గేమ్ ఆన్
గేమ్ ఆన్ 2024లో తెలుగులో విడుదలైన సినిమా. కస్తూరి క్రియేషన్స్ బ్యానర్‌పై రవి కస్తూరి నిర్మించిన ఈ సినిమాకు దయానంద్ దర్శకత్వం వహించాడు. గీతానంద్, నేహా సోలంకి, మధుబాల, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2024 జనవరి 20న విడుదల చేసి, సినిమా 2024 ఫిబ్రవరి 2న సినిమా విడుదలైంది.[1][2]
గేమ్ ఆన్ | |
---|---|
దర్శకత్వం | దయానంద్ |
రచన | దయానంద్ |
నిర్మాత | రవి కస్తూరి |
తారాగణం | |
ఛాయాగ్రహణం | అరవింద్ విశ్వనాథన్ |
కూర్పు | వంశీ అట్లూరి |
సంగీతం | అభిషేక్ ఏ ఆర్ |
నిర్మాణ సంస్థ | కస్తూరి క్రియేషన్స్ |
విడుదల తేదీ | 2 ఫిబ్రవరి 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుసిద్ధార్థ్ అలియాస్ సిద్ధు (గీతానంద్) గేమ్ లూప్ అనే కంపెనీలో పనిచేస్తుంటాడు. కంపెనీ ఇచ్చిన టార్గెట్స్ పూర్తిచేయకపోవడంతో సిద్దు ఉద్యోగం పోతుంది. సిద్దార్థ్ స్నేహితుడు రాహుల్ (కిరీటీ దామరాజు), ప్రేమించిన మోక్ష (వాసంతి) ఇద్దరూ కలిసి మోసం చేస్తారు. సమస్యలను తట్టుకోలేక సిద్ధు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ సమయంలో సిద్ధు అనుకోకుండా ఓ రియల్ గేమ్ ఆడటం మొదలుపెడతాడు. చిన్న చిన్న టాస్క్‌లకే అతడి లక్షల రూపాయలు వస్తాయి. గేమ్‌లోని చాలా టాస్క్‌లను సక్సెస్‌ఫుల్‌గా పూర్తిచేయడంతో లూజర్ నుంచి విన్నర్‌గా మారానని సంతోశతపడుతున్న సమయంలో ఆ గేమ్‌లో భాగంగానే ఓ మనిషిని చంపాలంటూ అతడికి టాస్క్ అసైన్ చేస్తారు. ఆ టాస్క్‌కు సిద్ధు ఒప్పుకున్నాడా? ఈ గేమ్‌ను అతడితో ఆడిస్తున్న అజ్ఞాత వ్యక్తి ఎవరు? సిద్ధు చంపాల్సింది ఎవరిని? ఈ క్రమంలో అతడు ఎదురుకున్న సమస్యలు ఏమిటి? ఈ డేంజరస్ గేమ్ నుంచి సిద్ధు బయటపడేందుకు సైకాలజిస్ట్ మదన్ (ఆదిత్యమీనన్) ఎలా హెల్ప్ చేశాడు? ఆ తరువాత ఏమి జరిగింది అనేదే మిగతా సినిమా కథ.[3]
నటీనటులు
మార్చు- గీతానంద్[4]
- నేహా సోలంకి
- మధుబాల
- ఆదిత్య మీనన్
- శుభలేఖ సుధాకర్
- జెమినీ సురేష్
సాంకేతిక నిపుణులు
మార్చుమూలాలు
మార్చు- ↑ V6 Velugu (28 January 2024). "ఫిబ్రవరి 2న గేమ్ ఆన్ రిలీజ్". Archived from the original on 5 February 2024. Retrieved 5 February 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (31 January 2024). "ఈ వారం థియేటర్‌లో చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో..?". Archived from the original on 1 February 2024. Retrieved 1 February 2024.
- ↑ 10TV Telugu (2 February 2024). "'గేమ్ ఆన్' మూవీ రివ్యూ.. ఎమోషన్స్‌తో ఆడే సైకాలజీ గేమ్ థ్రిల్లర్." (in Telugu). Archived from the original on 5 February 2024. Retrieved 5 February 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Eenadu (2 February 2024). "కొత్తదనమే 'గేమ్ ఆన్' బలం". Archived from the original on 2 February 2024. Retrieved 2 February 2024.
- ↑ Andhrajyothy (25 January 2024). "'గేమ్ ఆన్'.. సినిమా చూసి ప్రేక్షకులు థ్రిల్ అవుతారు". Archived from the original on 5 February 2024. Retrieved 5 February 2024.
- ↑ Mana Telangana (27 January 2024). "ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగే సైకలాజికల్ థ్రిల్లర్.. 'గేమ్ ఆన్': డైరెక్టర్ దయానంద్". Archived from the original on 5 February 2024. Retrieved 5 February 2024.