అమృతం (ధారావాహిక)

తెలుగు నాటిక

అమృతం ప్రసిద్ధిచెందిన ఒక హాస్యభరితమైన తెలుగు ధారావాహిక.

అమృతం
తరంహాస్య ధారావాహిక
సృష్టి కర్తగంగరాజు గుణ్ణం
తారాగణం
Theme music composerకళ్యాణీ మాలిక్
Opening theme"ఒరే ఆంజనేయలు"
బై కళ్యాణీ మాలిక్
దేశంభారతదేశం
అసలు భాషతెలుగు
సీజన్ల03 సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య313
ప్రొడక్షన్
Executive producerఊర్మిళ గుణ్ణం
ప్రొడక్షన్ లొకేషన్హైదరాబాద్ (చిత్రీకరణ ప్రాంతం)
నడుస్తున్న సమయం20–22 నిమిషాలు (ప్రతీ ఎపిసొడ్)
ప్రొడక్షన్ కంపెనీజస్ట్ యెల్లో మీడియా
డిస్ట్రిబ్యూటర్జస్ట్ యెల్లో మీడియా
విడుదల
వాస్తవ నెట్‌వర్క్జెమినీ టీవీ
చిత్రం ఫార్మాట్480i
మొదటి షో18 నవంబర్ 2001 - 18 నవంబర్ 2007, ఆదివారం 8:30pm IST
బాహ్య లంకెలు
Website

పాత్రలు మార్చు

  • అమృతం - శివాజీ రాజా/నరేష్/హర్షవర్ధన్ - అమృతరావు ధారావాహికలో ప్రధాన పాత్ర. ఇతడు అమృత విలాస్ అనే హోటల్ నడుపుతాడు.
  • అంజి - గుండు హనుమంత రావు - ఆముదాల ఆంజనేయులు, అమృతరావు స్నేహితుడు. అమృత విలాస్ హోటల్ లో వంటవాడు, భాగస్వామి.
  • సంజు - సంజీవని - ఝాన్సీ /సుప్రజ /అనితా చౌదరి - అమృతరావు భార్య.
  • శాంత - రాగిణి, శాంత - అంజి భార్య.
  • అప్పాజీ - శివనారాయణ, అమృతరావు ఇంటి యజమాని. ప్రతిరోజు అమృత విలాస్ లో పెసరట్లు, భోజనాలు ఫ్రీగా తింటూ ప్రతీ చిన్న పొరపాట్లకు పెనాల్టీలు వేస్తుంటాడు.
  • సర్వం - వాసు ఇంటూరి - సర్వేశ్వరన్, అమృత విలాస్ హోటల్ లో సర్వర్
  • పరంధామయ్య - దేవదాస్ కనకాల - పరంధామయ్య - అమృతరావు మామగారు.
  • పద్దు - అమృతరావు మరదలు

సృష్టికర్త మార్చు

ఈ సీరియల్ కి గంగరాజు గుణ్ణం కాన్సెప్ట్, రచన, నిర్మాణం చేసారు. ఈ సీరియల్ ని ఆయన సొంత మీడియా హౌస్ జస్ట్ ఎల్లో పేరు మీద నిర్మించారు. అచ్చ తెలుగు బాషా హాస్యానికి ప్రస్తుత సామజిక, రాజకీయ అంశాలకు అనుగుణంగా ఈ సీరియల్ ను రూపొందించారు. ఎటువంటి అడల్ట్ కంటెంట్ కి తావు లేకుండా హాస్యాన్ని పండించగలిగారు కాబట్టే పిల్లల నుండి పెద్దల వరకు అందరికి నచ్చింది. అమృతం చూసే ప్రేక్షకులలో అన్ని వర్గాల వారు ఉండటంతో ప్రసార టీ.ఆర్.పి రేటింగ్స్ లో నం.1 గా నిలిచింది.[1]

దర్శకత్వం మార్చు

ఈ సీరియల్ తో 11 మంది డైరెక్టర్లుగా పరిచయం అయ్యారు. ఈ సీరియల్ తో డైరెక్టర్ గా పరిచయం అయిన చంద్రశేఖర్ యేలేటి ఆ తరువాత ఐతే, సాహసం, అనుకోకుండా ఒక రోజు, ఒక్కడున్నాడు, మనమంతా వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ సీరియల్ లో అంబుజనాభాంగా చేసిన ఎస్.ఎస్.కంచి మొదటి 30 ఎపిసోడ్స్ కు దర్శకత్వం వహించాడు. ఈ సీరియల్ లో అమృతంగా చేసిన హర్షవర్ధన్, సర్వంగా చేసిన వాసు ఇంటూరి కూడా కొన్ని ఎపిసోడ్స్ కు దర్శకత్వం వహించారు.[2]

