అంధత్వం

(గ్రుడ్డి నుండి దారిమార్పు చెందింది)

కంటి చూపు (ఆంగ్లం Vision) పోవడాన్ని గుడ్డితనం లేదా అంధత్వం (Blindness) అంటారు. ఇది నేత్ర సంబంధమైన లేదా నరాల సంబంధమైన కారణాల వలన కలుగవచ్చును. ప్రతి సంవత్సరము సెప్టెంబరు 14 న ప్రపంచ అంధుల దినోత్సవంగా జరుపుకొంటారు.

అంధత్వం
వర్గీకరణ & బయటి వనరులు
పొడవైన తెల్లని కర్ర అంధత్వానికి అంతర్జాతీయ సంకేతం
m:en:ICD-10 {{{m:en:ICD10}}}
m:en:ICD-9 {{{m:en:ICD9}}}
DiseasesDB 28256


దృష్టి మాంద్యాన్ని కొలిచే వివిధ కొలమానాలు, అంధత్వ నిర్వచనాలు అభివృద్ధి చేయబడ్డాయి."[1] పూర్తి అంధత్వం (Total blindness) అనగా దృష్టి పుర్తిగా లోపించడం. దీనిని వైద్య పరిభాషలో "NLP" (No Light Perceptionan) అంటారు. వీరు కాంతి ఉన్నదీ లేనిదీ, ఆ కాంతి ఏ దిక్కు నుండి వస్తున్నదీ మాత్రమే గుర్తించగలరు. సాధారణమైన అంధత్వం (Blindness) అనగా దృష్టి లోపం తీవ్రంగా ఉన్నప్పుడు, ఇంకా కొంత చూపు మిగిలి వున్నప్పుడు ఉపయోగిస్తారు.

అంధులలో ఎవరికి ప్రత్యేకమైన సహాయం అవసరం అనే విషయం మీద వివిధ ప్రభుత్వ చట్టాలు క్లిష్టమైన నిర్వచనాలు తయారుచేశాయి. వీటిని చట్టపరమైన అంధత్వం (Legal blindness) అంటారు.[2] ఉత్తర అమెరికా, ఐరోపా దేశాలలో ఈ అంధత్వాన్ని సవరించిన దృష్టి తీవ్రత (visual acuity) (vision) 20/200 (6/60) లేదా అంతకంటే తక్కువగా ఉంటే చట్టపరంగా అంధునిగా భావిస్తారు. ఇంచుమించుగా 10 శాతం చట్టపరంగా అంధులుగా నిర్ణయించినవారికి ఏ మాత్రం దృష్టి ఉండదు. మిగిలిన వారికి కొంత చూపు మిగిలివుంటుంది. కొనిసార్లు 20/70 to 20/200 చూపును కూడా దృష్టి లోపం అంటారు.[3]

ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) International Statistical Classification of Diseases, Injuries and Causes of Death ప్రకారం దృష్టి మాంద్యం (Low vision) అనగా సవరించిన దృష్టి తీవ్రత 6/18 కంటే తక్కువగా ఉండడం, కానీ 3/60 కంటే మెరుగ్గా ఉండడం. అంధత్వం (Blindness) అనగా దృష్టి తీవ్రత 3/60 కంటే తక్కువగా ఉండడం.[4][5]

కొన్ని రంగుల మధ్య భేదాన్ని గుర్తించలేకపోవడాన్ని వర్ణ అంధత్వం లేదా వర్ణాంధత (Colour Blindness) అంటారు. రాత్రి సమయంలో విటమిన్ ఎ. లోపం మూలంగా కలిగే దృష్టి మాంద్యాన్ని రేచీకటి (Night Blindness) అంటారు.

