చంద్రలేఖ (నర్తకి)

చంద్రలేఖ ప్రభుదాస్ పటేల్ (1928 డిసెంబరు 6 - 2006 డిసెంబరు 30) భారతదేశానికి చెందిన నర్తకి, కొరియోగ్రాఫర్. ఆమె భరతనాట్యాన్ని యోగా, కలరిప్పయట్టు వంటి యుద్ధ కళలతో సమ్మిళితం చేసే ప్రదర్శనలలో నిష్ణాతురాలుగా ప్రసిద్ధిచెందింది. ఆమె దేశ మొదటి ఉప ప్రధానమంత్రి వల్లభ్‌భాయ్ పటేల్ మేనకోడలు.

చంద్రలేఖ
జననం(1928-12-06)1928 డిసెంబరు 6
వడ, పాల్ఘర్, బాంబే ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా
మరణం2006 డిసెంబరు 30(2006-12-30) (వయసు 78)
జీవిత భాగస్వామిదశరథ్ పటేల్

భారతదేశంలో సంగీతం, నృత్యం, నాటకం లకు చెందిన కేంద్ర సంగీత నాటక అకాడమీ అత్యున్నత పురస్కారం అయిన సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ 2004లో ఆమెకు లభించింది.

బాల్యం, విద్యాభ్యాసం

మార్చు

ఆమె మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలోని వాడాలో జన్మించింది. ఆమె తన బాల్యాన్ని మహారాష్ట్ర, తమ స్వస్థలమైన గుజరాత్ లలో గడిపింది.[1] హైస్కూల్ చదువు పూర్తి చేసిన తర్వాత ఆమె న్యాయశాస్త్రంలో ఉన్నత చదువులకై చేరింది. కానీ నాట్యం మీద తనకున్న ఆసక్తితో చదువును మధ్యలోనే మానేసింది.

కెరీర్

మార్చు

ఆమె ఎల్లప్ప పిళ్లై ఆధ్వర్యంలో దక్షిణ భారతదేశంలోని ఆలయ నృత్యకారులు అభ్యసించే నృత్య రూపమైన దాసి అట్టంతో కెరీర్ ప్రారంభించింది. దాసియట్టం అనేది ఒక పురాతన భారతీయ శాస్త్రీయ నృత్య రూపం. ఆమె నాట్య విద్యలో బాలసరస్వతి, రుక్మిణీ దేవి అరుండేల్‌లచే కూడా ప్రభావితమైంది. అయితే ఆమె నృత్యరూపకం ప్రముఖంగా ఆమె పూర్వీకులచే ఎక్కువగా ప్రభావితమైంది.[1][2] చంద్రలేఖ భరతనాట్యంలో శిక్షణ పొందినప్పటికీ, ఆమె ఇతర నృత్యాలైన కలరిప్పాయట్టు వంటి యుద్ధ కళలు, ప్రదర్శన కళల నుండి అంశాలను పొందుపరిచే పోస్ట్ మాడర్న్ ఫ్యూజన్ డ్యాన్స్‌ల వైపు తన దృష్టిని మార్చుకుంది.[3][4]

గుర్తింపు

మార్చు

ఇవీ చూడండి

మార్చు

బిబ్లియోగ్రఫీ

మార్చు

Rustom Barucha. Chandralekha: Woman, Dance, Resistance. Indus. New Delhi: 1995. ISBN 81-7223-168-7

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Chandralekha: Controversial Indian dancer whose ideas challenged convention". London: The Guardian. 9 February 2007. Retrieved 30 November 2009.
  2. Kothari, Sunil; Kapoor, Coomi (March 13, 2014) [May 15, 1985]. "Danseuse-feminist Chandralekha: The doyenne of thinkers in Indian dance". India Today (in ఇంగ్లీష్). Retrieved 2020-11-05.
  3. Dunning, Jennifer (7 January 2007). "Chandralekha, 79, Dancer Who Blended Indian Forms, Dies". The New York Times. Retrieved 30 November 2009.
  4. Barnes, Clive (21 November 1998). "Handsome 'Raga'-Bag of Theses". New York Post. Archived from the original on 21 జూలై 2012. Retrieved 30 November 2009.
  5. "'Kalidas Samman' for Chandralekha". The Hindu. 19 October 2003. Archived from the original on 4 February 2008.{{cite news}}: CS1 maint: unfit URL (link)
  6. "Sangeet Natak Akademi Ratna Sadasya (Fellowship)". Sangeet Natak Akademi. Archived from the original on 27 July 2011. Retrieved 1 December 2009.