పేరు-ప్రఖ్యాతలు మార్చు

ఈ సీరియల్ లో ఆంజనేయులుగా చేసిన గుండు హనుమంతరావు ప్రఖ్యాత సినీ, రంగస్థల నటుడు. ఈ సీరియల్ తో కెమెరామెన్ గా కెరీర్ ప్రారంభించిన కె.కె.సెంథిల్ కుమార్ ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ గా బాహుబలితో మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ సీరియల్ లో అప్పాజిగా చెసిన నారిపెద్ది శివన్నారాయణ ఈ రోజు తెలుగు సినీ పరిశ్రమలో నటుడుగా మంచి పెరు సంపాదించుకున్నాaరు. సర్వంగా చేసిన వాసు ఇంటూరి తరువాత మరికొన్ని సీరియల్లో చేసారు. కొన్ని చిత్రాల్లోనూ నటించారు. ఈ సీరియల్ లో చిన్న పాత్రలు వేసి కెరీర్ మొదలుపెట్టిన సాగర్, ఈ రోజు మొగలిరేకులు ఆర్.కే.నాయుడుగా అందరికి సుపరిచితం. ప్రముఖ కమెడియన్ శ్రీనివాస రెడ్డి ఇందులో కొన్ని ఎపిసోడ్స్ లో నటించారు.

ప్రసారం మార్చు

ఈ సీరియల్ ప్రసారాన్ని2001 నవంబరు 18 లో జెమినీ టీ.వీలో ప్రారంభించారు. ప్రతి ఆదివారం రాత్రి 8:30 ని.కు ఆరేళ్ళ పాటు ప్రసారమైంది. కానీ కొత్త కథల లేమి కారణంగా 2007 నవంబరు 18 న చివరి ఎపిసోడ్ ప్రసారంతో ఈ సీరియల్ ని ముగించారు. జెమినీ టీ.వీలో స్వచ్ఛందంగా ప్రోగ్రాం స్లాట్ వదులుకున్న మొదటి కార్యక్రమం అమృతం. భారీ జనాదరణ ఉన్న సమయంలో ఈ నిర్ణయం ప్రేక్షకులని నిరాశపరచింది. తరువాత దీనికి సీక్వెల్ గా "అమృతం ద్వితీయం" ధారావాహికని కొనసాగింపుగా మొదలుపెడదామనుకున్నారు కానీ కుదరలేదు. ఈ సీరియల్ కి చాలా వరకు కథలని గంగరాజు గుణ్ణం, వాసు ఇంటూరి అందించారు.[2]

 
అమృతం సీరియల్ లో ఒక సన్నివేశం

జీ తెలుగు ఛానల్ లో ఈ ధారావాహిక పునః ప్రసారాన్ని ప్రతిరోజూ రాత్రి 9:00 గం.లకు కొన్నాళ్ల పాటు వేశారు.[3] ఆ తరువాత మా టీవీలో వారాంతాల్లో రాత్రి 7:00 గం.లకు కొన్నాళ్ళు ప్రసారం చేసారు. తిరిగి జెమినీ టీవీలో సోమవారం - శుక్రవారం రాత్రి 10:30 కు ప్రసారం చేసారు.[4] ధారావాహిక పూర్తయ్యాక మా గోల్డ్ ఛానల్ లో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు కొన్నాళ్ళు ప్రసారం చేసారు. తరువాత ఈటీవీ ప్లస్ ఛానల్ లో సోమవారం - శుక్రవారం రాత్రి 9:30 గం.లకు ఈ ధారావాహికను ప్రసారం చేసారు. ఇలా ఛానల్ టీ.ఆర్.పీ రేటింగ్స్ కోసం దీన్ని పునః ప్రసారం చేస్తూ వచ్చారు. ఈ సీరియల్ లో ఉన్న అన్ని ఎపిసోడ్స్ ని యూట్యూబ్లో ఉచితంగా అందుబాటులో ఉంచారు.[5]

ప్రస్తుతం ఈటీవీ ప్లస్ ఛానల్ లో సోమవారం - శనివారం వరకు సాయంత్రం 6:00 గం.లకు ఈ ధారావాహికను ప్రసారం చేస్తున్నారు.[6]