అంధత్వ గణాంకాలు

మార్చు

1987 సంవత్సరంలో అమెరికాలో సుమారు 598,000 మంది అంధులున్నట్లుగా చట్టపరంగా గుర్తించారు.[6] వీరిలో సుమారు 58% మంది 65 సంవత్సరాల కంటే పైబడినవారు.[6] 1994-1995 మధ్యలో 1.3 మిలియన్ అమెరికన్లు చట్టారమైన అంధులిగా గుర్తించబడ్డారు.[7]

ప్రపంచ ఆరోగ్య సంస్థ Magnitude and causes of visual impairment యొక్క అంచనాల ప్రకారం 2002 సంవత్సరంలో ప్రపంచంలో సుమారు 161 మిలియన్ (సుమారు 2.6% జనాభా) మంది దృష్టి లోపాలతో బాధపడుతున్నారని వీరిలో 124 మిలియన్ (సుమారు 2%) మందిలో దృష్టి మాంద్యం ఉన్నట్లు, 37 మిలియన్ (సుమారు 0.6%) మంది అంధులుగా ప్రకటించింది.[8]

భారతదేశంలో అంధత్వ గణాంకాలు

మార్చు
  • మన దేశంలో 2011 నాటికి దాదాపు 15 మిలియన్ల అంధులు ఉన్నారు.
  • ఇందులో 5 శాతము మాత్రమే విద్యాభ్యాసము చేస్తున్నారు.
  • కళ్ళలో పొరల కారణంగా ఏటా 3 మిలియన్ల మంది కంటి చూపు కోల్పోతున్నారు.
  • ప్రపంచంలో ప్రతి ముగ్గురు అంధుల్లో ఒకరు మన దేశంలో ఉన్నారు. ప్రపంచ అంధుల్లో 35 శాతము మనవారే.
  • రెటీనా మార్పు వలన మనదేశ అంధుల్లో దాదాపు 10 శాతము చూపు పొందవచ్చు.
  • దాదాపు 50 వేలమంది ప్రతి సంవత్సరము నేత్ర దానం చేస్తున్నారు కానీ వివిధ కారణాల వలన నేత్ర నిధులు 16 నుంచి 18 వేల జతలను మాత్రమే సేకరించగలుగుతున్నారు.
  • కార్నియా కారణంగా మనదేశంలో ఏటా దాదాపు 40 వేల మంది అంధత్వాన్ని పొందుతున్నారు.

అంధత్వానికి కారణాలు

మార్చు

అంధత్వం చాలా కారణాల మూలంగా కలుగుతుంది:

కంటి వ్యాధులు

మార్చు

దృష్టి మాంద్యం ఎక్కువగా వ్యాధులు, పౌష్టికాహార లోపం మూలంగా కలుగుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అంధత్వం కలగడానికి ముఖ్యమైన కారణాలు:

అభివృద్ధి చెందుతున్న దేశాలలో అంధత్వానికి ఎక్కువగా నివారించగలిగే కారణాల మూలంగా కలుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా అంధులలో వృద్ధులు ఎక్కువగా ఉన్నా కూడా పిల్లల్లో అంధత్వం పేద దేశాలలో ముఖ్యంగా కనిపిస్తుంది. అంచనావేసిన 40 మిలియన్ అంధులలో 70- 80 శాతం మందిలో సరైన వైద్యంతో దృష్టిని కొంత లేదా పూర్తిగా తిరిగి పొందవచ్చును.

పాశ్చాత్యదేశాలలో కలిగే అంధత్వం వయోసంబంధమైన మాక్యులా లేదా రెటినా లోపాల వలన కలుగుతుంది.[9] మరొక కారణం నెలలు నిండకుండా పుట్టే పిల్లలలో కలిగే రెటినోపతీ.

కల్తీ సారాయ్

మార్చు

అరుదుగా కొన్ని రకాల రసాయనిక పదార్ధాల మూలంగా అంధత్వం కలుగవచ్చును. కల్తీ సారా త్రాగడం ఒక మంచి ఉదాహరణ. మిథనాల్ (Methanol) ఇథనాల్ (Ethanol) తో పోటీపడి త్రాగుబోతు శరీరంలో ఫార్మాల్డిహైడ్ (Formaldehyde), ఫార్మిక్ ఆమ్లం (Formic acid) గా విచ్ఛిన్నం చెంది వాటివలన అంధత్వం మొదలైన ఆరోగ్య సమస్యలు, మరణం సంభవించవచ్చును.[10] ఈ మిథనాల్ ఎక్కువగా కల్తీ చేయబడిన సారాలో ఉంటుంది.

ఉపకరణాలు

మార్చు
 
మడతపెట్టిన పొడవైన కర్ర.

