చంద్రమౌళి చిదంబరరావు

అభ్యుదయ రచయితల సంఘ స్థాపకుల్లో ఒకరు

చంద్రమౌళి చిదంబరరావు అభ్యుదయ రచయితల సంఘ ప్రారంభకుల్లో ఒకరు. మార్కిస్ట్ దృక్పథంతో ఆయన రచనలు చేసాడు.[1]

జీవిత విశేషాలుసవరించు

గుంటూరు జిల్లా రేపల్లెకు సమీపంలోని యాజలి లో 1884 లో రామయ్య, నరసమ్మ దంపతులకు చంద్రమౌళి జన్మించారు. చిత్తూరు ముట్టడి, కృష్ణరాయ విజయము, రాయచూరు ముట్టడి, వాసవీ విలాసము వంటి నాటకాలను వీరు రచించారు. చారిత్రకేతి వృత్తాలను స్వీకరించి అలనాటి చరిత్రను కళ్లకు కట్టినట్లుగా చూపారు. విద్యార్థి దశలోనే అష్టావధానాలు చేసిన చిదంబరరావు న్యాయవాద వృతిలో స్థిరపడ్డారు. కుంకు డాకు, ఊహాసుందరి, దుమ్ములగొండె, ఎందుకు పారెస్తారు నాన్న మాతృధర్మం అనే కథలతోపాటు థామస్ వ్యాసాలను రచించారు. సమాజంలోని చెడును పారదోలడానికి సాహిత్యాన్ని ఒక ఆయుధంగా చేసుకున్నారు. తెలుగుతోపాటు ఆంగ్లంలో కూడా కవిత్వాన్ని రాశారు. చంద్రమౌళి రచించిన మెరుగు నాటిక బళ్లారి రాఘవ నాటకోత్సవాలలో బహుమతి పొందింది. వచన, రచనలో ఫ్రెంచి సాహిత్య పోకడలు కనిపిస్తాయి. వీరి భాషలో దేశీయ పదాలు తెలుగు నుడికారాలు, ముఖ్యంగా విజయనగర ప్రాంతానికి చెందిన మాండలికాలు కొట్టవచ్చినట్లుగా ఉంటాయి. చంద్రమౌళి కథలు హిందీ, రష్యన్, ఉర్దూ, మరాఠీ, కన్నడ, మలయాళ భాషల లోని అనువదించారు. వీరి గేయాలను రోణంకి అప్పలస్వామి ఆంగ్లంలోనికి అనువదించారు.

మూలాలుసవరించు