పాట మార్చు

అయ్యోలు హమ్మోలు ఇంతేనా బ్రతుకు హుహుహు

ఆహాలు ఓహోలు ఉంటాయి వెతుకు హహహ

మన చేతుల్లోనే లేదా రిమోట్ కంట్రోలు

ఇట్టే మార్చేద్దాము ఏడుపుగొట్టు ప్రోగ్రామ్లు

ఒరే ఆంజనేలు తెగ ఆయాస పడిపోకు చాలు

మనం ఈదుతున్నాం ఒక చంచాడు భవసాగరాలు

కరెంట్, రెంటు ఎక్సట్రా మన కష్టాలూ

కర్రీలో కారం ఎక్కువ ఐతే కన్నీళ్లు

అమృతం ధారావాహికల జాబితా మార్చు

Episode Title వీడియో లింక్
313 టాటా బై బై వీడుకోలు "Tata Bye Bye Veedukolu"
312 అన్-హ్యాపీ డేస్ 2వ భాగం "UN - Happy Days" Part 2
311 అన్-హ్యాపీ డేస్ "UN - Happy Days "
310 ప్రచారం మిథ్య "Pracharam Mithya"
309 దాగుడు మూతలు "Dagudu Moothalu"
308 బామ్మ కలాపం 2వ భాగం "Bamma Kalapam" Part 2
307 బామ్మ కలాపం "Bamma Kalapam"
306 దొంగ యమ 3వ భాగం "Donga Yama" Part 3
305 దొంగ యమ 2వ భాగం "Donga Yama" Part 2
304 దొంగ యమ "Donga Yama"
303 24 గంటల న్యూస్ "24 Gantala News"
302 బరువైన బలహీనత "Baruvina Balahinatha"
301 పెసర పవర్ "Pesara Power"
300 పన్ను భారం "Pannu Bharam"
299 ఈనాటి ఈబంధం ఏనాటిదో "Eenaati EeBandham Enatido"
298 అపహరణ "Appaharana"
297 కిచెన్ టు కమతం టు నరకం "Kitchen To Kamatham To Narakam"
296 దొంగల్లో దొంగ "Dongallo Donga"
295 బ్రతుకే ఒక సీరియల్ 3వ భాగం "Brathuke Oka Serial" Part 3
294 బ్రతుకే ఒక సీరియల్ 2వ భాగం "Brathuke Oka Serial" Part 2
293 బ్రతుకే ఒక సీరియల్ "Brathuke Oka Serial"
292 షూటింగ్ చేస్తాం "Shooting Cheystam"
291 ఆపరేషన్ విల్లాస్ "Operation Villas"
290 అందరూ సర్వర్లే "Andaru Sarvarle "
289 సర్వం సుందరం "Sarvam Sundaram"
288 భూత విలాస్ 3వ భాగం "Bootha Vilas" Part 3
287 భూత విలాస్ 2వ భాగం "Bootha Vilas" Part 2
286 భూత విలాస్ "Bootha Vilas"
285 ఇంటర్నేషనల్ సర్వం "International Sarvam"
284 పెసర్లు వార్డు "Pesarlu-Wardu"
283 అశోక వనం "Ashoka Vanam"
282 బెల్ట్ భాగవతం "Belt Bhagavatham"
281 చక్రవడ్డీ "Chakravaddi"
280 ఏప్రిల్ ఫూల్ "April Fool"
279 ఎన్నికల పరీక్ష 3వ భాగం "Ennikala Pariksha" Part 3
278 ఎన్నికల పరీక్ష 2వ భాగం "Ennikala Pariksha" Part 2
277 ఎన్నికల పరీక్ష "Ennikala Pariksha"
276 సంతకం చేస్తే పల్లు వ్రాలు "Santhakam Cheyste pallu Vralu"
275 సులభ సులోచనాలు "Sulabha Sulochanalu"
274 దివ్వి దివ్వి టివి టామ్ "Divvi Divvi TV Tom"
273 ఉచిత విహారం 2వ భాగం "Uchita Viharam" Part 2
272 ఉచిత విహారం "Uchita Viharam"
271 భీమ దీక్ష "Beema Deeksha"
270 వజ్రోత్సవం "Vajrostavam"
269 సరుకుల సందడి సద్దుమణిగింది "Sarukula Sandadi Saddumanigindi"
268 పిచ్చికి ఆఖరి అంతస్తు "Pichiki Akhari Anthasthu"
267 సంవత్సరం మారింది "Savathsaram Marindhi"
