‌కోట్ తాలూకాలోని 181 గ్రామాలు అదినానగర్ జిల్లాలో చేచబడ్డాయి. 1849 జూలైలో సివిల్, సైనిక ఎస్కార్టులు బటాలాకు బదిలీ చేయబడ్డాతు. 1852 నాటికి దౌలత్‌పూర్ జిల్లా రూపొందించబడింది. 1919లో రౌలత్ చట్టం అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రభుత్వానికి అనుకూలంగా విపరీత అధికారాలు ఇస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఏటువంటి తిరుగుబాటును అణిచే ఏర్పాటు చేయబడింది. గుర్‌దాస్‌పూర్, పఠాన్‌కోట్, బటాలాలతో దినానగర్‌లో కూడా సంపూర్ణంగా హర్తాళ్ చోటుచేసుకుంది.
సహాయనిరాకరణోద్యమం
మార్చు1920లో గాంధీజి సహాయనిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు. గాంధీజితో ఉద్యమంలో జలియంవాలా బాగ్ విషాద సంఘటన, రౌలత్ చట్టంతో సంబంధం ఉన్న ఖిలాఫత్ నాయకుడు కూడా చేతులు కలిపాడు. దేశం అంతటి నుండి గాంధీజీ పిలుపు అందుకుని ఉద్యమాన్ని బలపరిచాడు. ఉద్యమాన్ని ఆపడానికి ప్రభుత్వం పలు విధాలుగా ప్రయత్నం చేసింది. పెద్ద సంఖ్యలో ప్రజలు కారాగారానికి తరలించబడ్డారు. డిఫ్యూటీ కమీషనర్ హెచ్. హర్కోర్ట్ సమక్షంలో ఈ విషయమై చర్చించడానికి ఒక దర్బారు నిర్వహించబడింది.
1938లో స్వామి సతంత్రానంద్ మఠం స్థాపించబడింది. ఈ మఠం ఆయుర్వేదం నేర్పించడానికి కేంద్రంగా మారింది. అదినానాగర్ లోయి, షాల్, వుడ్ పరిశ్రమలకు గుర్తింపు పొందింది. 1947లో పలు కాండుయిట్ పైప్ తయారీ యూనిట్లు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయబడ్డాయి. దీనానగర్ వైశాల్యం 14.36చ.కి.మీ.
బటాలా
మార్చుబటాలా పట్టణం 1465లో బహ్లల్ లోఢీ పాలనా కాలంలో బట్టి రాజపుత్ర వంశానికి చెందిన " రాయ్ రాం రాజపుత్ " చేత స్థాపించబడింది. లాహోర్ గవర్నర్ తాతర్ ఖాన్ ఇచ్చిన చిన్న భూభాగంలో ఈ ఊరు స్థాపించబడింది. అక్బర్ చక్రవర్తి షంషేర్ ఖాన్‌కు ఒక జాగీరును ఇచ్చాడు. షంషేర్ ఖాన్ దానిని అందంగా తీర్చిదిద్ది వెలుపలి భాగంలో బ్రహ్మాండమైన చెరువును నిర్మించజేసాడు. అది ఇప్పటికీ మరమ్మత్తు చేయబడుతూ చక్కగా నిర్వహించబడుతుంది. సిక్కుల పాలనా కాలంలో బటాలా మొదట రాంగరీల వశం అయింది. తరువాత కంహయాలు రాంగరీలను తరిమి వేసారు. రాంగరియా రాజప్రతినిధి తిరిగి దీనిని స్వాధీనం చేసుకున్నాడు. బతియా రజనీత్ సింగ్ ప్రాబల్యం పెరిగే వరకు రాంగరియాల ఆధీనంలో ఉంటూ వచ్చింది.1849లో బటాలా భారత్ బ్రిటిష్ భూభాగంలో కలుపబడిన తరువాత ఇది జిల్లా కేంద్రంగా మారింది. ఫలితంగా ఇది గుర్‌దాస్‌పూర్ జిల్లాలో భాగం అయింది.
