అనుకోకుండా ఒక రోజు

అనుకోకుండా ఒక రోజు 2005లో విడుదలైన ఒక తెలుగు సినిమా. తక్కువ బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా వినూతన కథనంతో మంచి విజయం సాధించింది.

అనుకోకుండా ఒక రోజు
(2005 తెలుగు సినిమా)
దర్శకత్వం చంద్రశేఖర్ యేలేటి
నిర్మాణం గంగరాజు గుణ్ణం, వెంకట్ డేగా
కథ గంగరాజు గుణ్ణం
చిత్రానువాదం చంద్రశేఖర్ యేలేటి
తారాగణం ఛార్మి, శశాంక్,
జగపతిబాబు, నర్సింగ్ యాదవ్,
హర్షవర్ధన్
సంగీతం ఎమ్.ఎమ్. కీరవాణి
నేపథ్య గానం సునిధి చౌహాన్, శ్రేయా గోషల్,
ఎమ్.ఎమ్.కీరవాణి, స్మిత
ఛాయాగ్రహణం సర్వేష్ మురారి
కూర్పు మోహన్
నిర్మాణ సంస్థ జస్ట్ యెలో సినిమా
నిడివి 144 నిముషాలు
భాష తెలుగు
పెట్టుబడి 3 కోట్లు రూపాయలు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారా గణం మార్చు

జగపతి బాబు, ఛార్మి, హర్ష వర్ధన్, లక్ష్మన్, పవన్ మల్హోత్రా, నర్సింగ్ యాదవ్, పూజా భారతి. బేబీ యాని

