ఘట్టమనేని హనుమంతరావు
ఘట్టమనేని హనుమంతరావు భారతీయ సినిమా నిర్మాత. ఇతడు పద్మాలయా పిక్చర్స్ సంస్థలో భాగస్వామిగా పలు తెలుగు, హిందీ సినిమాలను నిర్మించాడు.

జీవిత విశేషాలు సవరించు
ఘట్టమనేని హనుమంతరావు ఘట్టమనేని రాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మ దంపతులకు జన్మించాడు. అతని సోదరుడు ఘట్టమనేని కృష్ణ సినీనటుడు, రాజకీయ నాయకుడు. మరొక సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు తెలుగు సినిమా నిర్మాత, రాజకీయ నాయకుడు. అతను సోదరులతో కలసి కలిసి పద్మాలయ ప్రొడక్షన్స్ నిర్మాణ వ్యవహారాలు, స్టూడియో నిర్వహణ చూసుకునేవాడు.
అతని భార్య పార్వతి. వారికి ఇద్దరు కొడుకులు - ప్రసాద్, నర్సయ్య , కుమార్తె జయప్రద. ఉన్నారు.
సినీ ప్రస్థానం సవరించు
నిర్మాతగా సవరించు
- 1994 - పోలీసు అల్లుడు
- 1994 - పచ్చ తోరణం
- 1993 - అన్నాచెల్లెలు
- 1988 - కన్వర్లాల్ (Kanwarlal-హిందీ)
- 1988 - రాజకీయ చదరంగం
- 1986 - సింహాసనం
- 1983 - మావాలీ (Mawaali-హిందీ)
- 1985 - పతాల్ భైరవి (Pataal Bhairavi-హిందీ)
- 1984 - ఖైదీ
- 1983 - హిమ్మత్వాలా (Himmatwala-హిందీ)
- 1982 - ఈనాడు
- 1982 - త్యాగి (Thyagi-హిందీ)
- 1981 - మేరీ ఆవాజ్ సునో (Meri Aawaz Suno-హిందీ)
- 1978 - పట్నవాసం
- 1977 - కురుక్షేత్రం
- 1974 - అల్లూరి సీతారామరాజు
- 1973 - దేవుడు చేసిన మనుషులు
రచయితగా సవరించు
- 1976 - రామరాజ్యంలో రక్తపాతం (స్క్రీన్ప్లే)