పరిశ్రమలు
మార్చుబటాలా కమ్మరి వృత్తి శ్రామికులకు కేంద్రంగా మారింది. సైలకోటకు చెందిన కమ్మరి పని వారంతా ఇక్కడకు చేరి యూనిట్లు ఏర్పాటు చేసుకుని పని చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం బటాలా ఇనిము పరిశ్రమలకు కేంద్రంగా మారింది. ఇక్కడ అత్యధికంగా యంత్ర పనిముట్లు తయారు చేయబడుతున్నాయి. బటాలా పట్టణ వైశాల్యం 8.75 చ.కి.మీ. ఇక్కడ ఉన్న చెరువు, షంషేర్ ఖాన్ సమాధి, షేర్ సింగ్ నిర్మించిన అందమైన అనార్కలి భవనం ఉన్నాయి. బటాలాను జాగీరుగా పొందిన షేర్ సింగ్ రంజిత్ సింగ్ కుమారుడు.
గుర్‌దాస్‌పూర్
మార్చుగుర్దాస్పూర్ను 17వ శతాబ్దంలో గురియా స్థాపించాడు. ఆయనపేరుతో ఈ పట్టణం గుర్‌దాస్‌పూర్ అయింది. ఆయన ఈ పట్టణ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని సంగీ గోత్రానికి చెందిన జాట్‌ల నుండి తీసుకున్నాడు. పాత నగరంలో గుడిసెలలో నివసిస్తున్న పేద ప్రజల కొరకు ఆయన ఈ పట్టణం స్థాపించబడింది. గురియా పూర్వీకులు అయోధ్యకు చెందిన వారు. వారు ఇక్కడకు వచ్చి పానియర్‌లో స్థిరపడ్డారు. గురియాకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎస్.హెచ్ నవల్ రాయ్, ఎస్.హెచ్ పాలా. నవల్ రాయ్ వంశస్థులు గుర్‌దాస్‌పూర్‌లో స్థిరపడ్డారు. నవల్ రాయ్ కుమారుడు బాబా దీప్‌చంద్ గురుగోబింద్ సింగ్ సమకాలీనుడు. బాబా దీప్‌చంద్‌కు గురుగోబింద్‌సింగ్ " గంజ్ బక్ష్ " (నిధులకు స్వంతదారుడు) అని బిరుదాంకితుని చేసాడని విశ్వసించబడుతుంది. బాబాదీప్‌చంద్ వంశస్థులు మహంతులని పిలువబడుతున్నారు. గుర్‌దాస్‌పూర్‌లోని ముక్తేశ్వర్ వద్ద ఉన్న రాక్ టెంపుల్ పట్టణ పురాతన చరిత్రకు చిహ్నంగా ఉంది. గ్రీకు వీరుడు అలెగ్జాండర్ ప్రపంచవిజేత కావాలన్న లక్ష్యంతో బియాస్ నదిని దాటి గుర్‌దాస్‌పూర్ జిల్లాలోని ఫతేగర్ వద్ద ఉన్న సంగ్ల వద్ద కతియాన్లతో యుద్ధం చేసాడు..
చరిత్ర
మార్చుగుర్దాస్పూర్ చరిత్ర బండాబహదూర్ చర్యలతో ముడిపడి ఉంది. బాబాబహదూర్ గుర్‌దాస్‌పూర్‌లో పలు కోటలను నిర్మించాడు. ఆయన కోటలలో ఒకటి ప్రస్తుత గుర్‌దాస్‌పూర్ సెంట్రల్ జైలు సమీపంలో ఉంది. మిస్లి పాలనా కాలంలో గుర్‌దాస్‌పూర్ కనైయా మిస్ల్, రాంఘరియా మిస్ల్ కార్యకలాపాలకు కేంద్రంగా మారింది. 1808లో మహారాజా రంజిత్ సింగ్ రాంఘరియా మిస్ల్, కన్యియా మిస్ల్‌ను జయించాడు. తతువాత ఈ ప్రాంతం రంజిత్ సింగ్ రాజ్యంలో భాగంగా మారింది.
అంగ్లో సిఖ్ యుద్ధం
మార్చు1839-49 లో ఆగ్లో సిక్కు యుద్ధం తరువాత 1849 మార్చి 29 న పంజాబు ఈస్టిండియా కంపనీతో ప్రభుత్వంతో కలుపబడింది. పాలనా నిర్వహణ కొరకు జిల్లలు ఏర్పాటు చేయబడ్డాయి. 1852 మే 1 న అదినాగర్ జిల్లా గుర్‌దాస్‌పూర్ జిల్లాగా అవతరుంచింది. కుగ్రామంగా ఉన్న గుర్‌దాస్‌పూర్ జిల్లా కేంద్రంగా మారింది. 1857 తిరుగుబాటు గుర్‌దాస్‌పూర్‌ను బాధించింది. తిరుగుబాటుదారులు సైలకోట నుండి గుర్‌దాస్‌పూర్‌కు చేరుకున్నారు. బ్రిటిష్ సైన్యం తిరుగుబాటుదారులను త్రిమ్మో పఠాన్ వద్ద ఎదుర్కొన్నది. త్రిమ్మో పఠాన్ యుద్ధంలో తిరుగుబాటుదారులు ఓటమిని చవిచూసారు. ఈ యుద్ధం 1857 జూలై 12-16 మద్య జరిగింది. గుర్‌దాస్‌పూర్ కాలేజ్ వెనుక ఉన్న బోల్ వాల బాగ్ వద్ద ఖైదీలు ఉరితీయబడ్డారు.
