మధుబాల (రోజా ఫేమ్‌)

మధుబాల ఒక భారతీయ చలనచిత్ర నటి. ఈమె హిందీ, తమిళ,తెలుగు, మలయాళ భాషలలో సుమారు 52 చలన చిత్రాలలో నటించింది. ఈమె అసలు పేరు మధు కాగా దర్శకుడు కె.బాలచందర్ సలహాతో మధుబాలగా మార్చుకుంది. ఈమెకు బాగా పేరు తెచ్చిపెట్టిన సినిమా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా. ఈ సినిమా దాదాపు అన్ని ప్రధాన భారతీయ భాషలలోకి అనువదించబడింది[1].

మధుబాల
Madhoo Bhung.jpg
జననంమధు
(1972-03-26) 1972 మార్చి 26 (వయస్సు 50)
చెన్నై, భారతదేశం
వృత్తిచలనచిత్ర నటి
క్రియాశీలక సంవత్సరాలు1991-2001, 2013 - ప్రస్తుతం
మతంహిందూ మతం
భార్య / భర్తఆనంద్ షా
పిల్లలుఅమేయ, కేయా
తండ్రిటి.రఘునాథ్
తల్లిరేణుక

విశేషాలుసవరించు

ఈమె ప్రముఖ హిందీ నటి హేమా మాలినికి మేనకోడలు. ఈమె తండ్రి టి.రఘునాథ్ చలనచిత్ర నిర్మాత. తల్లి పేరు రేణుక. ఈమె తల్లి వద్ద భరతనాట్యం నేర్చుకుంది. ఈమె తల్లి క్యాన్సర్ వ్యాధితో మధు 13 ఏళ్ల వయసులోనే మరణించింది. ఈమె తన మేనత్త హేమా మాలినిని ఆదర్శంగా తీసుకుని సినిమాలలో నటించాలని భావించింది. దానికోసం రోషన్ తనేజా స్కూల్ ఆఫ్ యాక్టింగ్‌లో కొంతకాలం తర్ఫీదు తీసుకుంది. ఈమె మొదట ఒట్టయల్ పట్టాలమ్‌ (ഒറ്റയാൾ പട്ടാളം) అనే మలయాళ సినిమాలో నటించింది. రెండవ సినిమాకే కె.బాలచందర్ దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చింది. హిందీ భాషలో అజయ్ దేవగణ్తో ఫూల్ ఔర్ కాంటే చిత్రంలో తొలిసారి నటించింది. ఈమె 2001 వరకు సినిమాలలో విరివిగా నటించి అటు పిమ్మట సినిమాలకు కొంత విశ్రాంతిని ఇచ్చి ఇప్పుడు మళ్ళీ కొన్ని సినిమాలలో నటిస్తూ ఉంది. ఈమె గుజరాతీ వ్యాపారి ఆనంద్ షాను వివాహం చేసుకుని అమెరికాలో నివసించింది. వీరికి అమేయ, కేయా అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

ఫిల్మోగ్రఫీసవరించు

సంవత్సరము చిత్రము భాష దర్శకత్వం ఇతర నటులు
1992 రోజా తమిళం, తెలుగు, మరాఠీ, హిందీ మణిరత్నం అరవింద్‌ స్వామి
1993 అల్లరి ప్రియుడు తెలుగు కె.రాఘవేంద్రరావు రాజశేఖర్, రమ్యకృష్ణ
1993 జెంటిల్ మేన్ తమిళం, తెలుగు ఎస్.శంకర్ అర్జున్
1994 పుట్టినిల్లు - మెట్టినిల్లు తెలుగు కె.వాసు భానుచందర్
1996 మిస్టర్ రోమియో తమిళం, తెలుగు, హిందీ కె.ఎస్.రవి ప్రభుదేవా, శిల్పా శెట్టి
2013 అంతకు ముందు... ఆ తరువాత... తెలుగు ఇంద్రగంటి మోహనకృష్ణ సుమంత్ అశ్విన్
2015 సూర్య వర్సెస్ సూర్య తెలుగు కార్తీక్ ఘట్టమనేని
2016 నాన్నకు ప్రేమతో తెలుగు సుకుమార్ ఎన్.టి.ఆర్, రకుల్ ప్రీత్ సింగ్
2021 నెయిల్ పాలిష్ హిందీ బగ్స్ భార్గవ కృష్ణ అర్జున్ రాంపాల్, మానవ్ కౌల్

మూలాలుసవరించు

  1. ఎస్, సత్యబాబు (26 August 2012). "చిన్ని చిన్ని ఆశ... మళ్లీ చిగురించదా!". సాక్షి ఫన్‌డే. Retrieved 19 March 2017.[permanent dead link]

బయటిలింకులుసవరించు