గోకరాజు గంగరాజు
గోకరాజు గంగరాజు భారతదేశ రాజకీయనాయకుడు, 16వలోక్‌సభ సభ్యుడు. అతడు 2014 భారత సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లోని నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు.[1] అతడు లైలా గ్రూపు కంపెనీలకు వ్యవస్థాపకుడు. ప్రస్తుతం దక్షిణ జోన్ భారతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డు కు ఉపాధ్యక్షునిగా ఉన్నాడు.
గోకరాజు గంగరాజు | |||
వ్యాపారవేత్త | |||
ముందు | కనుమూరి బాపిరాజు | ||
---|---|---|---|
నియోజకవర్గం | నర్సాపురం | ||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 26 May 2014 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
సంతానం | జి.వి.కే.రంగరాజు, జి.రామరాజు | ||
నివాసం | విజయవాడ | ||
పూర్వ విద్యార్థి | ఆంధ్రా విశ్వవిద్యాలయం | ||
మతం | హిందూ | ||
May, 2014నాటికి |
వ్యవసాయ కుటుంబంలో జన్మించిన వ్యక్తిగా గంగరాజు పారిశ్రామిక వేత్తగా, సమాజ సేవకునిగా గుర్తింపు పొందాడు. అతడు విశ్వ హిందూ పరిషత్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ల ద్వారా అంకిత భావంతో సేవలనందిస్తున్నాడు. అతడికి సహకారమిస్తున్న స్నేహితుడు వరప్రసాద్ (శాసనసభ్యుడు). అతడు 1970లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఫార్మసీ లో డిగ్రీని పొందాడు.
అతడి తండ్రి గోకరాజు రంగరాజు ఉండి శాసనసభ నియోజకవర్గం నుండి శాసన సభ్యునిగా, పశ్చిమ గోదావరి జిల్లా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా, టిటిడి బోర్డు చైర్మన్‌గా రెండుసార్లు తన సేవలనందించాడు.
అతడికి క్రీడల పట్ల ఉన్న ఆసక్తి కారణంగా ఆంధ్ర ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కు సెక్రటరీగా గా ఉన్నాడు. బి.సి.సి.ఐ ఆర్థిక కమిటీ చైర్మన్ గా ఉన్నాడు. బి.సి.సి.ఐ ద్వారా నిర్వహింపబడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ యొక్క ప్రభుత్వ కౌన్సిల్ లో సభ్యునిగా కూడా ఉన్నాడు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికె ఇన్ ఇండియా (బి.సి.సి.ఐ) కు ఉపాధ్యక్షునిగా ప్రస్తుతం ఉన్నాడు.[2]
మూలాలు
మార్చు- ↑ "Constituencywise-All Candidates". Archived from the original on 17 మే 2014. Retrieved 17 May 2014.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-05-18. Retrieved 2018-04-24.