265 క్లీన్ బోల్డ్ "Clean Bold"
264 చెవిటి దొంగ "Cheviti Donga"
263 సారీ ఎక్స్ఛేంజ్ "Saree Exchange"
262 నోము పండింది "Nomu Pandendi"
261 గాన కోకిల "Gana Kokila"
260 5 = 50 = 0 "5 = 50 = 0"
259 హిందీ వైటర్ "Hindi Waiter"
258 లాడెన్ మాసం 2వ భాగం "Laden Masam" Part 2
257 లాడెన్ మాసం "Laden Masam"
256 రిమోట్ సంపాదన "Remote Sampadana"
255 గాలి ప్రయాణం 2వ భాగం "Gaali Prayanam" Part 2
254 గాలి ప్రయాణం "Gaali Prayanam"
253 ఒక పిజ్జా కథ 3వ భాగం "Oka Pizza Katha" Part 3
252 ఒక పిజ్జా కథ 2వ భాగం "Oka Pizza Katha" Part 2
251 ఒక పిజ్జా కథ "Oka Pizza Katha"
250 చవితి చలి మంటలు "Chavithi Chali Mantalu"
249 రేడియో బజ్జీ వెర్సస్ బ్రేకింగ్ న్యూస్ - రెండవ భగం "Radio Bajji Vs Breking News"
248 రేడియో బజ్జీ వెర్సస్ బ్రేకింగ్ న్యూస్ "Radio Bajji Vs Breking News"
247 దోమకాటు కోడికి చేటు "Domakatu - Kodiki Chetu"
246 బట్లర్ బ్రహ్మచారి 2వ భాగం "Butler Brammachaari" Part 2
245 బట్లర్ బ్రహ్మచారి "Butler Brammachaari"
244 ఓనర్ వెర్సస్ మేజర్ "Owner vs Major"
243 ఇచ్చట మూత్రం పోయరాదు "Icchata Mootram poyaradu"
242 లక్కీ స్టోన్ "Lucky Stone"
241 నాన్న - 3వ భాగం "Nanna" Part 3
240 నాన్న - 2వ భాగం "Nanna" Part 2
239 నాన్న "Nanna"
238 రా బంధువులూ - 3వ భాగం "Raa Banduvulu" Part 3
237 రా బంధువులూ - 2వ భాగం "Raa Banduvulu" Part 2
236 రా బంధువులూ "Raa Banduvulu"
235 బంగారం దుకాణం 3వ భాగం "Bangaram Dukanam" Part 3
234 బంగారం దుకాణం 2వ భాగం "Bangaram Dukanam" Part 2
233 బంగారం దుకాణం "Bangaram Dukanam"
232 ఐస్ ఇడ్లీ సీస్ దోశ "Ice Idly Sease Dosha"
231 తెలుగు నొప్పి "Telugu Noppi"
230 తెలుగు లెస్స "Telugu Lessa"
229 తెలుగు రాని నవమి "Telugu Raani Navami"
228 తేట తేట తెలుగులా "Teta Teta Telugu la"
227 శునక ప్రేమ సెప్టిక్ చేసింది "Shunaka Prema Septic Chesindi"
226 షో టైమ్ అయ్యిపోయింది "Show Time Ayyipoindi"
225 దాచే కొద్దీ దొంగల పాలు "Daache koddee Dongala Palu"
224 వి.ఐ.పి. కోడి "VIP Kodi"
223 నిద్రాహార దీక్ష "Nidraahara Diksha"
222 కదలన్ ది ప్రేమికుడు 2వ భాగం "KadalanThe Premikudu" Part 2
221 కదలన్ ది ప్రేమికుడు "KadalanThe Premikudu"
220 జీవితం x జాతకం = జైలు జీవితం "Jeetham x Jathakam = Jailu Jeevitham"
219 జెండా కింద కపిరాజు "Jenda Kinda Kapirajul"
218 రాంగ్ కాల్ "Wrong Call"
217 పతి-పడతి "Pathi-Padathi"
216 హ్యాపీ మూకీ ఇయర్ 2వ భాగం "Happy Mooki Year" Part 2
215 హ్యాపీ మూకీ ఇయర్ "Happy Mooki Year"
214 క్రిస్మస్ కానుక "Christmas Kanuka"
213 గజిని 3వ భాగం "Ghajini" Part 3
212 గజిని 2వ భాగం "Ghajini" Part 2
