రోణంకి అప్పలస్వామి

రోణంకి అప్పలస్వామి (సెప్టెంబరు 15, 1909 - మార్చి, 1987) బహుముఖ ప్రజ్ఞాశాలి. కాన్వెంట్ బాటను పట్టిన నేటి తరానికి ఆయనెవరో తెలియక పోయినా, ముంజేతిలో చేతికర్ర వేలాడ దీసి, బెట్టిన దొర టోపీ పెట్టుకొని ..టెక్కలిని అంతర్జాతీయ సాహితీ ప్రపంచానికి పరిచయం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. అరసం తొలితరం ప్రముఖులు, రాష్ట్రశాఖ అధ్యక్షవర్గ సభ్యులుగా కూడా ఉన్నారు. ఇంగ్లీషు, ఫ్రెంచ్‌, స్పానిష్‌, గ్రీక్, హీబ్రూ, ఇటాలియన్‌ మొదలైన ఆరు యురోపియన్‌ భాషలలో నిష్ణాతులు. శ్రీశ్రీ, ఆరుద్ర లకు తొలి రోజుల్లో స్ఫూర్తినిచ్చినవారు. అల్లసాని పెద్దన, భట్టుమూర్తి, క్షేత్రయ్య మొదలు శ్రీశ్రీ, నారాయణబాబు, చావలి బంగారమ్మ, చాసో మొదలైనవారి కవితల్ని ఆంగ్లీకరించి దేశ, విదేశీ భాషా పత్రికల్లో ప్రచురించారు.

రోణంకి అప్పలస్వామి
రోణంకి అప్పలస్వామి పాత చిత్రం
జననంరోణంకి అప్పలస్వామి
ఇతర పేర్లురోణంకి అప్పలస్వామి
ప్రసిద్ధిసాహితీకారుడు

జీవిత విశేషాలు

మార్చు

అప్పలస్వామిగారు శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలోని ఇజ్జువరం అనే గ్రామంలో 1909 సెప్టెంబరు 15 న జన్మించారు. తండ్రి రోణంకి నారాయణ్, తల్లి రోణంకి చిట్టెమ్మ . తండ్రి పెట్టిన పాఠశాలలో ప్రాథమిక విద్య ముగించుకుని, విజయనగరం, కాశీ హిందూ విశ్వవిద్యాల యాల్లో చదువుకుని ఎం.ఏ. (ఇంగ్లీషు) పట్టభద్రులయ్యారు. విజయనగరం మహారాజు కళాశాలలో సుమారు 30ఏళ్ళు ఉద్యోగం చేసి - ఇంగ్లీషు శాఖాధిపతిగా 1969లో రిటైరయ్యారు. మరొక రెండేళ్ళు - ఆంధ్ర విశ్వవిద్యాల యంలో ఎమెరిషస్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. తరువాత టెక్కలిలో స్వగృహం నిర్మించుకుని స్థిరపడ్డారు. 1987, మార్చిలో మరణించారు. రోణంకి వారు రాయని భాస్కరులు. ఎవరో పట్టుపట్టి రాయిస్తే తప్ప ఏదీ రాయని వ్యక్తి. ఆయన అప్పుడప్పుడు రచించిన వ్యాసాలు, పీఠికలు, రేడియో ఉపన్యాసాలు కలిసి 20 వరకూ ఉంటాయి.

పత్రికల్లో వ్యాసాలు

మార్చు

అభ్యుదయ, అవగాహన, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, భారతి, ఆంధ్రప్రదేశ్‌, కళాకేళి, ప్రజారధం, సృజన మొదలగు పత్రికలలోనూ అనేక ప్రత్యేక సంచికల్లోనూ వ్యాసాలు ప్రచురించారు. సమాచారశాఖ వారికోసం కోడి రామమూర్తిపై చిన్న పుస్తకం రచించారు. కేంద్ర సాహిత్య అకాడమి కోసం మాకియ వెల్లీ ప్రిన్స్‌ను - నేరుగా ఇటాలియన్‌ భాషనుండి తెలుగు చేశారు. మానేపల్లి, చిత్రభాను, మోహనప్రసాద్‌, చాగంటి తులసి - మొ||వారి పుస్తకాలకు ముందుమాటలు రాశారు. ఆరుద్ర తన తొలి కావ్యం -'త్వమేవాహం'నూ మానేపల్లి తన తొలి కవితా సంపుటి 'వెలిగించే దీపాలు'ను గురువుగారికి అంకితం ఇచ్చారు. 1980ల్లో ఆధునిక కవితా పితామహుడు గురజాడ అనీ, శ్రీశ్రీ తానే పితామహుడిననడం తగదని - జరిగిన వాదోపవాదాలకు గట్టి సమాధానం చెప్పారు. విశాఖపట్నం ఆకాశవాణి నుండి తెలుగు, ఇంగ్లీషులలో పలు ప్రసంగాలు చేశారు. రావూరి భరద్వాజగారు - ప్రత్యేకంగా ఆయన చేత హైదరాబాద్‌ ఆకాశవాణి కేంద్రాలనుండి ప్రసంగాలు చేయించారు. శ్రీరంగం నారాయణబాబు పై, గురజాడపై, శ్రీ. శ్రీ పై రాసిన వ్యాసాలు, కవిత్వ నిజస్వరూపం వగైరా రచనలు తెలుగు విమర్సనా సాహిత్యానికి శాశ్వతాలంకారాలు. ఇతర విమర్సకులకు ఆదర్సప్రాయాలు. చిత్రభాను, మానేపల్ల, వేగుంట మోహన ప్రసాద్, రంధి సోమరాజు, చాగంటి తులసి అరుణకిరణ్ మొదలయిన వ్రారి గ్రంధాలకు రాసిన పీఠికలలో దేశ దేశాల సాహిత్యాలది దృక్షా దర్సన మిస్తుంది. నారాయణబాబు కవితలు, చాసోకధలు, గురజాడవారి గేయాలు, నండురి సుబ్బారావు గార్ల పాటలు, మన ప్రాచీన ప్రబంధాలలో సొంపయిన పద్యాలు ఎన్నిటినో బహురమ్యంగా రోణంకి వారు ఆంగ్లీకరించారు. వీరి ఆంగ్ల రచనలు "SONGS AND LYRICS, INDIAN LOVE POEMS" అనే రెండు సంపుటాలుగా వెలువడ్డాయి. కేంద్ర సాహిత్య అకాడమీ తరుపున మాకియవల్లీ రాజనీతి గ్రంధాన్ని ఆంధ్రీకరించారు.

టెక్కలి వారి స్వగృహంలో వివిధ యూరోపియన్‌ భాషలకు చెందిన అరుదైన గ్రంథాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. వాటిని విశాఖనగర పౌర గ్రంథాలయానికి తరలించాలన్న ప్రయత్నాలు ఇంకా ఫలించలేదు. ఆయన రచనలు ఎన్నడూ జాగ్రత్త చేయలేదు. పోయినన్ని పోగా మిగిలిన తెలుగు, ఇంగ్లీషు రచనల్ని పుస్తకంగా తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. వారి ఇంగ్లీషు కవితలు లోగడ - సాంగ్స్‌ అండ్‌ లిరిక్స (1935), ది నావ్‌ అండ్‌ అదర్‌ పోయమ్స్‌ (1985) పేర పుస్తక రూపంలో వచ్చాయి.

మూలాలు

మార్చు

ఇతర లింకులు

మార్చు