కథా క్రమం మార్చు

సినిమా మొదటి దృశ్యంలో కొందరు వ్యక్తులు ఒక పిల్లవాడిని అనుసరిస్తూ ఒక వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్తారు. అది మాదక ద్రవ్యాలు దొంగతనంగా సరఫరా చేస్తున్న వ్యక్తి ఇల్లు అని తెలుస్తుంది. మొదటి దృశ్యంలోని వ్యక్తులు సురేష్ రెడ్ది (జగపతి బాబు) నేతృత్వంలో ఆ వ్యక్తిని తరుముతారు. తనని పట్టుకొన్న తర్వాత వాడి ఇంటిలో కొన్ని మాదక ద్రవ్యాలు కనుక్కొంటారు. తర్వాత వాడి దగ్గర నుంచి 20,000 రూపాయలు లంచం తీసుకొని వదిలేస్తాడు. సహస్ర (ఛార్మి) డిగ్రీ చదువుతున్న ఒక అమ్మాయి. హైదరాబాదులో తండ్రి, సవతి తల్లి దగ్గర ఉంటూ చదువుకొంటూ ఉంటుంది. ఖర్చుల కోసం బృంద గాయనిగా పని చేస్తూ ఉంటుంది. ఎప్పటికైన మంచి గాయనిగా ఎదగాలని కలలు కంటూ ఉంటుంది. తన తల్లి కర్నూలులో ఉంటుంది. ఒక రోజు సహస్ర తండ్రి, పిన్ని, పిల్లలు అందరూ దైవ దర్శనానికి తిరుపతికి బయల్దేరి వెళ్తారు. వాళ్ళు వెళ్ళిన రోజు సాయంత్రం సహస్ర స్నేహితురాలు శ్వేత (పూజా భారతి) వచ్చి పార్టీకి బలవంతంగా పిలుచుకొని వెళ్తుంది. అక్కడ కొందరు సంపన్న యువతీ యువకులు సహస్రను నృత్యం చేయమని ఆహ్వానిస్తారు. కానీ తను తిరస్కరించి ఒక ప్రక్కగా కూర్చుంటుంది. కొంతమంది అబ్బాయిలు ఒక సాధారణ పానీయంలో మత్తు మందులు కలిపి సహస్రకి ఇస్తారు. సహస్ర కూడా అది సాధారణ పానీయమేనని నమ్మి త్రాగివేస్తుంది. ఆ తర్వాత అందరూ విందు వినోదాలలో తేలుతూ ఉండగా సహస్ర నెమ్మదిగా మత్తులోకి జారుకుంటుంది. ప్రొద్దున్నే నిద్ర లేచిన సహస్ర సమయం 10 గంటలవడం చూసి హడావిడి గా బయలుదేరి కళాశాల కి వెళ్తుంది. కానీ అక్కడ ఎవరూ లేకపోవడం చూసి ఆశ్చర్యపోతుండగా అటెండర్ ను అడుగుతుంది. అతను, ఆ రోజు ఆదివారమనీ, అందుకే ఎవరూ రాలేదనీ చెప్తాడు. అంతే కాకుండా, సహస్ర కి హాజరు శాతం తక్కువగా ఉందనీ మరుసటి రోజు ప్రిన్సిపాల్ ని కలవాలనీ చెప్తాడు. అదే రోజు సాయంత్రం స్నేహితురాలితో బయటకు వెళ్ళిన సహస్రకు దారిలో ఒక యువకుడు (శశాంక్) తారసపడి అంతకు ముందు సహస్ర తన టాక్సీ లో ప్రయాణించిందనీ, అందుకు గాను రూ. 350/- ఇవ్వమనీ అడుగుతాడు. నివ్వెరపోయిన సహస్ర, అతను ఎవరో తనకు తెలియదని చెప్పి ఇంటికి బయలుదేరుతుంది. సహస్ర ఇంటికి వెళ్ళే సరికి నాన్న, పిన్ని వాళ్ళు తిరుపతి నుంచి వచ్చేసి ఉంటారు. సాయంత్రం తన చెల్లెలి ని, ఇంకొంత మంది పిల్లలను తీసుకొని, పొరుగింటి మాస్టారి (హర్ష వర్ధన్) తో కలిసి చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎం బీ బీ ఎస్ సినిమాకి తీసుకొని వెళ్తుంది. థియేటర్ లొపలికి వెళ్ళె సమయంలో వీళ్ళకి అతి దగ్గరగా ఒక యువకుడిని మరొక యువకుడు కత్తి తో పొడిచివేస్తాడు. చుట్టుప్రక్కల ఉన్న జనం వాడిని పట్టుకొని పోలీసులకి అప్పచెప్తారు. సహస్ర వాళ్ళు కంగారు పడి, సినిమా చూడకుండానే ఇంటికి వచ్చేస్తారు. తరువాతి రోజు పరీక్ష ఫీజు కట్టడానికి బ్యాంక్ కి వెళ్ళిన సహస్ర కి మళ్ళీ అంతకు ముందు రోజు కనిపించిన యువకుడు కనిపించి డబ్బులు తన పేరు రాజేష్ అని, ప్రైవేటుగా ఎం బీ ఎ చదువుతున్నానని, ఖాళీ సమయంలో ట్యాక్సీ నడుపుతుంటానని పరిచయం చేసుకొని, సహస్ర తన ట్యాక్సీ లో అర్ధరాత్రి దిల్ షుఖ్ నగర్ నుంచి పంజాగుట్ట వచ్చారనీ డబ్బులు ఇవ్వమనీ అడుగుతాడు. అంతే కాకుండా సహస్ర తన కారులో తిరిగిందనడానికి సాక్ష్యంగా అబ్బులు (నర్సింగ్ యాదవ్)ని పిలుచుకొని వస్తాడు. ఇతను ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఖాళీ సమయాలలొ నాటకాలలో నటిస్తూ సినిమాలలో అవకాశాల కోసం తిరుగుతూ ఉంటాడు. అబ్బులు కూడా రాజేష్ చెప్పేది నిజమేనంటాడు. కానీ సహస్ర స్నేహితురాలు అది నమ్మక అబ్బులు ని చెంప దెబ్బ కొట్టి నాటకాలాడకండనీ, ఇంకోసారి ఇలా చేస్తె పోలీసులకు చెప్తానని అంటుంది. అబ్బులు భయపడిపోయి రాజేష్ ని తనతో తీసుకెళ్ళిపోతాడు.

పాటలు మార్చు

ఎవరైనా చూసుంటారా, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి,గానం,స్మిత

ఐ వన్న సింగ్ , రచన: ఎం ఎం కీరవాణి, గంగరాజు, మారుత్, గానం. సునిది చౌహాన్, డొమినిక్ సెరిజో

హమ్మింగ్, ఇన్స్ట్రుమెంటల్ , కోరస్

షైన నా నా నా , రచన: ఎం ఎం కీరవాణి, గంగరాజు, గానం: సునిధి చౌహాన్,

నీడల్లే తరుముతూఉండి , రచన: ఎం ఎం కీరవాణి, గంగరాజు, గానం: శ్రేయా ఘోషల్

రైటొ లెఫ్టో , రచన: ఎం ఎం కీరవాణి, గంగరాజు, గానం శ్రేయా ఘోషల్.

పురస్కారాలు మార్చు

ద్వితీయ ఉత్తమ చిత్రంగా రజిత నంది అవార్డు.