211 గజిని "Ghajini"
210 ఓనర్ పవర్ పారా హుషార్ "Owner Power Paara Hushar"
209 ఇల్లు ఇల్లు ఎక్కడున్నావ్ "Illu Illu Ekkadunnav"
208 పెళ్ళి పిలుపు మలుపు "Pelli Pilupu Malupu"
207 సహకార ఓటు దీపావళికి అవుటు "Sahakara votu Dipawali ki Avutu"
206 పందెం కోడి బంధం వీడి పోయింది "Pandem Kodi Bandam Veedi Poyindhi"
205 ఓనర్+టెనెంట్ = టాయిలెట్ "Owner Tenent=Tolet"
204 ఫోన్ కొట్టు - సోది పెట్టు 2వ భాగం "Phone Kottu - Sodi Pettu " Part 2
203 ఫోన్ కొట్టు - సోది పెట్టు "Phone Kottu - Sodi Pettu"
202 మునిసిపల్ మామ పోలీస్ కి అల్లుడయ్యాడు "Muncipal Mama Police ki Alludayyadu"
201 అనుకోకుండా ఓ 1 వ తేదీ " Anukokunda Oh 1 Va Thedi"
200 గుండ్రాయి "Gunndrayi"
199 సమ్మెట పోటు "Sammeta Potu"
198 వ్రతం రాతమార్చునా ? "Vratham ...Rathamarchuna ?"
197 రోగం ప్లస్ రోగం "Rogam Plus Rogam"
196 సుపరిచితుడు - 2వ భాగం " Suparichitudu" Part 2
195 సుపరిచితుడు " Suparichitudu"
194 ఆషాఢంలో షేడ్ మారింది "Ashadam lo Shade Marindi"
193 ఛాయా చిత్రం 2వ భాగం "Chaya Chithram" Part 2
192 ఛాయా చిత్రం "Chaya Chithram"
191 టీ జెడ్ 2వ భాగం "A Tea Z" Part 2
190 టీ జెడ్ "A Tea Z"
189 ఫైన్ ఆర్ట్ "Fine Art"
188 అనుకోకుండా ఒక ఫంక్షన్ "Anukokunda Oka Function"
187 ఆడమని నన్నడగవలెనా "Aadamani Nannadagavalena"
186 అజ్ఞాత వాసం 2వ భాగం "Agnatha Vasam" Part 2
185 అజ్ఞాత వాసం "Agnatha Vasam"
184 చిరు జీవితం ప్రేమ గీతం "Chiru Jeetham Prema Geetham"
183 పిల్లలు ఎత్తుకెళ్ళేవారు చల్లని వారు 3వ భాగం "Pillalu Etthukellevaru Challani vaaru" Part 3
182 పిల్లలు ఎత్తుకెళ్ళేవారు చల్లని వారు 2వ భాగం "Pillalu Etthukellevaru Challani vaaru" Part 2
181 పిల్లలు ఎత్తుకెళ్ళేవారు చల్లని వారు "Pillalu Etthukellevaru Challani vaaru" Part 1
180 స్నేహమేరా నా ప్రాణం "Snehame ra Na Pranam"
179 అల్లుడికి వాలుజెడ "Alludiki Valujada"
178 పెళ్ళాల పండగ "Pellala Pandaga"
177 ఓ స్త్రీ రేపు రా "O Sthree Repu Raa"
176 ప్రేమ పావురం 3వ భాగం " Prema Pavuram" Part 3
175 ప్రేమ పావురం 2వ భాగం " Prema Pavuram" Part 2
174 ప్రేమ పావురం " Prema Pavuram"
173 2 వరాలు - 4 రాళ్ళు " 2 Varalu - 4 Raallu"
172 ఒంటె, కోతి - ఓ ఇంటి ఓనర్ 2వ భాగం "Onte, Kothi - O Inti Owner" Part 2
171 ఒంటె, కోతి - ఓ ఇంటి ఓనర్ "Onte, Kothi - O Inti Owner"
170 మౌన సంగ్రామం 2వ భాగం "Mouna Sangramam" Part 2
169 మౌన సంగ్రామం "Mouna Sangramam"
168 గొర్రే గోడ్డలైతే "Gore Goddalithey"
167 అనుచిత పవర్ "Anuchitha Power"
166 ఎవరిది వారికే "Evaridi Varike"
165 కృష్ణార్జున విజయం "Krishnarjuna Vijayam"
