చందోలు

ఆంధ్రప్రదేశ్, బాపట్ల జిల్లా, పిట్టలవానిపాలెం మండలంలోని గ్రామం
(చందవోలు నుండి దారిమార్పు చెందింది)

చందోలు లేదా చందవోలు, బాపట్ల జిల్లా, పిట్టలవానిపాలెం మండలంలోని ఒక ప్రాచీన గ్రామం. ఇది మండల కేంద్రమైన పిట్టలవానిపాలెం నుండి 4 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన పొన్నూరు నుండి 8 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3159 ఇళ్లతో, 11342 జనాభాతో 1333 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5622, ఆడవారి సంఖ్య 5720. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2428 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 396. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 590448[1].ఇది తెలుగు భాషను పోషించిన వెలనాటి చోళులు పాలించిన ప్రదేశం.

చందోలు
బళ్ళమ్మ గుడి, చందోలు
బళ్ళమ్మ గుడి, చందోలు
పటం
చందోలు is located in ఆంధ్రప్రదేశ్
చందోలు
చందోలు
అక్షాంశ రేఖాంశాలు: 15°59′N 80°39′E / 15.983°N 80.650°E / 15.983; 80.650
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల
మండలంపిట్టలవానిపాలెం
విస్తీర్ణం
13.33 కి.మీ2 (5.15 చ. మై)
జనాభా
 (2011)
11,342
 • జనసాంద్రత850/కి.మీ2 (2,200/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు5,622
 • స్త్రీలు5,720
 • లింగ నిష్పత్తి1,017
 • నివాసాలు3,159
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్522311
2011 జనగణన కోడ్590448

గ్రామం పేరు వెనుక చరిత్ర

మార్చు

చారిత్రక ప్రసిద్ధి కలిగిన ఈ గ్రామాన్ని పూర్వం సనదవోలు / ధనదవోలు అని పిలిచేవారు.[2] అ తరువాత అది చందవోలు గా మారి, చందోలు అయింది. దాదాపు పది వేల జనాభాతో ముస్లిములు అధికముగా ఉన్న గ్రామం ఇది. ఇక్కడ ఐదు మసీదులు, నాలుగు దేవాలయాలు ఉన్నాయి.

చారిత్రక విశిష్టత

మార్చు

వెలనాడుగా పిలువబడ్డ కృష్ణా తీరం నుండి, విక్రమసింహపురి (నెల్లూరు) వరకు గల దేశాన్ని వెలనాటి చోళులు పాలించేవారు. వీరు చోళ ప్రభువులకు సామంతులు. వీరి రాజధాని ధనదవోలు. సా.శ 1228 నాటికి కాకతి గణపతిదేవ చక్రవర్తి వెలనాటిని పూర్తిగా జయించి, ధనదుపురం లోని సంపదను ఏకశిలా నగరానికి తరలించాడు. సా.శ 13 వ శతాబ్దంలో ఈ ధనదవోలుకు రాజైన రెండవ గొంకని పుత్రిక మైలమాదేవిని (మైలాంబ) హైహయ వంశస్తుడైన అనుగురాజు పెళ్ళి చేసుకున్నాడు. పెళ్ళికి కట్నంగా పొందిన పలనాటి సీమను, అనుగురాజు గురజాల రాజధానిగా పాలించేవాడు. అనుగురాజు వారసుల మధ్య తలెత్తిన కలహాలే పల్నాటి వీర చరిత్రగా ప్రసిద్ధమయ్యాయి. ఈ పల్నాటి యుద్ధంలో చందోలు ప్రభువులు నలగామరాజు పక్షం వహించారు.

మంచన కవి రచించిన కేయూర బాహు చరిత్రములో ధనదవోలు ప్రస్తావన ఉంది.[3] ఆ గ్రంథంలో ఈ పట్టణ వర్ణన ఇలా ఉంది.

పుష్పక నివహంబు భూమిపై నిలిచిన
యట్లందమైన దేవాలయములు
రూపొయాచలము బహురూపముల నటించు
రమణ శోభిల్లు స్సౌధముల పెల్లు
అలకాధిపతి నిధులన్నియు వెలివీట
విడిసేన క్రియ బణ్యవీధికలును
ధాత మేదిని మిన్నుదఱిగివైచినమాడ్కి
గనుపట్టు బహు తటాకముల సొంపు

నుపవనంబులు సరసులు నొప్పుచేయు
చెఱకుదోటలు బ్రాసంగుచేలు మెఱయ
నఖిల విభవంబులకు నెలవగుచు వెలయు
ధనదుపురమున కెనయన ధనదుపురము

విద్యా సౌకర్యాలు

మార్చు

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 12, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది. సమీప బాలబడి పొన్నూరులో ఉంది. సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఖాజీపాలెంలోను, ఇంజనీరింగ్ కళాశాల పొన్నూరులోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు పొన్నూరులోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఖాజీపాలెంలోను, అనియత విద్యా కేంద్రం పొన్నూరులోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం

మార్చు

చందోలులో ఉన్న రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక డిస్పెన్సరీలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

మార్చు

గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు నలుగురు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు

మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం

మార్చు

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

మార్చు

చందోలులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

మార్చు

గ్రామంలో వాణిజ్య బ్యాంకు ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. ఏటీఎమ్, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

మార్చు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో పబ్లిక్ రీడింగ్ రూం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు

మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 10 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

మార్చు

చందోలులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 311 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 108 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 912 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 129 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 892 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

