గొల్లగూడెం (కంకిపాడు)

గొల్లగూడెం, కృష్ణా జిల్లా కంకిపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. సముద్రమట్టానికి 24 మీ.ఎత్తు లో ఉంది. ఈ గ్రామం విజయవాడకు 20 కి.మీ. దూరంలో ఉంది. దగ్గరలోని పట్టణం కంకిపాడు.

గొల్లగూడెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
గొల్లగూడెం is located in Andhra Pradesh
గొల్లగూడెం
గొల్లగూడెం
అక్షాంశరేఖాంశాలు: 16°26′25″N 80°46′45″E / 16.44020308251885°N 80.77927936413795°E / 16.44020308251885; 80.77927936413795
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం కంకిపాడు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి దాసరి వాణి
పిన్ కోడ్ 521 151
ఎస్.టి.డి కోడ్ 08686

సమీప గ్రామాలు మార్చు

ఈ గ్రామానికి సమీపంలో పునాదిపాడు, కోలవెన్ను, కంకిపాడు, గోసాల, ఉప్పలూరు, గ్రామాలు ఉన్నాయి.

గ్రామానికి రవాణా సౌకర్యాలు మార్చు

ఈ గ్రామానికి రావాలంటే విజయవాడ - బందరు రోడ్డులో 211 నం. బస్సు ఎక్కాలి.రైల్వేస్టేషన్: విజయవాడ 21 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు మార్చు

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో 130 మంది విద్యార్థులు విద్యనభ్యసించుచున్నారు. గత సంవత్సరం, ప్రభుత్వం ఈ పాట్ఘశాలలో 8వ తరగతికి అనుమతిని ఇచ్చినది. సర్వశిక్ష అభియాన్ నిధులు మరియూ దాతల సహకారంతో ఈ పాఠశాలకు పలు వసతులు సమకూరుచున్నవి. []

ఆర్.సి.ఎం.పాఠశాల.

గ్రామ పంచాయతీ మార్చు

ఈ గ్రామానికి 2013 జూలైలో జరిగిన ఎన్నికలలో దాసరి వాణి సర్పంచిగా ఎన్నికైంది. [1]

దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు మార్చు

  1. శ్రీ కోదండరామాలయ దేవాలయం.
  2. శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం.
  3. గ్రామ దేవత 'పోతురాజు'.
  4. గ్రామంలో జరిగే "గొంతేనమ్మ పండుగ"(కుంతీదేవి ఉత్సవాలు) కన్నుల పండుగగా ఉంటుంది.
  5. ఈ గ్రామంలో హిందువులు అధికంగా వున్నప్పటికీ క్రైస్తవులు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. సుమారు 2 చర్చ్ లు (ఆర్ సి యం, సి బి యం).
  6. ముఖ్య పండుగలు:- సంక్రాంతి,దసరా,గొంతేనమ్మ పండుగ, గుడ్ ఫ్రైడే,క్రిస్మస్.

గ్రామంలో ప్రధాన పంటలు మార్చు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు మార్చు

ఈ గ్రామ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయాధారమైనది. కానీ విద్యావంతులైన వారు ఎక్కువమంది వుండటం వలన రాను రాను ఇది మారుతున్నది.

మూలాల మార్చు

వెలుపలి లింకులు మార్చు

[1] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2013, ఆగష్టు-11; 2వపేజీ.