స్వతంత్రం తరువాత
మార్చు1947లో భారత్- పాక్ విభజన సమయంలో పంజాబు భారత్- పాక్ లకు విభజించబడింది. షకర్గర్ తాలూకా పాకిస్థాన్కు చెందిన సైల్‌కోట్ జిల్లాలో చేర్చబడింది. మిగిలిన గుర్‌దాస్‌పూర్ ప్రాంతం జిల్లాగా మారి భారత భూభాగంలో చేర్చబడింది. .[4] జిల్లా విభజన తరువాత రెండు దేశాల మధ్య జనాభా విభజన కూడా జరిగింది. ముస్లిములు పాకిస్థాన్‌కు చేరుకున్నారు. హిదువులు భారత్‌కు చేరుకున్నారు. 2011 27 న గుర్‌దాస్‌పూర్ జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి పఠాన్‌కోట్ జిల్లా రూపొందించబడింది. పఠాన్‌కోట్ ఉపవిభాగాలు (పఠాన్‌కోట్, ధర్కలన్), ఉప తాలూకాలు (నరోట్ జైమల్ సింగ్, బమియల్ ) విభజించబడింది.
కలనౌర్
మార్చుగుర్దాస్ పూర్ జిల్లాలో కలనౌర్ ఒక చారిత్రిక ప్రదేశం. ఈ పట్టణం గుర్‌దాస్‌పూర్‌కు పశ్చిమంలో కిరణ్ నదీతీరంలో 25 కి.మీ దూరంలో ఉంది. కిరణ్ నది చాంబ్ ఆఫ్ బెహరాంపూర్‌లో జన్మించి, పాములా మెలికలు తిరుగుతూ 36 మైళ్ళ పొడవున ప్రవహించి అమృత్‌సర్ జిల్లాలో రావి నదిలో సంగమిస్తుంది.
పేరు వెనుక చరిత్ర
మార్చుకలనౌర్ పురాతన హిందువుల కాలం నుండి ప్రాముఖ్యత సంతరించుకుని ఉంది. చరిత్రకారుడు మొహమ్మద్ పరిశోధనలు అనుసరించి ఈ పట్టణాన్ని నూర్ తెగ రాజపుత్రులు నిర్మించారని భావిస్తున్నారు. వారు దక్షిణ భారతదేశం నుండి వలసవచ్చిన వారని భావిస్తున్నారు. " ఇంపీరియల్ గజటీర్ ఆఫ్ ఇండియా " నివేదికలు అనుసరించి ఈ పట్టణాన్ని కల, నూర్ అనే ముస్లిం సోదరులు నిర్మించారని భావిస్తున్నారు. పురాతన కాలంలో ఈ ప్రాంతంలో నిర్మించబడిన " కాళేశ్వరాలయం " (ప్రధాన దైవం శివుడు) కారణంగా ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చిందని భావిస్తున్నారు.
చరిత్ర
మార్చుఈ పురాతన పట్టణం ఆధారం చేసుకుని పలు చారిత్రక సంఘటనలు జరిగాయి. ఎత్తైన గుట్ట మీద నిర్మించబడిన ఈ పట్టణం పలుమార్లు పడగొట్టబడి పలుమార్లు పునర్నిర్మించబడింది. ఫిరోజ్ షాహ్ తుగ్లక్ వేట కొరకు ఇక్కడకు 1353లో వచ్చాడు. ఆయన కిరన్ ఉపనదీతీరంలో అందమైన భవనం నిర్మించబడింది.
- సయ్యద్ ముబారక్ షాహ్ (సా.శ. 1421-35) కలనౌర్ శక్తివంతమైన ఖోకర్ తెగ ఆధీనంలో ఉంటూ వచ్చింది. 14-16వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో కలనౌర్ పట్టణం ప్రాబల్యత సంతరించుకుంది.
