గోనె ప్రకాశ్ రావు
గోనె ప్రకాశ్ రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1983లో పెద్దపల్లి నియోజకవర్గం శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.[1]
గోనె ప్రకాశ్ రావు | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1983 జనవరి 5 – 1983 జులై 27 | |||
ముందు | గొట్టిముక్కుల రాజిరెడ్డి | ||
---|---|---|---|
తరువాత | కాల్వ రాంచంద్రారెడ్డి | ||
నియోజకవర్గం | పెద్దపల్లి నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1955 రామగుండం, పెద్దపల్లి జిల్లా, తెలంగాణ రాష్ట్రం | ||
జాతీయత | భారతదేశం | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
నివాసం | హైదరాబాద్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుగోనె ప్రకాశ్‌రావు విద్యార్థి దశ నుండే రాజకీయ పట్ల ఆసక్తితో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 1983లో పెద్దపల్లి నియోజకవర్గం నుండి సంజయ్‌విచార్‌మంచ్ (స్వతంత్ర) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి గీట్ల ముకుందారెడ్డి 6427 వేల ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన ఆరునెలలకు తన పదవికి రాజీనామా చేశాడు. గోనె ప్రకాశరావు తరువాత కాంగ్రెస్ ప్రభుత్వంలో వై.యస్. రాజశేఖరరెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ చైర్మన్‌గా పనిచేశాడు.[2] వై.యస్. రాజశేఖరరెడ్డి చనిపోవడంతో ఆయన కుమారుడు పెట్టిన వైసీపీలో చేరి కొంతకాలం పనిచేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరమై విశ్లేషకుడిగా మారాడు.[3]
మూలాలు
మార్చు- ↑ Sakshi (8 November 2018). "పెద్దపల్లి పెద్దన్నలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
- ↑ Sakshi (3 January 2017). "'వైఎస్ హయాంలో ఫిరాయింపులు లేవు'". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
- ↑ Eenadu (15 November 2023). "అలా ఆగమనం.. ఇలా కనుమరుగు". Archived from the original on 21 December 2023. Retrieved 21 December 2023.