గౌతవరం

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం

గౌతవరం, ప్రకాశం జిల్లా రాచర్ల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామం
పటం
Coordinates: 15°29′08″N 78°58′55″E / 15.48543°N 78.98195°E / 15.48543; 78.98195
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంరాచర్ల మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( 08405 Edit this on Wikidata )
పిన్‌కోడ్523368 Edit this on Wikidata


తప్పెటవారి చెరువు:- ఈ చెరువు వద్దకు ఏటా జనవరి ఆఖరులో, సైబీరియా కొంగలు వచ్చును. రాచర్ల మండలం గౌతవరంలో చింతచెట్లపై అవి కొన్ని రోజులపాటు జీవనం సాగిస్తవి. పగలు నీరు, ఆహారం కోసం ఈ చెరువు వైపు వస్తవి.

గ్రామం పేరువెనుక చరిత్ర మార్చు

గౌతమ మహర్షి పేరుమీద వెలసిన గ్రామం గౌతవరం.

విద్యా సౌకర్యాలు మార్చు

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల:- ఈ గ్రామ పాఠశాల 100 సంవత్సరాలు పూర్తిచేసుకున్నది.

మౌలిక సదుపాయాలు మార్చు

త్రాగునీటి సౌకర్యం:- ఈ గ్రామంలో ఎం/ఎస్ ఎస్.సి.ఎల్-బి.ఎస్.సి.పి.ఎల్ (జె.వి) సంస్థ రెండు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన శుద్ధజల కేంద్రాన్ని, 2015, ఆగస్టు-15వ తేదీ శనివారంనాడు ప్రారంభించారు.

సాగునీటి సౌకర్యం మార్చు

ఈ గ్రామములో భూగర్భజలాలు వృద్ధి చెందుటకై, 14 సంవత్సరాల క్రితం, 2.3 లక్షల రూపాయలతో, గ్రామానికి తూర్పువైపున, ఒక చెక్ డ్యాం నిర్మించారు. ఈ చెక్ డ్యాం, నిర్మించిన ఒక సంవత్సరానికే వరద ఉధృతికి కొట్టుకు పోయింది. అప్పటి నుండి వరద నీరు వృధాగా పోవుచున్నది. ఇంతవరకు మరమ్మత్తులు చేయించలేదు.

గ్రామ పంచాయతీ మార్చు

  • గౌతవరం గ్రామ పంచాయతీ 1955 లో ఏర్పాటయినది.
  • మూడు పంచాయతీ ఎన్నికల ముందు వరకూ, ప్రస్తుత అనుములపల్లి పంచాయతీలో కలిసి ఉండేది. 1997లో ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటయినది. మొదటి సర్పంచిగా బొజ్జా రంగమ్మ, ద్వితీయ సర్పంచిగా మార్తోట మద్దిలేటి పనిచేశారు. తృతీయ సర్పంచిగా ఎన్నికైన నూర్నేని చినకోటయ్య పదవీకాలం, గత ఏడాదే ముగిసినది.
  • 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి. కంచర్ల ఆదిలక్ష్మమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు.
  • 2021 Feb లో జరిగిన పంచాయతీ ఎలక్షన్స్ లో మార్తోట లక్ష్మీదేవి ప్రస్తుత సర్పంచిగా ఎన్నికయ్యారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

  • శ్రీ రామాలయం
  • చెలిమికొండ సమీప రామానంద ఆశ్రమం
  • అభయా ఆంజనేయ స్వామి దేవాలయం
  • వినయకుడు దేవాలయం
  • పోలేరమ్మ గుడి

పక్షుల కేంద్రం మార్చు

  1. ఈ గ్రామానికి సైబీరియా నుండి విదేశీ పక్షులు సంతానాభివృద్ధికోసం, ప్రతి సంవత్సరం డిసెంబరు, జనవరి నెలలలో వలస వస్తుంటవి. ఈ పక్షులు గ్రామములోని చింతచెట్లను ఆవాసాలుగా మార్చుకొని, గూళ్ళు ఏర్పాటుచేసికొని, గుడ్లు పెట్టి, పొదిగి, పిల్లల్ని చేస్తవి. ఈ క్రమంలో ఈ పక్షుల కిలకిలారావాలు గ్రామస్థులకు ఎంతో ఆనందాన్ని కలుగజేస్తవి. జంటలుగా సంచరించడం, పిల్లలకు ఆహారాన్ని తినిపంచడం, నీరు త్రాగించడం, వాటికి ఎగరడం నేర్పించడం లాంటి కనువిందైన దృశ్యాలు గ్రామస్థులకు మానసికోల్లాసాన్ని కలుగజేయుచుంటవి. ఆహారాన్వేషణలో, పదుల కిలోమీటరల దూరం ప్రయాణించి మరీ పిల్లలకు చేపలను తీసుకొనివచ్చి తినిపిస్తవి. ఆరు నెలలపాటు పెద్ద పక్షులు చిన్న పక్షిపిల్లలకు అన్ని రకాల విద్యలూ నేర్పిస్తాయి. ప్రస్తుతం జూన్ నెల ముగుస్తున్న తరుణంలో, ఎగరడం నేర్చుకున్న తమ పిల్లలతో కలిసి, స్వదేశానికి పయనమగుతవి. [8]

ప్రధాన పంటలు మార్చు

వరి, అపరాలు, కూరగాయలు, శనగల్, పత్తి, మిరప,

ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం ,ఆర్మీ , పోలీస్, ఊపాద్యాయుడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్.

మూలాలు మార్చు

వెలుపలి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=గౌతవరం&oldid=3720936" నుండి వెలికితీశారు