గుణ్ణం గంగరాజు

సినీ నిర్మాత, దర్శకుడు, రచయిత

గుణ్ణం గంగరాజు సినీ రచయిత, నిర్మాత, దర్శకులు. తెలుగు సినిమా, టీవీ రంగాల్లో వీరి పనితనానికి వీరు ప్రసిద్ధులు. వీరికి రెండు జాతీయ సినిమా అవార్డులు అందాయి. ఐతే, బొమ్మలాట సినిమాలకు గానూ ఈ గౌరవం అందింది.[1][2] వీరు అనుకోకుండా ఒక రోజు, అమ్మ చెప్పింది లాంటి విలక్షణ సినిమాలు కూడా నిర్మించారు. తెలుగిళ్ళలో హాస్యపు గిలిగింతలు పుట్టించిన అమృతం ధారావాహిక కార్యక్రమం ఈయన సృష్టే. సినీ నిర్మాణ సంస్థ జస్ట్ యెల్లోకి ఈయన యజమాని.[3]

గుణ్ణం గంగరాజు
జననం (1955-10-19) 1955 అక్టోబరు 19 (వయసు 67)
వృత్తిసినిమా దర్శకులు
సినీ రచయిత
సినిమా నిర్మాత
జీవిత భాగస్వామిఊర్మిళ
పిల్లలుసందీప్
విహంగ్

వ్యక్తిగత జీవితం సవరించు

గుణ్ణం గంగరాజు కాకినాడలో పుట్టి పెరిగారు. ఆరవ తరగతి వరకూ కాకినాడ సెంట్. జోసఫ్స్ కాన్వెంట్ లో చదువుకున్నారు. ఆ తరువాత ప్రభుత్వ స్కాలర్షిప్పు పొంది హైదరాబాదు పబ్లిక్ స్కూల్ లో చేరారు. స్కూలు విద్య అయ్యాక వైద్య విద్యలో చేరారు, కానీ పూరి అవకుండానే విరమించారు. ఒక సంవత్సర వ్యవధి తరువాత విజయవాడ లోని ఆంధ్ర లోయోల కళాశాలలో బీఏ ఇంగ్లిష్ లో చేరారు. కానీ అందరూ ఆంగ్ల విద్యార్థులూ ఆందోళనకు దిగడంతో కళాశాల నుండి తీసివేయబడ్డారు. ఆపై చదువు మానేసి నవభారత్ సిగారెట్స్ వద్ద డోర్-టు-డోర్ సేల్స్ రెప్రెజెంటేటివ్ గా పనిచేసారు. ఆపై ప్రయివేటులో బీఏ చేసారు. తరువాత ఎంఏ ఆర్ట్స్ పూర్తి చేసారు. అదే సమయంలో ఎస్బీఐ పీఓ పరీక్ష కూడా వ్రాసారు.[4]

సినీ వ్యాసంగం సవరించు

రచయిత సవరించు

దర్శకత్వం సవరించు

నిర్మాత సవరించు

కళా దర్శకత్వం సవరించు

టీవీ ధారావాహికలు సవరించు

313 ఎపిసోడ్లు

89 ఎపిసోడ్లు

  • రాధా మధు (2006–2008)

450 ఎపిసోడ్లు

  • అమ్మమ్మ.కామ్ (2006–2007)

200 ఎపిసోడ్లు

  • లయ (2008–2010)

321 ఎపిసోడ్లు

  • అడగక ఇచ్చిన మనసు (2011)

60 ఎపిసోడ్లకు ఆగిపోయింది

  • ఎదురీత (2011)

మూలాలు సవరించు

  1. "51వ జాతీయ సినిమా అవార్డులు" (PDF). ఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టెరేట్. Archived from the original (PDF) on 3 మార్చి 2016. Retrieved 15 March 2012.
  2. "53వ జాతీయ సినిమా అవార్డులు" (PDF). డైరొక్టెరేట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్స్. Archived from the original (PDF) on 15 డిసెంబరు 2017. Retrieved 19 March 2012.
  3. గుణ్ణం గంగరాజు ఇంటర్వ్యూ
  4. "గంగరాజు ఇంటర్వ్యూ". Archived from the original on 2006-11-19. Retrieved 2014-09-22.

బయటి లంకెలు సవరించు