నడిచే సాధనాలు

మార్చు

చదువుకొనే సాధనాలు

మార్చు

అంధత్వాన్ని నయం చేసే టీకాను బ్రిటన్‌లోని యార్క్‌షైర్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.స్టెరాయిడ్‌ ఇంప్లాంట్‌ రెటీనా వద్ద వాపును నివారించే మందును విడుదల చేస్తుంది. ఫలితంగా అంధత్వం రాకను అడ్డుకుంటుంది. క్షీణించిన కంటి చూపునూ ఇది పునరుద్ధరిస్తుంది. ఈ చికిత్సకు 2వేల పౌండ్లు ఖర్చవుతుంది. కంటి వెనుక రక్తనాళాల్లో అకస్మాత్తుగా అడ్డంకులు ఏర్పడడం వల్ల క్షీణించే కంటి చూపును నయం చేయడానికి దీన్ని వాడొచ్చు. (ఈనాడు 18.4.2011)

ప్రముఖులు

మార్చు

అంధులైనా పట్టుదలతో ఏదైనా సాధించగలమని నిరూపించినవారు ఎందరో ఉన్నారు. వీరిలో కళాభిరుచి ఎక్కువగా ఉంటుంది. అంధులు మొదలైన అంగవైకల్యంతో బాధపడుతున్నా వారికి 'పారా ఒలింపిక్స్'అనే క్రీడల పోటీలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు.

  • హెలెన్ కెల్లర్, అమెరికాకు చెందిన రచయిత్రి, సామాజిక కార్యకర్త.
  • ద్వారం వెంకటస్వామి నాయుడు, సుప్రసిద్ధ వయోలిన్ విద్వాంసులు.
  • సుసర్ల దక్షిణామూర్తి, ప్రముఖ సినీ సంగీత దర్శకులు.
  • అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయనను రాష్ట్రానికి చెందిన ఓ అంధ విద్యార్థి కలిశారు. ఆ విద్యార్థిని నీ లక్ష్యమేంటని ప్రశ్నించగా దేశానికి మొట్ట మొదటి అంధ రాష్ట్రపతిని అవుతానని పేర్కొన్నాడు.అనంతరం ఆ విద్యార్థి పదవ తరగతిలో 92శాతం, ఇంటర్‌లో 95శాతం మార్కులు సాధించడంతో పాటు ఎంఐటీ బాస్టన్‌లో సీటు సంపాదించుకున్నాడని విద్యార్థులకు అబ్దుల్ కలాం వివరించారు. (ఆంధ్రజ్యోతి15.11.2009)

మూలాలు

మార్చు
 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
  1. International Council of Ophthalmology. "International Standards: Visual Standards — Aspects and Ranges of Vision Loss with Emphasis on Population Surveys." Archived 2009-09-21 at the Wayback Machine April 2002.
  2. Belote, Larry. "Low Vision Education and Training: Defining the Boundaries of Low Vision Patients." Archived 2006-11-09 at the Wayback Machine A Personal Guide to the VA Visual Impairment Services Program. Retrieved March 31, 2006.
  3. "Living with Low Vision - American Foundation for the Blind". Archived from the original on 2013-06-16. Retrieved 2009-01-27.
  4. http://www3.who.int/icd/currentversion/fr-icd.htm[permanent dead link]
  5. WHO | Magnitude and causes of visual impairment
  6. 6.0 6.1 Kirchner, C., Stephen, G. & Chandu, F. (1987). "Estimated 1987 prevalence of non-institutionalized 'severe visual impairment' by age base on 1977 estimated rates: U. S.", 1987. AER Yearbook.
  7. American Foundation for the Blind. "Statistics and Sources for Professionals." Archived 2008-08-07 at the Wayback Machine Retrieved April 1, 2006.
  8. "World Health Organization" (Web). World Health Organization. 2006.
  9. Bunce C, Wormald R. "Leading Causes of Certification for Blindness and Partial Sight in England & Wales." Archived 2006-05-08 at the Wayback Machine BMC Public Health. 2006 March 8;6(1):58 [Epub ahead of print]. PMID 16524463.
  10. "Methanol". Symptoms of Methanol Poisoning. Canada Safety Council. 2005. Archived from the original (Web) on 2007-02-20. Retrieved 2009-01-27.
"https://te.wikipedia.org/w/index.php?title=అంధత్వం&oldid=3811448" నుండి వెలికితీశారు