164 నిశ్శబ్ద శుభాకాంక్షలు "Nishabda Shubhakankshalu"
163 కేక్ - మాస్ "CAKE - MASS"
162 ఎ ప్రదేశ్ "A Pradesh"
161 సోకొకడిది షాకొకడిది 2వ భాగం "Showkokadidi -Shakokadidi" Part 2
160 సోకొకడిది షాకొకడిది "Showkokadidi -Shakokadidi"
159 పురస్కారం "Puraskaram"
158 హెల్మెట్ కి బొప్పి కట్టింది "Helmet ki Boppi Kattindi"
157 బాలల దినోత్సవం "Balala Dinotsavam"
156 ఎరక్క పోయి వచ్చాను "Erakka Poyi Vachanu"
155 ఆట్ల తద్ది "Aatla Thaddi"
154 అపజయ దశమి "Apajayadasami"
153 క్షౌర సాగర మదనం "Kshoura Sagara Madanam"
152 సైయ్యా...? "Syeya....?"
151 దొంగలున్నారు జాగ్రత్త "Dongalunaru Jagratha"
150 మామా భల్లూకమా " Mama Bhalookama"
149 మనీ ప్రెషర్ మినీ గనేష్ " Money Pressure Mini Ganesh"
148 ప్రచారం హత్య "Pracharam Hathya"
147 పుష్కర్ ఘాటు "Pushkar Ghatu"
146 మహా వీర రక్త బంధం "Maha Veera Raktha Bandham"
145 వీర రక్త బంధం "Veera Raktha Bandham"
144 రక్త బంధం "Raktha Bandham"
143 బొమ్మ బాగుంది "Bomma Bagundi"
142 ముందడుగు వెనకడుగు "Mundadugu Venakadugu"
141 వెజ్జీ ట్రబుల్స్ 2వ భాగం "Veggie Troubles" Part 2
140 వెజ్జీ ట్రబుల్స్ "Veggie Troubles"
139 మైకం కమ్మింది "Maikam Kammindi"
138 బరువైన పందెం "Baruvaina Pandem"
137 పుష్పం - పత్రం "Pushpam-Pathram"
136 దొంగ.కేమ్ "Donga.CAM"
135 పాన్ పరాకాష్ఠ 2వ భాగం "Pan Parakasta" Part 2
134 పాన్ పరాకాష్ఠ "Pan Parakasta"
133 పాఠశాల వయా చెరశాల "Patashala via Cherasala"
132 యాచక రాచకం "Yaachaka Raachakam"
131 పెళ్ళికళ వచ్చింది "Pellikala Vachindi"
130 జలాగ్ని "Jalagni"
129 సర్వర్స్ సుందరం 2వ భాగం " Servers Sundaram" Part 2
128 సెర్వర్స్ సుందరం " Servers Sundaram"
127 క్షణ క్షణం "Kshana Kshanam"
126 శెలవులే పరీక్ష "Shelavule Pareeksha"
125 శ్రీ రామ పంచమి "Sri Rama Panchami"
124 సమర్ సంగ్ కప్ "Samar Sung Cup"
123 టోటల్ 2వ భాగం "Total" Part 2
122 టోటల్ "Total"
121 వసంత కాకిలా "Vasantha Kakilaa"
120 కోడి దాటి సంవత్సరం "Kodi Dati Samvatsaram"
119 శివిదయం "Shividayam"
118 ప్రేమికుల దినం "Premikula Dinam"
117 ఇది కథ కాదు 2వ భాగం "Idi Katha Kadu" Part 2
116 ఇది కథ కాదు "Idi Katha Kadu"
115 రణతంత్ర దినోత్సవం "Ranathanthra Dinothsavam"
114 బ్రేక్ "Break"
113 పండగకు మామ వచ్చాడు "Pandagaku Mama Vachadu"
112 బేడ్ న్యూస్ "Bad News"
111 అప్పడుగువాడు రోగి 2వ భాగం "Appaduguvadu Rogi" Part 2
110 అప్పడుగువాడు రోగి "Appaduguvadu Rogi"
109 మళ్ళీ పెళ్ళి రోజు "Malli Pelli Roju"
108 కేట్ పులి ""CAT"Puli"
107 అతిథి వద్దో భవ 2వ భాగం "Athidi vaddo Bhava" Part 2
