నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభా నియోజకవర్గములు ఉన్నాయి. దీని పరిధివరకే 2022 లో పశ్చిమ గోదావరి జిల్లాను పరిమితం చేశారు.
అసెంబ్లీ నియోజకవర్గాలు సవరించు
నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులు సవరించు
లోక్‌సభ కాలము గెలిచిన అభ్యర్థి పార్టీ రెండవ 1957-62 ఉద్దరాజు రామం సి.పి.ఐ మూడవ 1962-67 డి.బలరామరాజు భారత జాతీయ కాంగ్రెస్ నాల్గవ 1967-71 డి.బలరామరాజు భారత జాతీయ కాంగ్రెస్ ఐదవ 1971-77 ఎం.టి.రాజు భారత జాతీయ కాంగ్రెస్ ఆరవ 1977-80 అల్లూరి సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ కాంగ్రెస్ ఏడవ 1980-84 అల్లూరి సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ కాంగ్రెస్ ఎనిమిదవ 1984-89 భూపతిరాజు విజయకుమార్ రాజు తెలుగుదేశం పార్టీ తొమ్మిదవ 1989-91 భూపతిరాజు విజయకుమార్ రాజు తెలుగుదేశం పార్టీ పదవ 1991-96 భూపతిరాజు విజయకుమార్ రాజు తెలుగుదేశం పార్టీ పదకొండవ 1996-98 కొత్తపల్లి సుబ్బరాయుడు తెలుగుదేశం పార్టీ పన్నెండవ 1998-99 కనుమూరి బాపిరాజు భారత జాతీయ కాంగ్రెస్ పదమూడవ 1999-04 ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు భారతీయ జనతా పార్టీ పదునాల్గవ 2004-09 చేగొండి వెంకట హరిరామజోగయ్య భారత జాతీయ కాంగ్రెస్ పదు ఐదవ 2009-14 కనుమూరి బాపిరాజు నేషనల్ కాంగ్రెస్ పదహారవ 2014- 2019 గోకరాజు గంగరాజు భారతీయ జనతా పార్టీ పదిహేడవ 2019 - ప్రస్తుతం రఘురామ కృష్ణంరాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
2004 ఎన్నికలు సవరించు
2004 ఎన్నికల ఫలితాలను చూపే చిత్రం
భారత సాధారణ ఎన్నికలు,2004:నరసాపురం | |||||
---|---|---|---|---|---|
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
భారత జాతీయ కాంగ్రెస్ | చేగొండి వెంకట హరిరామజోగయ్య | 402,761 | 52.41 | +16.19 | |
భారతీయ జనతా పార్టీ | ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు | 338,349 | 44.02 | -15.76 | |
పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా | యుగంధర అల్లూరి రాజు | 27,427 | 3.57 | ||
మెజారిటీ | 64,412 | 8.39 | +31.95 | ||
మొత్తం పోలైన ఓట్లు | 768,537 | 75.16 | +3.26 | ||
కాంగ్రెస్ గెలుపు | మార్పు | +16.19 |
2009 ఎన్నికలు సవరించు
2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున కనుమూరి బాపిరాజు పోటీ చేసారు.[1] తెలుగుదేశం పార్టీ తరఫున తోట సీతామహాలక్ష్మి పోటీలో ఉంది.[2] ప్రజారాజ్యం తరుపున డా.గుబ్బల తమ్మయ్య పోటీ చేసారు.[3] ఈ ఎన్నికలలో కనుమూరి బాపిరాజు సమీప ప్రత్యర్థి అయిన తోట సీతామహలక్ష్మీ పై విజయం సాధించారు. బాపిరాజుకు 389422 ఓట్లు వస్తే సీతామహలక్ష్మికి 274732 ఓట్లు వచ్చాయి.
2014 ఎన్నికల ఫలితాలు సవరించు
2014 ఎన్నికల ఫలితాలను చూపే చిత్రం
2014 భారత సార్వత్రిక ఎన్నికలు: నరసాపురం | |||||
---|---|---|---|---|---|
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
భారతీయ జనతా పార్టీ | గోకరాజు గంగరాజు | 5,40,306 | 49.61 | +48.40 | |
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ | వంక రవీంద్రనాథ్ | 4,54,955 | 41.77 | +41.77 | |
భారత జాతీయ కాంగ్రెస్ | కనుమూరి బాపిరాజు | 27,083 | 2.49 | -36.81 | |
Independent | గీతాదాస్ దాస్ | 23,260 | 2.14 | +2.14 | |
BSP | చింతపల్లి కాంతారావు | 8,491 | 0.78 | -0.12 | |
NOTA | None of the above | 8,004 | 0.73 | +0.73 | |
మెజారిటీ | 85,351 | 7.84 | -3.74 | ||
మొత్తం పోలైన ఓట్లు | 10,88,947 | 82.19 | -2.28 | ||
INC పై బి.జె.పి విజయం సాధించింది | ఓట్ల తేడా |
2019 ఎన్నికలు సవరించు
నర్సాపురం లోక్‌సభ స్థానం బరిలో వైఎస్ఆర్సీపీ నుంచి రఘురామ కృష్ణంరాజు, టీడీపీ అభ్యర్థిగా వేటూకూరి వెంకట శివరామరాజు (కలవపూడి శివ), జనసేన అభ్యర్థిగా కొణిదెల నాగబాబు ప్రధాన అభ్యర్థులుగా పోటీ చేశారు. నర్సాపురం లోక్‌సభ స్థానం నుండి వైఎస్ఆర్సీపీ నుంచి రఘురామ కృష్ణంరాజు ఎంపీగా గెలిచాడు.
2019 భారత సార్వత్రిక ఎన్నికలు: నరసాపురం | |||||
---|---|---|---|---|---|
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ | రఘురామ కృష్ణంరాజు | 4,47,594 | |||
తెలుగుదేశం పార్టీ | వేటూకూరి వెంకట శివరామరాజు (కలవపూడి శివ) | 4,15,685 |
నియోజకవర్గ ప్రముఖులు సవరించు
- కృష్ణంరాజు
- కృష్ణంరాజు మొదట కాంగ్రెస్ పార్టీలో 1991లో చేరినాడు. అదే ఏడాది నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీచేసిన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూపతిరాజు విజయకుమార్ రాజు చేతిలో ఓడిపోయాడు. ఆ తర్వాత కొద్దికాలం రాజకీయాలకు దూరమై సినిమాలకు పరిమితమయ్యాడు. 1998 ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరి కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం నుండి విజయం సాధించి లోక్‌సభలో అడుగుపెట్టాడు. 1999 మధ్యంతర ఎన్నికలలో నర్సాపురం లోక్‌సభ నుండి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజుపై గెలుపొంది కేంద్రంలో వాజపేయి నేతృత్వంలోని ఎన్.డి.ఏ. ప్రభుతంలో మంత్రిపదవిని నిర్వహించాడు. 2004 లోక్‌సభ ఎన్నికలలో మళ్ళీ అదే స్థానం నుండి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి జోగయ్య చేతిలో పరాజయం పొందినాడు. మార్చి 2009లో భారతీయ జనతా పార్టిని వీడి చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో చేరినాడు.
- కనుమూరి బాపిరాజు