- కలనౌర్ బాబా బంధా సింగ్ బహదూర్ ఒక బావిని త్రవ్వించాడు. ఈ బావి ప్రస్తుతం గురుద్వారా బంధా బహదూర్ సమీపంలో ఉంది.
మిస్లి కాలం
మార్చుసరదార్ హక్వీకత్ సేనా నాయకత్వంలో కన్యా మిస్లి ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న తతువాత ఈ ప్రాంతంలో మిస్లీ పాలన ఆరంభం అయింది. ఆయన కుమారుడు జైమల్ సింగ్ ఫతేఘర్ చురియన్ వరకు రాజ్యవిస్తరణ నివాసాన్ని ఫతేఘర్‌కు మార్చుకున్నాడు. జైమల్ సింగ్ కుమార్తె చంద్ కౌర్ మహారాజా రంజిత్ సింగ్ కుమారుడు రాకుమారుడు కార్తిక్ సింగ్‌ను [[సా.శ. 1812లో వివాహం చేసుకుంది. ఈ ప్రాంతం రంజిత్ సింగ్ రాజ్యంలో కలుపుకుని రంజిత్ సింగ్ కలనౌర్ తాలూకాను రాకుమారుడు కార్తిక్‌కు ఇచ్చాడు. 1874లో కలనౌర్ తాలూకా తాలూకా దివాన్ దీన నాథ్‌కు జాగీరుగా ఇవ్వబడింది. దివాన్ దీన నాథ్ మరణించిన తరువాత 1857లో కలనౌర్ తాలూకా బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగంగా మారింది. 1852 మే మాసం 1న గుర్‌దాస్‌పూర్ జిల్లాగా మారింది. కలనౌర్ తాలూకా జిల్లాలో ప్రామఖ్యత సంతరించుకుంది.
ఆర్ధికం
మార్చుకలమౌర్ కళలకు, కుటీర పరిశ్రమలకు, వ్యాపారానికి కేంద్రంగా ఉంటుంది.
దెరా బాబా నానక్
మార్చుదెరా బాబా నానక్ గుర్‌దాస్‌పూర్‌కు 45 కి.మీ దూరంలో ఉంది. ఈ ప్రాంతం శ్రీ గురునానక్ దేవ్ తో సంబంధితమై ఉంది. దేరా బాబా నానక్‌లో రెండు ప్రబల గురుద్వారాలు (దర్బార్ సాహిబ్, శ్రీ చోళా సాహెబ్ ) ఉన్నాయి. దేరా బాబా నానక్ సిక్కులకు అతిపవిత్ర ప్రదేశాలలో ఒకటి. ఇది రవీ నదీతీరంలో నిర్మించబడి ఉంది. మొదటి సిక్కు గురువు దేరా బాబా నానక్ ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుని ఇక్కడ ఉన్న పఖొకే గ్రామంలో మరణించాడు. ప్రస్తుత నగరానికి ఎదురుగా ఉన్న కొత్త నగరానికి కర్తర్‌పూర్ అని నామకరణం చేయబడింది. గురునానక్ దేవ్ వంశస్థులు కొత్తగా నగరాన్ని స్థాపించి గురునానక్ తరువాత ఆ నగరానికి దేరా బాబా నానక్ అని నామకరణం చేసారు.
చరిత్ర
మార్చుశ్రీ గురునానక్ దేవ్‌ఙాపకార్ధం గురుద్వారా శ్రీ దర్బార్ సాహిబ్ నిర్మించబడింది. గురునానక్ దేవ్ ఇక్కడకు సా.శ. 1515 డిసెంబరు మాసంలోతన మొదటి పర్యటనలో ఆయన కుటుంబ సభ్యులను చూడడానికి వచ్చాడు. ఆయన భార్య మాతా సులఖ్ని, ఇద్దరు కుమారులు బాబా శ్రీ చంద్, బాబా లక్ష్మి చంద్ ఇక్కడకు వచ్చి అమ్మగారిల్లు పఖొ - కె- రంధ్వ వద్ద నివసించారు. ఆసమయంలో దెరా బాబా నానక్ లో గురునానక్ మామ లాలా మూల్ రాజ్ పత్‌వారీగా పనిచేస్తూ వచ్చాడు.
