మాల్గాడి శుభ

గాయని

మాల్గాడి శుభగా ప్రసిద్ధి చెందిన మాల్గుడి శుభ ఒక పాప్ గాయని, భారతీయ సినిమా నేపథ్య గాయని. 2000లో విడుదలైన చిక్‌పక్ చిక్‌భం అనే ప్రైవేటు ఆల్బమ్‌లో ఈమె పాడిన "మాల్గాడి ఎక్కి గోల్కొండ చూడ వచ్చినా" పాట బంపర్ హిట్ కావడంతో ఈమె పేరు మాల్గాడి శుభగా స్థిరపడి పోయింది.

శుభ
నివాస ప్రాంతంచెన్నై
వృత్తిభారతీయ చలనచిత్ర నేపథ్య గాయని
క్రియాశీలక సంవత్సరాలు1992 నుండి ప్రస్తుతం
మతంహిందూ మతం

విశేషాలు

మార్చు

తమిళనాడు రాష్ట్రం తిరువయ్యూరుకు చెందిన శుభ ముంబాయిలో పెరిగింది. ఈమె అక్కడ కర్ణాటక సంగీతాన్ని, పాశ్చాత్య సంగీతాన్ని అభ్యసించింది. ఢిల్లీ లోని హోటల్ అశోకాలో పాటలు పాడటం ద్వారా పాప్ గాయనిగా తన వృత్తిని ప్రారంభించింది. ఉషా ఉతుప్ను తన మానసిక గురువుగా భావించే ఈమె తరువాత తన మకాంను కోల్‌కాతాకు మార్చింది. అక్కడ గిటారిస్ట్ కార్ల్‌టన్ కిట్టో వద్ద జాజ్ సంగీతాన్ని నేర్చుకుంది. ఆ తరువాత 1990లో చెన్నైలో స్థిరపడింది.[1] దక్షిణ భారత నటి ప్రియమణి ఈవిడ మేనకోడలు.

గాయనిగా

మార్చు

ఈమె సెట్ మీ ఫ్రీ, చిక్ పక్ చిక్ భం, సునేరె నాచేరె, ఆటం కొండాట్టం మొదలైన ప్రైవేటు ఆల్బమ్‌లు చేసింది. తెలంగాణ యాసలో రాజ్ కోటి సంగీతంలో వెలువడిన చిక్ పక్ చిక్ బం ఆల్బం పదహారు లక్షల క్యాసెట్లు అమ్ముడు పోయాయి. ఈమె ఇంకా భక్తి గీతాలు, నర్సరీ రైమ్స్ పాడింది. ఈమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల చలనచిత్రాలలో 3000కు పైగా పాటలు పాడింది.

తెలుగు సినిమా పాటల జాబితా

మార్చు

ఈమె పాడిన తెలుగు సినిమా పాటల పాక్షిక జాబితా:

సంవత్సరం సినిమా పేరు పాట సంగీతం సాహిత్యం సహ గాయకులు
1992 అలెగ్జాండర్ వల వేసి పట్టేది వాడే గురి చూసి కొట్టేది వాడే రాజ్ కోటి భువనచంద్ర
1992 అలెగ్జాండర్ హేపీ హేపీ హేపీ హేపీ తేరా పాపి రాజ్ కోటి భువనచంద్ర
1993 అక్కాచెల్లెళ్లు కొక్కోకోలా కొక్కో కోలా నీకోడి నా డిస్కో కోలా శ్రీ వేటూరి మనో
1993 జెంటిల్ మేన్ ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మా ఎ.ఆర్.రెహమాన్ రాజశ్రీ సాహుల్ హమీద్, స్వర్ణలత
1993 రక్షణ నీకు నాకు ఉన్న లింకు ఈడనో చెప్పలేను ఆడనో చెప్పలేను ఎం.ఎం.కీరవాణి సిరివెన్నెల సీతారామశాస్త్రి
1994 గోవిందా గోవిందా అమ్మ బ్రహ్మ దేవుడో కొంప ముంచినావురో... రాజ్ కోటి సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర
1996 అప్పాజి మమ్ము సాప్ప మమ్ము సాప్ప ఎం.ఎం.కీరవాణి వెన్నెలకంటి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
1996 ఏంటి..? ఎప్పుడు..? ఎక్కడ..? ఇప్పసారా తాగి ఈడు తేజ భారతీబాబు
1997 గోకులంలో సీత తళక్ తళక్ అని తళకుల తార కోటి వేటూరి చిత్ర
1997 గోకులంలో సీత హే పాప దిల్ దేదే పాప కోటి వేటూరి మనో
1997 చిన్నబ్బాయి వసంతుడికి ఎలా తెలిసెనంట వనకన్య మనసులోని మాట ఇళయరాజా సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
1998 పెళ్ళి కానుక సువ్వీ సువ్వీ సువ్వాలా మువ్వా గోపాల ఎం.ఎం.కీరవాణి సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
1999 హలో ప్రేమిస్తావా క్యాంపన్‌లో ర్యాగింగ్ వి.మనోహర్ భారతీబాబు బృందం
2010 కొమరం పులి పిచ్చి కుచ్చి ఎ.ఆర్.రెహమాన్ చంద్రబోస్ ఉదిత్ నారాయణ్, మధుశ్రీ
2012 జులాయి పకడో... ఓ... పకడో... ఓ... పకడో పకడో పకడో పకడో దేవిశ్రీ ప్రసాద్ రామజోగయ్య శాస్త్రి దేవీశ్రీ ప్రసాద్
2013 అత్తారింటికి దారేది ఓరి దేవుడో దేవుడో ఏం పిల్లగాడే దేవిశ్రీ ప్రసాద్ రామజోగయ్య శాస్త్రి డేవిడ్ సిమోన్ బృందం

మూలాలు

మార్చు
  1. సుధీష్, కామత్ (7 October 2001). "'Aatam Kondattam' is her style". ది హిందూ. Retrieved 25 March 2017.

బయటిలింకులు

మార్చు