కోట శ్రీనివాసరావు

ప్రముఖ సినీ నటుడు, రాజకీయ నాయకుడు
(కోట శ్రీనివాస రావు నుండి దారిమార్పు చెందింది)

కోట అని ముద్దుగా పిలువబడే కోట శ్రీనివాసరావు తెలుగు సినిమా నటుడు. కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన కోట శ్రీనివాసరావు తండ్రి కోట సీతారామాంజనేయులు కంకిపాడులో ప్రసిద్ధి చెందిన వైద్యుడు. కోట 1942, జులై 10న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. బాల్యము నుండి కోటకు నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది. సినిమాలలో రాకముందు ఈయన స్టేట్ బ్యాంకులో పనిచేసేవాడు. 1968లో ఈయనకు రుక్మిణితో వివాహమయ్యింది. వీరికి ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు. ఇతని పేరు కోట ప్రసాద్. ఈయన కూడా నటుడు. 2010 జూన్ 21 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు.[1][2]

కోట శ్రీనివాసరావు
Kota srinivasarao.jpg
కోట శ్రీనివాసరావు
జననం
కోట శ్రీనివాసరావు

1942, జులై 10
విద్యాసంస్థసి.ఆర్.రెడ్డి కళాశాల
వృత్తిఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
తెలుగు సినిమా నటుడు
జీవిత భాగస్వామిరుక్మిణి
పిల్లలుకోట ప్రసాద్
తల్లిదండ్రులు
 • కోట సీతారామాంజనేయులు (తండ్రి)
బంధువులుకోట శంకరరావు (సోదరుడు)

కోట శ్రీనివాసరావు విజయవాడ తూర్పు శాసనసభా నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు. 2015 లో ఇతనికి భారత ప్రభుత్వము పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. ఐదు నంది పురస్కారాలు అందుకున్నాడు.

సినీరంగ ప్రవేశంసవరించు

 
కోట శ్రీనివాసరావుకు బాగా పేరు తెచ్చిపెట్టిన పిసినారి పాత్ర

బాల్యం నుండి నాటకరంగములో ఆసక్తి ఉన్న కోట సినిమాలలో రంగప్రవేశము చేసేనాటికి రంగస్థలముపై 20 యేళ్ళ అనుభవం గడించాడు. 1978-79లో ప్రాణం ఖరీదు నాటకం వేస్తుండగా ఆ ప్రదర్శన చూసిన సినిమా దర్శక నిర్మాత క్రాంతికుమార్ ఆ నాటకాన్ని సినిమాగా తీయాలనుకున్నాడు. మర్యాద పూర్వకముగా ఆ నాటకములో నటించిన నటీనటులందరినీ సినిమాలో కూడా తీసుకున్నారు. అలా కోట శ్రీనివాసరావు సినీరంగ ప్రవేశం జరిగింది. అంతవరకు ఎప్పుడూ సినీ నటుడవ్వాలని ప్రయత్నించని కోట 1986 వరకు సినిమాలను సీరియస్ తీసుకోలేదు.

అహ నా పెళ్ళంట సినిమాలో కథానాయిక తండ్రిగా చేసిన పిసినిగొట్టు పాత్ర చాలా పేరు తెచ్చింది. కోట శ్రీనివాసరావు ప్రతినాయక పాత్ర పోషించారు. యోగి సినిమాలో ప్రతినాయక పాత్ర పోషించారు. తరువాత వెంకటేష్ హీరోగా నటించిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో వెంకటేష్ తండ్రిగా నటించారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన రాఖి సినిమాలో ఎన్టీఆర్కు తాతగా నటించారు మరొక సినిమా బృందావనంలో కూడా ఎన్టీఆర్కు తాతగా నటించారు. కోట శ్రీనివాసరావు గబ్బర్ సింగ్ లో శ్రుతిహాసన్ కు తండ్రిగా నటించారు. కోట శ్రీనివాసరావు బాబు మోహన్ తో కలిసి చాలా సినిమాలలో జోడిగా నటించారు. కోట శ్రీనివాస రావు రాజేంద్రప్రసాద్ కీలకపాత్రలో నటించిన ఆ నలుగురు సినిమాలో కోట శ్రీనివాసరావు కీలకపాత్రలో నటించారు. కోటా శ్రీనివాసరావు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు లో ప్రతి నాయకుడిగా నటిస్తున్నాడు.


ప్రజాదరణ పొందిన కోట డైలాగులుసవరించు

 • ఈ డెవడ్రా బాబూ...
 • నాకేంటి ..మరి నాకేంటి.
 • మరదేనమ్మా నా స్పెషల్.
 • అయ్య నరకాసుర.
 • అంటే నాన్నా అది

పురస్కారాలుసవరించు

 • పద్మశ్రీ పురస్కారం - 2015 : 37 సంవత్సరాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో విజయవంతమైన నటుడిగా కొనసాగుతున్న ఈయన్ని పద్మ అవార్డులలో భాగంగా పద్మశ్రీతో భారత ప్రభుతం సత్కరించింది.[3]

నంది పురస్కారాలుసవరించు

 1. నంది ఉత్తమ విలన్- గణేష్ (1998)
 2. నంది ఉత్తమ విలన్ - చిన్న (2000)
 3. నంది ఉత్తమ సహాయ నటుడు- పృథ్వీ నారాయణ (2002)
 4. నంది ఉత్తమ సహాయ నటుడు - ఆ నలుగురు (2004)
 5. నంది ఉత్తమ సహాయ నటుడు - పెళ్లైన కొత్తలో (2006)

చిత్ర సమాహారంసవరించు

తెలుగు సినిమాలుసవరించు

మూలాలుసవరించు

 1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-11-23. Retrieved 2013-11-17.
 2. "టోటల్ టాలీవుడ్లో కోట శ్రీనివాసరావు ఇంటర్వ్యూ". Archived from the original on 2007-06-08. Retrieved 2007-10-27.
 3. "jeevi review for Adda". idlebrain.com. Retrieved 16 July 2019.
 4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-06-26. Retrieved 2020-08-04.
 5. "Chinnabbaayi Cast and Crew | Star Cast | Telugu Movie | Chinnabbaayi Actor | Actress | Director | Music | Oneindia.in". Popcorn.oneindia.in. Archived from the original on 12 July 2012. Retrieved 2020-06-16.
 6. ఐడ్రీమ్ పోస్ట్, సినిమాలు (7 April 2020). "గురి తప్పిన 'సాహస వీరుడు'". www.idreampost.com (in ఇంగ్లీష్). Retrieved 22 June 2020.[permanent dead link]

బయటి లింకులుసవరించు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో కోట శ్రీనివాసరావు పేజీ