శ్రీ హర్గోబింద్పూర్
మార్చుశ్రీ-హరిగోబింద్‌పూర్ గుర్‌దాస్‌పూర్‌కు దక్షిణంగా 45 కి.మీ దూరంలో ఉంది. ఇది బియాస్ నదికి ఎగువ తీరంలో ఉంది. ఈ ప్రాంతం ఒకప్పుడు రొహిలా అని పిలువబడేది. 5వ సిక్కు గురువు " గురు అర్జున్ దేవ్ " శ్రీ-హరిగోబింద్‌పూర్‌ను క్రీ.పూ 1595లో స్థాపించాడు. గురు అర్జున్ దేవ్ అనేక ప్రార్థనలు చేసిన తరువాత జన్మించిన కుమారుడు హరిగోబింద్ జన్మదిన సందర్భంగా కుమారుడు జన్మించిన సంవత్సరంలో ఈ పట్టణాన్ని నిర్మించాడు. తరువాత చంద్‌షాహ్ కుట్ర ఫలితంగా ఈ పట్టణం భగవాన్ దాస్ ఖత్రి ఆస్తిగా మారింది.
అభిప్రాయబేధాలు
మార్చుసా.శ. 1621లో గురు హరిగోబింద్, వడ్డి వ్యాపారి భగవాన్ దాస్ ఖత్రిల మద్య కొంత ఖాళీ ప్రదేశం కొరకు తీవ్రమైన కలహాలు ఏర్పడ్డాయి. గురు హరిగోబింద్ ఆ ప్రదేశంలో భవనం నిర్మించడానికి ప్రయత్నాలు ఆరంభించాడు. భగవాన్ దాస్ కొంతమంది మనుష్యుల సాయంతో ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నాడు. ఈ కలహంలో భగవాన్‌దాస్ రతన్ చంద్, కరంచంద్ చంపబడ్డారు. వారు జలంధర్ ఫౌజిదర్ అబ్దుల్ ఖాన్‌ను వివాహం చేసుకున్నాడు. అబ్దుల్ ఖాన్ పెద్దసైన్యంతో గురుగోబింద్ మీద యుద్ధానికి వచ్చాడు. బియాస్ నదీతీరంలో ఉన్న రోహిలియా ఘాట్ వద్ద రెండురోజుల పాటు యుద్ధం జరిగింది. యుద్ధంలో 5 గురు సైనికాధికారులు ఫౌజీదార్ కుమారుడు మరణించారు. అలాగే మొగల్ సైన్యం కూడా పెద్ద మొత్తంలో నాశనం అయింది. గురుగోవింద్ వైపు కూడా బాయి జట్టు, కలియానా, నానో, పిగ్రా, మథురా, పరసురాంలతో అనేకమంది సిక్కులు మరణించారు.
గురు హరిగోబింద్ సింగ్
మార్చుగురు హర్గోబింద్ ఈ కొత్త నదాన్ని స్థాపించాడు. ఆయన ఇక్కడ ధర్మశాల, మసీదు నిర్మించాడు. ఆయన అలాగే నగరం చుట్టూ గోడను అక్కడక్కడా ద్వారాలు నిర్మించాడు. అందులో ఒక గోడ ఇంకా ఉపయోగంలో ఉంది. హర్గోబింద్ సింగ్ యుద్ధంలో విజయం సాధించి విశ్రాంతి తీసుకున్న ప్రదేశంలో మూడంతస్థుల సరికొత్త భవనం హర్గోబింద్‌పూర్‌కు ఒక కి.మీ దూరంలో సరికొత్తగా మూడంతస్థుల " గురుద్వారా దందమా సాహిబ్ " నిర్మాణదశలో ఉంది. అందుకని ఈ గురుద్వారాను దమ్-దమా-సాహెబ్ అంటున్నారు. ఈ నహరాన్ని హోషియార్‌పూర్, జలంధర్ జిల్లాలతో అనుసంధానం చేస్తూ బియాస్ నది మీద ఒక వంతెన నిర్మించబడింది.
క్వాడియన్
మార్చుక్వాడియన్ బటాలా నగరానికి 18కి.మీ దూరంలో ఉంది. గుర్‌దాస్‌పూర్ కనువాన్-కోట్-తోడమల్ 26 కి.మీ ప్రయాణించి క్వాడియన్ చేరుకోవచ్చు.
- క్వాడియన్ పట్టణం అహమ్మదీయ ముస్లిం సమాజ స్థాపకుడితో సంబంధితమై ఉంది. ప్రముఖ మెస్సియా మిర్జా గులాం అహమ్మద్ హజారత్ క్వాడియన్‌లో జన్మించాడు. క్వాడియన్ భారతదేశంలో మాత్రమే కాక ప్రపంచం అంతటా విస్తరించి ఉన్న అహమ్మదీయ ముస్లిములకు కేంద్రంగా ఉంది.