106 అతిథి వద్దో భవ "Athidi vaddo Bhava"
105 పెద్ద బాలల దినోత్సవం "Pedda Balala Dinotsavam"
104 టూ మెన్ వన్ బ్రెయిన్ 2వ భాగం "TWO MEN ONE BRAIN" Part 2
103 టూ మెన్ వన్ బ్రెయిన్ "TWO MEN ONE BRAIN"
102 దీపావళి ఆల్బమ్ "Deepavali Album"
101 ఏబంధులు "Ebandhulu"
100 "100" "100"
99 తోలు బొమ్మల కొలువు "Tolu Bommala Koluvu"
98 చెవుల పులి "Chevula Puli"
97 నోట్ మాట "Note Mata"
96 చోర్ డిలివరీ "Chore Delivery"
95 అంతులేని సంతకం "Anthuleni santhakam"
94 మనీ ప్రెషర్ మినీ గణేష్ " Money Pressure Mini Ganesh"
93 బరువు ప్రతిష్ఠ " Baruvu Prathishta"
92 అర్ధరాత్రి స్వతంత్రం వచ్చింది " Arda Raatri Swatantryam Vachindi"
91 బిడ్డొచ్చిన వేళ గొడ్డేస్తే " Biddochina Vela Goddesthe"
90 లాలి జొ లాలీ నో "Lali Jo Lali No"
89 నీ నూనె మోము నా కనులారా "Nee Nune Momu Na Kanulara "
88 12వ పెట్టె "12 va pette"
87 మీసం పురుష లక్షణం "Meesam Purusha Lakshanam"
86 చికెన్ 65 03 " Chicken 65 03"
85 సర్వేజనా లిఖినో భవంతు "Sarvejana Likhino Bhavanthu"
84 అమృత గంగ "Amrutha Ganga"
83 రాజ"నేల" "Rajanela"
82 చైనా తిరిగి దణ్ణం పెట్టు "China Tirege Dennam Pettu"
81 బోటును ముంచిన ఏంకర్ "Botunu Munchina Anchor"
80 ఐతే అవ్వకపోతే 2వ భాగం "Ithe Avvakapothe" Part 2
79 ఐతే అవ్వకపోతే "Ithe Avvakapothe"
78 పప్పు చేసిన అప్పు కార్డ్ "Pappu Chesina Appu Card"
77 రసం పిండిన లారీ "Rasam Pindena Lorry"
76 సెల్ టు సెల్ "Cell To Cell"
75 అకాల చక్రం "Akala Chakram"
74 చేతికి పంటి నొప్పి "Chetiki Panti Nopi"
73 ఎమ్ సెట్ "Em Cet"
72 పచ్చడైన ఉగాది "Pachadiena Ugadi"
71 అమ్మో మార్చి 23 "Amo March 23"
70 క్రికెట్ అయినమహా "Cricket Ienamaha"
69 వరల్డ్ కప్ "World Cup"
68 పంచతారం - రెండొవ భాగం "Panchatarem" Part 2
67 పంచతారం - మొదటి భాగం "Panchatarem" Part 1
66 బేలంటైన్ "Balentine "
65 ముహూర్త బలం "Muhurta Balam"
64 హోటల్ కంటే గుడి పదిలం "Hotel Kante Gudi Padilam"
63 వారెవా యేమి ఫేస్ "Vareva Emi Face"
62 పిస్వాసం "Piss Vasam"
61 జలభూమి ఏడుపోవిడత "Jalabhoomi Edupovidatha"
60 అయోమయ సభ "Ayomaya Sabha"
59 బళ్ళే టైటానిక్లైతే "Balle Titanic Lithe"
58 వీర బాస్ "Veera Boss"
57 టి.వి.లో దుకాణం "TV lo Dukanam"
56 అదృష్టం నోట్లో శని "Adrustam Notlo Shani"
55 కలిసి వుంటే కలదు సుఖం / దుఃఖం - రెండవ భాగం "Kalisi Unte Kaladu Sukam / Dukkam" Part 2
54 కలిసి వుంటే కలదు సుఖం / దుఃఖం - మొదటి భాగం "Kalisi Unte Kaladu Sukam / Dukkam" Part 1
53 అమృత అభయం "Amrutha Abhayam"
52 అమ్మా ! అనకొండమ్మా "Amma ! Anakondamma"
51 ధూపావళి "Dupavali"
50 పవర్ కప్ 3వ భాగం "Power Cup" Part 3