మార్చు

చందోలులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 892 హెక్టార్లు

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు

రాష్ట్రంలో ప్రసిద్ధిచెందిన పురాతన శైవక్షేత్రాలలో చందోలు లింగోద్భవ క్షేత్రానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. మహమ్మదీయుల దండయాత్రలో ధ్వంసమైన ఈ క్షేత్రాన్ని పదో శతాబ్దంలో కుళోత్తుంగచోళ మహారాజు పునహ్ ప్రతిష్ఠ చేసినట్లు చరిత్ర చెబుతున్నది. ఇక్కడ ఉన్న శివలింగం, దక్షిణ భారతదేశంలో అతి పెద్ద శివలింగాలలో, రెండవదిగా ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్ర వైభవాన్ని వివరిస్తూ, పరిమి వెంకటసుబ్రహ్మణ్య శాస్త్రి "లింగోద్భవ మహాత్మ్యము అను చందవోలు వైభవము" అనే పుస్తకాన్ని రచించారు.

శ్రీ చెన్నకేశ్వవస్వామివారి ఆలయం

మార్చు
  1. ఈ ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు నిర్వహించుచున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా, 2015, మార్చ్-3వ తేదీ మంగళవారం నాడు, స్వామివారి శేషవాహనోత్సవం వైభవంగా నిర్వహించారు. అనంతరం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారంనాడు స్వామివారికి హనుమద్వాహనోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. ఎదురుకోలోత్సవం నిర్వహించారు. గురువారంనాడు స్వామివారి కల్యాణోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. అనంతరం గరుడవాహనోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు భక్తులు అధికసంఖ్యలో విచ్చేసారు.
  2. ఈ ఆలయానికి, చెరుకుపల్లి మండలంలోని రాంభొట్లవారిపాలెం గ్రామంలో మాగాణి మరియూ మెట్టభూములు, మాన్యంగా ఉన్నాయి.

శ్రీ బండ్లమ్మ తల్లి దేవస్థానం

మార్చు

బండ్లమ్మ తల్లి దేవాలయం (చందోలు)

గ్రామంలో ప్రధాన పంటలు

మార్చు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు

మార్చు
  • మంచన , కేయూరబాహు చరితము రచయిత.
  • నండూరి గుండనమంత్రి, కేయూరబాహు చరితం స్వీయకర్త.

గ్రామ విశేషాలు

మార్చు
  1. చందోలు గ్రామం వద్దగల యాజిలి ఎత్తిపోతల పథకం మరమ్మత్తు పనులలో భాగంగా, కాలువ త్రవ్వుచుండగా, ఒక రాతివిగ్రహం బయటపడినది. ఇది వింజామర కన్యక విగ్రహమని, చోళరాజులకాలంనాటిదని తెలియవచ్చింది. ఆ కాలంలో చోళరాజులు, ధనదప్రోలు పేరుతో చందోలును రాజధానిగా చేసుకొని పరిపాలించారు. ఆలయాల నిర్మాణం చేసేటప్పుడు, ముందుగా వింజామర కన్యక విగ్రహాలను, ద్వారపాలక విగ్రహాలను తయారుచేసెదరు. ఆలయనిర్మాణం పూర్తి కాగానే వాటిని తొలగించెదరు. ఈ విగ్రహాలు పూజకు పనికిరావు.
  2. రెండవ ప్రపంచ యుద్ధంలో ఇక్కడి నుండి కొందరు పాల్గొన్నారు. పాకిస్తాన్తో జరిగిన కార్గిల్ యుద్ధంలో చందోలుకు చెందిన హాజీ భాషా అనే జవాను వీర మరణం పొందాడు.
  3. ఇదే గ్రామంలో శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు అనే మహానుభావుడు జన్మిచారు. వీరి నాన్న గారు శ్రీ వెంకటప్పయ గారు రామకందామృత గ్రంథ మాల రచించారు. సంస్కృతం, జ్యొతిషంలో కూడా రాఘవ నారాయణ శాస్త్రి గారు గొప్ప ప్రతిభాశాలి. రాఘవ నారాయణ శాస్త్రి గారు బాల ఉపాసకులు. వీరు అనేక గ్రంథాలు రచించారు. వీరు 98 సంవత్సరాలు జీవించారు. వీరు వ్రాసిన మరొక ప్రసిద్ధ గ్రంథం "శ్రీ లలితా త్రిశతీ భాష్యం". ఇందులో లలితా ఉపాసనలోని అనేక రహస్యాలు వివరించబడ్డాయి.
  4. ఈ గ్రామానికి చెందిన శ్రీ మహమ్మద్ ఆలీ, జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనారు. వీరు 2014, అక్టోబరు-13 నుండి 22 వరకు కోల్ కతాలో జరిగే టి-20 పోటీలలో పాల్గొంటారు.

గణాంకాలు

మార్చు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 11338. ఇందులో పురుషుల సంఖ్య 5640, స్త్రీల సంఖ్య 5698, గ్రామంలో నివాసగృహాలు 2837 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 1333 హెక్టారులు.

మూలాలు

మార్చు
  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  2. History Of Medieval Andhra Desa By M. Krishna Kumari
  3. చిలుకూరి వీరభద్రరావు రచించిన ఆంధ్రుల చరిత్రము, రెండవ భాగము లో 235 వ పేజీ (ఈ పుస్తకాన్ని ఇక్కడి నుండి డౌనులోడు చేసుకోవచ్చు)
"https://te.wikipedia.org/w/index.php?title=చందోలు&oldid=4254207" నుండి వెలికితీశారు