- క్రీ.పూ 1530లో క్వాడియన్ స్థాపించబడిందని భావిస్తున్నారు. మిర్జా హది బెగ్ నగరానికి మొదటి క్వాజీగా (నగర మెజిస్ట్రేట్) నియమించబడ్డాడు. అందువలన నగరాన్ని క్వాజి అని కూడా పిలుస్తారు. మిర్జా హది బెగ్ ఇలాంమతం మీద భక్తి విశ్వాసాలు ఉన్న పడితుడు. అందువలన ఆయన కొత్త పట్టణానికి " ఇస్లాం పూర్ క్వాజి " అని పేరుపెట్టాడు. కాలక్రమంలో ఇది క్వాజీ మజీ అనిపిలువబడింది. తరువాత క్వాది అని పిలువబడింది. చివరకు ఇది ప్రస్తుత పేరైన క్వాడియన్‌కు మారింది.
- సా.శ. 1834లో మహారాజా రంజిత్ సింగ్‌కు పాలనలో క్వాడియన్, 5 గ్రామాలు మిర్జా గులాం అహమ్మద్ తండ్రి మిర్జా గులాం ముర్తజాకు బహుమానంగా ఇవ్వబడింది.
- ఆసమయంలో క్వాడియన్‌కు ప్రత్యేక గుర్తింపు లేదు. ఈ ప్రాంతంలో కొన్ని వందల మంది ప్రజలు మాత్రమే నివసిస్తుండేవారు. ఈ ప్రాంతం చేరడానికి బటాలా నుండి రంధ్రాలతో నిండిన ఇసుక నేల మాత్రమే ఉండేది. ఈ ప్రాంతంలో నిరక్ష్యరాశ్యులు మాత్రమే నివసిస్తుండేవారు. ఇక్కడ నగర వసతులు, సౌకర్యాలు ఉండేవి కాదు.
- పంజాబు రాష్ట్రంలో అనామక గ్రామంగా సుదూరంగా ఉండే క్వాడియన్ 1891లో ఇస్లామిక్ శిక్షణా కేంద్రంగా మారింది. 1835-1908లో
హజారత్ మిర్జా గులాం అహమ్మద్ అహమ్మదీయ ముస్లిం ఉద్యమంలో భాగంగా తనకుతానే ప్రామిస్డ్ మెసయ్యా, హజారత్ మిర్జా గులాం అహమ్మద్ మహ్దిగా ప్రకటించుకునే వరకు క్వాడియన్ గురించి ప్రపంచానికి తెలియకుండానే ఉంది.
ఆర్యసమాజం
మార్చుక్వాడియన్లో ఆర్య సమాజ్ ప్రముఖ పాత్ర వహిస్తుంది. హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్న ప్రజలను అలాగే పశువులను రక్షించడంలో అమర్ షాహిద్ పండిట్ లేఖ్ రాం సింగ్ ప్రధాన పాత్ర వహిస్తున్నాడు. లేక్ రాం పేరుతో 3 ప్రధాన సంస్థలు క్వాడియన్‌లో పనిచేస్తున్నాయి. ఆరయసమాజ్ పేరుతో ఒక ఆలయం కూడా ఉంది. బాలికలు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఒక కళాశాల ఉంది. అంతేకాల హిందూ సమాజానికి చెందిన మార్కెట్ కూడా ఉంది.
అహమ్మదీయులు
మార్చుఅంతర్జాతీయ అమమ్మదీయ సమాజానికి క్వాడియన్ కేంద్రంగా ఉంటూ వచ్చింది అయినప్పటికీ 1947లో మతకలహాలు మొదలైన తరువాత పరిస్థితిలో కొంత మార్పులు వచ్చాయి. రెండవ ఖలిఫతూల్ మాసిహ్ వరకు క్వాడియన్ వదలి పాకిస్థాన్ వెళ్ళడానికి అంగీకరించనప్పటికీ 1947 తరువాత వారి మీద పాకిస్థాన్‌కు వెళ్ళమని వత్తిడి అధికం అయింది. భారత్‌లో మతసంబంధిత ప్రదేశాల రక్షణ కొరకు 313 మంది ఎన్నిక చేయబడ్డారు. వారు దేశాన్ని వదిలి వెళ్ళకుండా క్వాడియన్‌ను రక్షించారు. ఈ 313 మంది దర్వెష్ ఆఫ్ క్వాడియన్ అని పిలువబడ్డారు. వీరంతా భారతీయులుగా నమోదు అయ్యారు. 2008లో సరికొత్తగా అహమ్మదీయ ముస్లిం సమాజం నూర్ హాస్పిటల్ ఆరంభించారు.
