గోపాల్ హరి దేశ్‌ముఖ్
గోపాల్ హరి దేశ్‌ముఖ్ ( 1823 ఫిబ్రవరి 18 - 1892 అక్టోబరు 9) (మరాఠీ: गोपाल हरी देशमुख) మహారాష్ట్రకు చెందిన రచయిత, సామాజిక సంఘ సంస్కర్త. పశ్చిమ భారత్ లో తొలికాలం నాటి మత సంస్కర్త. సామాజిక సంస్కరణలను అనుమతించని మతం ఎన్నటికీ మార్పు చెందదని అతను అన్నారు.
ఇతర పేర్లు | లోఖిత్వాడి, రావు బహదూర్ |
---|---|
జననం | పూణే, పూణే, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుత మహారాష్ట్ర, భారతదేశం) | 1823 ఫిబ్రవరి 18
మరణం | 1892 అక్టోబరు 9 పూణే, బ్రిటిష్ ఇండియా | (వయసు 65)
యుగం | 19వ శతాబ్దపు తత్వవేత్త |
ప్రధాన అభిరుచులు | నీతి, మతం, మానవత్వం |
జీవితం తొలి దశలో
మార్చు1823లో గోపాల్ హరి దేశ్‌ముఖ్ మహారాష్ట్రకు చెందిన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. అతని అసలు ఇంటిపేరు 'శిధయే'. కుటుంబానికి లభించిన 'వతన్' (పన్ను వసూలు హక్కు) కారణంగా, ఆ కుటుంబం తరువాత దేశ్‌ముఖ్ అని మారిపోయింది.[1] పూణేలో ఆంగ్ల మాధ్యమం స్కూల్లో చదువుకున్నాడు.[2] సామాజిక సంస్కరణ ఉద్యమంలో గోపాల్ హరి దేశ్‌ముఖ్ ఒక ముఖ్యమైన వ్యక్తిగా పరిగణించబడ్డాడు.
ఉద్యోగం
మార్చుతన కెరీర్‌ను బ్రిటిష్ రాజ్ ప్రభుత్వంలో అనువాదకునిగా ప్రారంభించాడు. 1867లో, ప్రభుత్వం అతడిని గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో న్యాయమూర్తిగా నియమించింది. అలాగే అతను రత్లాం రాష్ట్రంలో కూడా దివాన్‌గా పనిచేశాడు. అతను పనిచేస్తున్నప్పుడు ప్రభుత్వం అతడిని 'జస్టిస్ ఆఫ్ పీస్', 'రావుబాహదూర్' అనే గౌరవాలతో సత్కరించింది. అతను సెషన్స్ జడ్జిగా పదవీ విరమణ పొందాడు. అతను అసిస్టెంట్ ఇనామ్ కమిషనర్, నాసిక్ హైకోర్టు జాయింట్ జడ్జి, లా కౌన్సిల్ సభ్యుడు.. ఇలా అనేక ఇతర ముఖ్యమైన పదవులను నిర్వహించాడు.[3]
సామాజిక సేవ
మార్చుగోపాల్ హరి దేశ్‌ముఖ్ 25 సంవత్సరాల వయస్సులో, మహారాష్ట్రలో సామాజిక సంస్కరణను లక్ష్యంగా చేసుకొని వ్యాసాలు లోహితవాది (लोकहितवादी) అనే కలం పేరుతో రభకర్రభాకర్ (रभाकर्रभाकर) అనే వారపత్రికలో రాయడం ప్రారంభించాడు. రెండేళ్లలోనే 108 వ్యాసాలు రాసాడు. ఆ వ్యాసాల సమూహం మరాఠీ సాహిత్యంలో లోహితవాడించి శతపత్రే (लोकहितवादींची शतपत्रे) గా ప్రసిద్ధి చెందింది.
అతను విముక్తి, మహిళల విద్యను ప్రోత్సహిస్తూనే ఆ కాలంలో దేశంలో ప్రబలంగా ఉన్న బాల్య వివాహాలు, వరకట్నం, బహుభార్యాత్వానికి వ్యతిరేకంగా రాసాడు. జ్ఞాన్ ప్రకాష్ (रकाश्ञानप्रकाश), ఇందు ప్రకాష్ (रकाश्रकाश), లోఖిత్వాడి (लोकहितवादी) పత్రికలను స్థాపించడంలో ఆయన నాయకత్వ పాత్ర పోషించారు.
గోపాల్ హరి దేశ్‌ముఖ్ అహ్మదాబాద్‌లో న్యాయమూర్తిగా పనిచేస్తున్నప్పుడు, అతను ప్రేమభాయ్ ఇనిస్టిట్యూట్ స్పాన్సర్‌షిప్ కింద సామాజిక సమస్యలపై వార్షిక సమావేశాలను నిర్వహించాడు. స్వయంగా ప్రసంగాలు కూడా చేశాడు. అతను అహ్మదాబాద్‌లో ప్రార్థన సమాజ్ శాఖను స్థాపించాడు. వితంతువుల పునర్వివాహాలను ప్రోత్సహించే ఒక సంస్థను స్థాపించాడు. గుజరాత్ వెర్నాక్యులర్ సొసైటీని ఉత్తేజపరిచాడు. అతను గుజరాతీ, ఇంగ్లీష్ ద్విభాషా హైటెచ్చు (‘हितेच्छु) వారపత్రికను ప్రారంభించాడు. అతను "గుజరాతీ బుద్ధి-వార్ధక్ సభ" ను కూడా ప్రారంభించాడు.
రచనలు
మార్చుగోపాల్ హరి దేశ్‌ముఖ్ మతపరమైన, సామాజిక, ఆర్థిక, రాజకీయ, చారిత్రక, సాహిత్య విషయాలతో సహా విభిన్న అంశాలపై 35 పుస్తకాలు రాశారు. అతను పానిపట్ యుద్ధం, కలయోగ్, జాతిభేద్, లంకెచ ఇతిహాస్ పుస్తకాలు రచించారు. అతను కొన్ని ఆంగ్ల రచనలను మరాఠీలోకి కూడా అనువదించాడు. అతనిపై, అతని రచనలపై పలువురు ప్రముఖ రచయితలు అనేక పుస్తకాలు ప్రచురించారు.
మూలాలు
మార్చు- ↑ The Golden Book of India: A Genealogical and Biographical Dictionary of the Ruling Princes, Chiefs, Nobles, and Other Personages, Titled Or Decorated of the Indian Empire. Aakar Books. 1893. p. 150. ISBN 9788187879541.
- ↑ Bal Ram Nanda (1977). Gokhale: The Indian Moderates and the British Raj. Princeton University Press. p. 17. ISBN 9781400870493.
His[Deshmukh's] family of Chitpawan Brahmans, one of the greatest beneficiaries of the Peshwa regime...
- ↑ Language Politics, Elites, and the Public Sphere. Orient Blackswan. 2001. pp. 83–84. ISBN 9788178240145.