గౌతమేశ్వరాలయం (మంథని)

గౌతమేశ్వరాలయం, తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లా, మంథని మండల కేంద్రంలో ఉన్న దేవాలయం. గోదావరి నదికి దక్షిణ తీరాన ఉన్న ఈ దేవాలయం చారిత్రక పురావస్తు, మతపరమైన ఆధారాలకు సాక్షిగా నిలుస్తోంది.[1] గౌతమ మహర్షి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించడం వల్ల గౌతమేశ్వరాలయం అనే పేరు వచ్చింది.[2] మాఘమాసంలో నియమానుసారం ఇక్కడ స్నానాదానాదులు చేస్తే ఏడుజన్మల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం.

గౌతమేశ్వరాలయం
గౌతమేశ్వరాలయం
గౌతమేశ్వరాలయం
గౌతమేశ్వరాలయం (మంథని) is located in Telangana
గౌతమేశ్వరాలయం (మంథని)
తెలంగాణలో దేవాలయ స్థానం
భౌగోళికం
భౌగోళికాంశాలు18°37′57″N 79°32′05″E / 18.632532°N 79.534756°E / 18.632532; 79.534756
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాపెద్దపల్లి
స్థలంమంథని, మంథని మండలం
సంస్కృతి
దైవంలింగాకార శివుడు
ముఖ్యమైన పర్వాలునవరాత్రి, మహాశివరాత్రి
వాస్తుశైలి
నిర్మాణ శైలులుకాకతీయుల శైలీ

గర్భగృహం, మండపం అను రెండు భాగాలుగా ఉన్న ఈ దేవాలయంలోని గర్భాలయంలో గౌతమేశ్వరుడు పార్వతిమాత, మండపంలో నందీశ్వరుడు, కుడివైపున వినాయకుడు ఉన్నారు. ఇక్కడ ప్రతిఏటా నవరాత్రి, మహాశివరాత్రి రోజులలో ఉత్సవాలు జరుపబడుతాయి.

స్థల పురాణం మార్చు

గంగాదేవి రాకతో తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని అనుమానంతో పార్వతీదేవి గంగను వదిలేయమని శివుడు వేడుకోగా, అందుకు శివుడు అంగీకరించలేదు. దాంతో పార్వతి అలుక వహిస్తుంది. ఇదంతా గమనించిన వినాయకుడు తన తల్లి పార్వతి, తమ్ముడు కుమారస్వామిని వెంటపెట్టుకొని గౌతముని ఆశ్రమానికి వస్తాడు. అక్కడున్న జయని పిలిచి ఆవురూపం ధరించి గౌతముని చేలలో మేయమని వినాయకుడు ఆజ్ఞాపిస్తాడు. జయ ఆవు రూపం ధరించి గౌతముని పంట పొలాల్లో పడి మేస్తుండుగా, గౌతముడు గడ్డిపరకతో ఆ ఆవును అదిలించగానే, గణపతి ఆజ్ఞ ప్రకారం అది మరణిస్తుంది. గోహత్య మహాపాతకమని తలచి దానిని రూపుమాపుకోడానికి గౌతముడు పరమేశ్వరుడిని ప్రార్ధించాడు. పరమేశ్వరుడు కరుణించి మరణించిన గోవుపై గంగను ప్రవహింపచేస్తాడు. శివుడ్ని కూడా తనతోపాటే ఈ ప్రాంతంలో ఉండాలని గంగాదేవి కోరగా, ఆమె కోరిక ప్రకారం శివుడు కొండపైన శివలింగంగా వెలిసాడు. ఆ శివలింగాన్ని గౌతముడు ఈ ప్రాంతంతో ప్రతిష్టించి గంగాజలంతో అభిషేకించాడు. పార్వతీదేవి కూడా పరమేశ్వరునిలో సగభాగముగా లీనమైంది.

 
గౌతమేశ్వరాలయం మంథని, తెలంగాణ

ప్రత్యేకత మార్చు

పురాతనకాలంలో ఈ ప్రదేశం వేద అభ్యాస కేంద్రంగా ఉండేది.[3] ఇక్కడ వేద పండితులు ఉండేవారు. అందుకే ఈ ప్రాంతాన్ని మంత్రకుటం లేదా మంత్రపురి పిలిచేవారు. దక్షిణ గా ప్రవహించే గోదావరి నది, ఈ దేవాలయం దగ్గరికి రాగానే తన దిశను మార్చుకొని తూర్పు ముఖంగా ప్రవహిస్తోంది.

ఈ గౌతమేశ్వర దేవాలయ సముదాయంలో మూడు దేవాలయాలు ఉన్నాయి. కాకతీయుల పాలనలో నిర్మించబడిన ఈ దేవాలయ విమానం, జైన దేవాలయాన్ని పోలి ఉంది. ఈ దేవాలయానికి దగ్గరగా ఒకప్పుడు దేవాలయ గోపురం, ప్రవేశ మందిరాలు ఉండేవి. గర్భగుడి ప్రవేశ ద్వారం వద్ద కాపలాగా నంది ఉండగా, మరికొన్ని అందమైన దేవతల విగ్రహాలు ఉన్నాయి. నందికి చెక్కిన ఆభరణాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. దేవాలయ గోడలు, స్తంభాలు, పైకప్పులపై బొమ్మలు, దేవతామూర్తులు (హిరణ్యకశిపుడనే రాక్షసుడిని ప్రహ్లాదుని పాదాల వద్ద ఉంచి సంహరించిన నరసింహుడు వంటివి) ఉన్నాయి.

మూలాలు మార్చు

  1. "తెలంగాణలోని నిగూఢ‌ ర‌త్నాలు.. ఈ 8 ద‌ర్శ‌నీయ ప్రాంతాలు..!". Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-01-16. Archived from the original on 2022-01-28. Retrieved 2022-01-31.
  2. "శతాధిక ఆలయాల ఖిల్లా.. బినోల". EENADU. Archived from the original on 2022-01-31. Retrieved 2022-01-31.
  3. Satyavada, Neeharika (2019-04-20). "Lost in time". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2022-02-01. Retrieved 2022-02-01.