స్వాతంత్రం తరువాత
మార్చుముస్లిం విశ్వసానికి సంబంధించిన పలు విషయాలకు క్వాడియన్ కేంద్రంగా ఉన్నందున స్వాతంత్ర్యం రాక ముందు ఇక్కడ ముస్లిములు అధికంగా ఉండేవారు. 1947 తరువాత ఇక్కడ హిందువులు, సిక్కులు, ప్రజాపతి (కుంహర్), బతియా, బ్రాహ్మణ, ఆర్యసమాజ్, బజ్వా ప్రజలు అధికంగా ఉన్నారు. స్వతంత్రం వచ్చిన తరువాత దేశవిభజన సమయంలో వీరంతా పాకిస్థాన్‌కు చెందిన పంజాబు నుండి భారత్‌కు వలస వచ్చిన వారే. పాకిస్థాన్‌కు చెందిన పంజాబు కలసవాలా నుండి వచ్చిన బజ్వాలకు గుర్తుగా ఇప్పుడు కలసవాలాలో "కలసవాలా ఖలసా స్కూల్ (క్వాడియన్) " ఉంది. దేశ విభజన సమయంలో మసీదులు ముస్లీం మత సంబంధిత భవనాల రక్షణ కొరకు నియమించిన వారు తప్ప మిగిలిన వారు పాకిస్థాన్‌కు వలస వెళ్ళారు. " ది ప్రైం ఇంస్టిట్యూట్ ఆఫ్ సిక్ నేషనల్ కాలేజ్ " [7] క్వాడియన్‌కు తరలించబడింది. ఈ కాలేజీతో సంబంధం ఉన్న పలువురు ప్రముఖులు క్వాడియన్లో ఉన్నారు.
ప్రముఖులు
మార్చు- పండిట్ లెఖ్ రాం : ఆర్యసమాజానికి చెందిన పండిట్ లెఖ్ రాం గో సంరక్షణ, హిందువుల సంక్షేమం కొరకు కృషిచేస్తున్నాడు.
- మిర్జా ఘులాం అహమ్మద్ ఆఫ్ క్వాడియన్: బ్రిటిష్ కాలంలో మతసంబంధిత ప్రముఖులలో మిర్జా ఘులాం అహమ్మద్ ఒకరు. ఈయన ఇస్లాం అహమ్మదీయ ఉద్యమ స్థాపకుడు. ఆయనకు ముజాదిద్, విశ్వసనీయ మెస్సయ్యా, మహ్ది వంటి బిరుదులు ఉన్నాయి. ఆయన అనుయాయులను అహమ్మదీయులు అనే వారు.
- గురుబచన్ సింగ్ సలారియా :- ఈయన ముంసి చౌదరి ముంసీరాం కుమారుడు, 1935 నవంబరు మాసం 29న గుర్‌దాస్‌పూర్‌లోజన్మించాడు. ఈయన ప్రముఖ సైనికాధికారి భరతీయ యుద్ధంలో ఈయన ప్రదర్శించిన ధైర్యసాహసాలకు ఈయన పరమవీర చక్ర బిరుదాంకితుడయ్యాడు.
- ఎయిర్ చీఫ్ మార్షల్ దిల్బాగ్ సింగ్ [8]
- ఫార్మర్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మిర్జా బషీర్-ఉద్-దిన్ మొహమూద్ అహమ్మద్,
- అహమ్మదీయ ముస్లిం కమ్యూనిటీకి చెందిన ఖలిఫతుల్ మస్సీ 2.
- ప్రభ్జొత్ సింగ్:- ఇండియన్ హాకీ క్రీడాకారుడు.[9][10]
- విజయ్ ఆనంద్:- హిందీచిత్ర నిర్మాత.
- అహమ్మదీయ ముస్లిం కమ్యూనిటీకి చెందిన మిర్జా నాసిర్ అహమ్మద్, ఖలీఫతుల్ మసీ 3 క్వాడియన్‌లో జన్మించారు. వీరు ఇస్లామాబాద్‌లో జన్మించి రబ్వా (పాకిస్థాన్) లో ఖననం చేయబడ్డారు.
