గోకులంలో సీత

1997 సినిమా

గోకులంలో సీత ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో 1997 లో విడుదలైన చిత్రం. పవన్ కల్యాణ్, రాశి ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని శ్రీ పద్మసాయి చిత్ర పతాకంపై బి. శ్రీనివాస రాజు నిర్మించాడు. ఈ సినిమా మూలకథ అగస్త్యన్ అందించగా పోసాని కృష్ణమురళి మాటలు రాశాడు.[1] ఈ సినిమా తమిళంలో వచ్చిన గోకులత్తిల్ సీతై అనే తమిళ సినిమాకు పునర్మిర్మాణం. తండ్రి గారాబంతో విలాసాలకు అలవాటు పడి నిర్లక్ష్యంగా జీవితం గడిపే కథానాయకుడు, కథానాయిక పరిచయంతో జీవితం ఎలా మార్చుకున్నాడన్నదే ఈ చిత్ర కథ. పవన్ కల్యాణ్ కు తొలిసారిగా వ్యాపారాత్మక విజయం సాధించి పెట్టిన సినిమా ఇది. ఇది చిరంజీవి పుట్టిన రోజు విడుదల కావడం గమనార్హం.[2]

గోకులంలో సీత
Gokulamlo Seeta.jpg
దర్శకత్వంముత్యాల సుబ్బయ్య
నిర్మాతబి. శ్రీనివాసరాజు
నటవర్గంపవన్ కల్యాణ్,
రుక్మిణి,
రాశి,
కోట శ్రీనివాసరావు
హరీష్
సంగీతంకోటి
నిర్మాణ
సంస్థ
శ్రీ పద్మసాయి చిత్ర
భాషతెలుగు

కథసవరించు

కల్యాణ్ ఒక ధనవంతుడైన ముద్దు కృష్ణయ్య కొడుకు. అతనికి చిన్నతనంలోనే తల్లి చనిపోయి ఉంటుంది. తండ్రి గారాబంతో, నిర్లక్ష్యంతో విలాసాలకు అలవాటు పడతాడు. ముఖ్యంగా అమ్మాయిలను లొంగదీసుకోవడమంటే అతనికి సరదా. అతని కంపెనీలో పనిచేసే భాస్కర్ శిరీష అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. శిరీషకు వేరే పెళ్ళి జరగబోతుంటే భాస్కర్ ఆత్మహత్యా ప్రయత్నం చేస్తాడు. కల్యాణ్ అతన్ని ఆపి శిరీషను దొంగతనంగా తీసుకొచ్చేస్తాడు. తీరా శిరీషను తీసుకొచ్చేసరికి భాస్కర్ తండ్రి అందుకు ఒప్పుకోడు. పైగా శిరీష శీలాన్ని శంకిస్తాడు. దిక్కు తెలియని శిరీష ఎక్కడికి వెళ్ళాలో తెలీక బాధపడుతుండే కల్యాణ్ తన ఇంట్లో ఆశ్రయం ఇస్తాడు. కల్యాణ్ ప్రవర్తన గురించి తెలిసిన అతని స్నేహితులు కొంతమంది ఇద్దరి గురించి చెడుగా మాట్లాడుకుంటారు. కానీ శిరీష దాని గురించి బాధపడవద్దని నచ్చజెప్పి అతని ప్రవర్తనలో మార్పు తీసుకువస్తుంది. కల్యాణ్ శిరీషను పెళ్ళి చేసుకుంటానని తండ్రిని అడుగుతాడు. ముద్దుకృష్ణయ్య శిరీషను డాక్టర్ తీసుకువెళ్ళి కన్యత్వ పరీక్ష చేయడానికి సిద్ధ పడతాడు. శిరీష మనసు విరిగిపోయి మళ్ళీ తన ఇంటికి వెళ్ళిపోతుంది. కల్యాణ్ తన తండ్రి చేసిన తప్పు తెలుసుకుని శిరీషను క్షమాపణ వేడుకోవాలని వెళతాడు. కానీ ఆమె అతనితో మాట్లాడదు. దాంతో కల్యాణ్ ఆమె ఇంటి ముందే ఆమరణ నిరాహారదీక్ష చేపడతాడు. ఈలోపు ఇంట్లో వాళ్ళు ఆమెకు బలవంతంగా పెళ్ళి చేయడానికి ప్రయత్నిస్తారు. శిరీష కోరిక మేరకు కల్యాణ్ ఆ పెళ్ళిని ఆపి ఆమెను పెళ్ళి చేసుకోవడంతో కథ ముగుస్తుంది.

తారాగణంసవరించు

పాటలుసవరించు

  • అందాల సీమలోని పారిజాత పుష్పమా (గాయకులు: నాగూర్ బాబు, చిత్ర)
  • ఊ అంది పిల్ల అల్లో మల్లేశా (గాయకులు: మురళీధర్, స్వర్ణలత)
  • గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా (గాయకులు: బాలు, చిత్ర)
  • పొద్దే రానీ లోకం నీది (గాయకురాలు: చిత్ర)
  • ప్రేమా ప్రేమా ఓ ప్రేమా పిలుపును వినవమ్మా (గాయకుడు: బాలు)
  • మనసున్న కనులుంటే ప్రతిచోట మధుమాసం కనిపించదా (గాయకులు: మాల్గాడి శుభ, చిత్ర)
  • హే పాప దిల్ దేదే పాప (గాయకులు: నాగూర్ బాబు, మాల్గాడి శుభ)

మూలాలుసవరించు

  1. Telugu, ntv (2022-08-22). "Gokulamlo Seeta: పాతికేళ్ళ 'గోకులంలో సీత'". NTV Telugu. Retrieved 2023-01-10.
  2. "'గోకులంలో సీత'కు పాతికేళ్ళు". Teluguone (in english). 2023-01-12. Retrieved 2023-01-12.{{cite web}}: CS1 maint: unrecognized language (link)