49 పవర్ కప్ 2వ భాగం "Power Cup" Part 2
48 పవర్ కప్ "Power Cup"
47 దిన దిన అశ్రువులు నూరెళ్ల అసువులు - రెండవ భాగం "Dhina Dhina Asruvulu Noorella Asuvulu" Part 2
46 దిన దిన అశ్రువులు నూరెళ్ల అసువులు - మొదటి భాగం "Dhina Dhina Asruvulu Noorella Asuvulu" Part 1
45 హోటలే కదా స్వర్గసీమ "Hotale Kada Swargasima"
44 చవితి చందమామ "Chavithi Chandamama"
43 అమ్మాయికి సన్నజాజి మామకు సంపంగి "Ammayiki Sannajaji Mamaku Sampanghi"
42 ఏక్షన్ 500 కట్ 50,000 "Action 500 Cut 50,000"
41 సర్వర్ సింధూరం "Sarver Sindhuram"
40 కోయ్ రాజా కోయ్ "Koy Raja Koy"
39 అమ్మో మమ్మీ "Ammo Mummy"
38 పలుకే బంగారమాయెలే "Paluke Bangara Maye Le"
37 సోకొకడిది షాకొకడిది "Shokokadidi - Shockokadidi"
36 ఆవేశం అమృతం ఆముదం "Avesham Amrutam Amudam"
35 కడుపు నొప్పి "Kadupe Noppi"
34 అమృత కలాశ్ "Amrutha Kalaash"
33 ఒక దెబ్బకు రెండు గొర్రెలు "Oka Debbaku Rendu Gorrelu"
32 ఆం సెట్ "Aam Set"
31 మతిపోయినచోట దొరుకుతుంది "Mathi Poyina Chota Doorukuthundhi"
30 సమర కట్ "Samara Cut"
29 గూఢచారి111111116 "Gudachari111111116"
28 నేటి కుక్కలే రేపటి పౌరులు "Neti Kukkaley Repati Pourulu"
27 ఆటో ఎటో "Auto Eto"
26 పేక మేడలు "Peka Medalu"
25 నిదానమే ప్రమాదము "Nidaname Pramadamu"
24 పరోపకారి పాపమన్న "Paropakari Papamanna"
23 వృద్ధ రామాయణం "Vrudda Ramayanam"
22 అసత్యాగ్రహం "Astahyagraham"
21 లీకాభిషేకం "Leakabishekam"
20 ఏప్రిల్ 1 విడుదల ఆగిపోయింది "April 1 Vidudala Aagipoyindi"
19 రంగు భంగం "Rangu Bangam"
18 ప్రకృతి వైద్య లీల "Prakruthi Vaidya Lila"
17 కుడి ఎడమైతే "Kudi Edamaithey"
16 ఉగ్ర వీణ "Ugraveena"
15 కళ్యాణ వీణ "Kalyana Veena"
14 టీవీటీవీటివ్వడం "TV TV Tivvadam"
13 కాకాస్త్రం "Kakastram"
12 ముదురు మనసులు "Muduru Manasulu"
11 ఇంటికి లైటర్ ఇంటాయనే "Intiki Lighter Intayane"
10 వాస్తు శిస్తు "Vaastu Sisthu"
9 ముగ్గు గుమ్మ "Muggu Gumma"
8 కారు గుద్దిన కాపురం "Caaru Guddina Kaapuram"
7 ప్రకృతి - వికృతి "Prakruti Vikruti"
6 వైద్యో నారాయణో హరి "Vaidyo Narayano Hari"
5 నరుడా వానరుడా "Naruda Vanaruda"
4 ఇందా గోవిందా "Inda Govinda"
3 భౌ సాగరం "Bow Sagaram"
2 హలో మై డియర్ రాంగ్ నంబర్ "Hello My Dear Wrong Number"
1 గో గృహప్రవేశం "Go Gruhapravesam"

బయటి లంకెలు మార్చు

  1. "అమృతం - జస్ట్ యెల్లొ". Archived from the original on 2011-11-09. Retrieved 2011-11-27.
  2. 2.0 2.1 గంగరాజు గుణ్ణం ఇంటర్వ్యు - idlebrain.com
  3. Amrutham now on Zee Telugu
  4. Welcome To Gemini TV
  5. అమృతం సీరియల్ - యూట్యూబ్
  6. ETV PlusShowSchedule