- అహమ్మదీయ ముస్లిం కమ్యూనిటీకి చెందిన మిర్జా తహిర్ అహమ్మద్, ఖలీఫతుల్ మస్సీ 4 లు క్వాడియన్‌లో జన్మించారు. వీరు లండన్‌లో మరణించారు. వీరు ఇస్లామాబదులో ఖననం చేయబడ్డారు.
- ఇక్బాల్ బహు:- పాకిస్థాన్ సుఫీ గాయకుడు. ఈయన గుర్‌దాస్‌పూర్‌లో జన్మించి స్వతంత్రం తరువాత పాకిస్థాన్‌కు వలస పోయాడు. ఈయన 2008లో పాకిస్థాన్ ప్రభుత్వం చేత " తంఘ-ఇ-ఇంతియాజ్ " బిరుదుతో సత్కరించబడ్డాడు.
- దేవానంద్ [11]:- ప్రముఖ భారతీయ నటుడు.
- శివకుమార్ బటాలా్వి బటాలా (క్వాడియన్):- ప్రముఖ పంజాబీ రచయిత.
- చౌదరి నైజ్ అలి ఖాన్:- దార్- ఉల్- ఇస్లాం - విద్యా సంస్థల స్థాపకుడు. ఈ సంస్థలు పఠాన్‌కోట్ (భారత్), జౌహరాబాద్ (పాకిస్థాన్) లలో ఉన్నాయి. ఈయన పాకిస్థాన్‌కు వలస వెళ్ళాడు.
- ప్రింసిపల్ సుజన్ సింగ్: ఈయన " ఫాదర్ ఆఫ్ పంజాబు షార్ట్ స్టోరీ "గా గుర్తినబడ్డాడు. 1987లో సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నాడు.
- తేజా సింగ్: గుర్‌దాస్‌పూర్ జిల్లాలోని మునానవలి గ్రామంలో జన్మించాడు. ఈయన బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా " గుర్‌దాస్‌పూర్" కుట్రలో భాగస్వామ్యం వహించి 13 సంవత్సరాలకాలం జైలు జీవితం అనుభవించాడు.
- గులాం అహమ్మద్ పర్వేజ్:- " తొలు-ఇ-ఇస్లాం " ఉద్యమ స్థాపకుడు. పాకిస్థాన్‌కు వలస పోయాడు.
- శోభా సింగ్:- చిత్రకారుడు.
- తేజా సింగ్ అకర్పురి.
- ఇషాక్ అహమ్మద్:- గుర్‌దాస్‌పూర్‌లో జన్మించాడు. పాకిస్థాన్‌కు వలస వెళ్ళాడు.
- గురుప్రీత్ ఘుగ్గి.
- జస్బీర్ జస్సి:- ప్రబల బంగ్రా గాయకుడు.
- మన్‌ప్రీత్ గోనీ క్రికెట్ ప్లేయర్
రాజకీయాలు
మార్చు- అశ్వినీ కుమార్: జాతీయ కాంగ్రెస్ నాయకుడు. పార్లమెంటు సభ్యుడు.
- త్రిపాట్ రాజేందర్ సింగ్ బజ్వా, జాతీయ కాంగ్రెస్ నాయకుడు, పంజాబు శాసనసభ సభ్యుడు.
- ప్రతాప్ సింగ్ బజ్వా:- పంజాబు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు. జాతీయ కాంగ్రెస్ నాయకుడు. గత గుర్‌దాస్‌పూర్ పార్లమెంటు సభ్యుడు.
- చరణ్జిత్ కౌర్ బజ్వా:- జాతీయ కాంగ్రెస్ నాయకుడు. పంజాబు శాసనసభ సభ్యుడు.
మూలాలు
మార్చు- ↑ "History of Gurdaspur". Archived from the original on 2005-08-02. Retrieved 2014-08-25.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ Gurdāspur District – Imperial Gazetteer of India, v. 12, p. 395.
- ↑ 4.0 4.1 "Narowal–Punjab Portal". Archived from the original on 2011-10-01. Retrieved 2014-08-25.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Latvia 2,204,708 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
New Mexico 2,059,179
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-08-11. Retrieved 2020-01-09.
- ↑ http://www.tribuneindia.com/2001/20010211/nation.htm#11
- ↑ http://www.zeenews.com/sports/others/2009-02-18/508690news.html
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-02-23. Retrieved 2014-08-25.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-02-27. Retrieved 2014-08-25.