చర్చ:అణువు
ప్రసాద్ గారూ, ఆంగ్లంలో atom అనే పదానికి అర్థం "పరమాణువు" అని తెలుగు రసాయన శాస్త్ర పుస్తకాలలో ఉంది. "అణువు" అనే పదానికి ఆంగ్ల సమానార్థం molecule అని ఉంటుంది. ఈ వ్యాసం ఆంగ్ల వ్యాసంలో గల atom యొక్క అనువాదంలా కనబడుతుంది. మన భాషలో atomic structure అనగా పరమాణు నిర్మాణం అని అర్థం. ఈ వ్యాసం ఒక సారి పరిశీలించండి.-- కె.వెంకటరమణ⇒✉ 13:12, 17 ఫిబ్రవరి 2015 (UTC)
- కె.వెంకటరమణ గారు, తప్పకుండా చూస్తానండి. JVRKPRASAD (చర్చ) 13:22, 17 ఫిబ్రవరి 2015 (UTC)
- వ్యాసకర్త వ్రాసిన వ్యాసములోని కొన్ని వాక్యములు చదివాను. వ్యాసము వ్రాస్తున్న వారికే, వారు వ్రాస్తున్న వ్యాసము అసలు అణువు గురించా లేక పరమాణువు గురించినా అన్న ధర్మసందేహము కలిగి, ప్రస్తుతానికి వారు సశేషం చేసి ఉన్నారు. వారు వ్రాస్తున్న విషయము దేని గురించో తప్పక గుర్తిస్తారని ఆశించవచ్చును. సూక్షంగా చెప్పాలంటే, రెండు లేదా అంతకంటే ఎక్కువ పరమాణువుల కలయికతో ఏర్పడే, ఎటువంటి ఆవేశం లేని అతి సూక్ష్మకణము అణువు అని చెప్పుకోవచ్చని అనుకుంటాను. కొద్దికాలము ఆగి వ్యాసములో మార్పులు చేయవచ్చును. ఈలోగా వ్యాసకర్త గమనిస్తారని ఆశిస్తున్నాను. JVRKPRASAD (చర్చ) 13:52, 17 ఫిబ్రవరి 2015 (UTC)
- కె.వెంకటరమణ గారు, తప్పకుండా చూస్తానండి. JVRKPRASAD (చర్చ) 13:22, 17 ఫిబ్రవరి 2015 (UTC)
దారిమార్పు
మార్చుచర్చ: పరమాణు సిద్ధాంతం చర్చ ప్రకారం ఈ వ్యాసాన్ని పరమాణువు అనే పేరుకు మారుస్తున్నాను. - రవిచంద్ర (చర్చ) 09:09, 15 సెప్టెంబరు 2020 (UTC)
అయోమయం
మార్చుఈ చర్చకు మూలమైన నిర్వచనాలివి: "Atom ను పాఠ్య పుస్తకాల్లో పరమాణువు అని అంటారు. Molecule ను అణువు అంటారు." తెవికీలోనూ అదే అనుసరిస్తున్నాం. మోలిక్యూలును బణువు అని వేమూరి వెంకటేశ్వరరవు గారు ప్రతిపాదించినప్పటికీ, ఆ పదానికి ఇంకా సర్వామోదం లభించలేదు. అందుచేత బణువు అనే మాటను తెవికీలో వాడడం ఆమోదనీయం కాకపోవచ్చు.
అణువు, పరమాణువు, పరమాణు సిద్ధాంతం - ఈ పేజీలు పై నిర్వచనలకు అనుగుణంగాను, విరుద్ధంగానూ ఉంటూ అయోమయం కలిగిస్తున్నాయి.
- అణువు పేజీ మాలిక్యూలు గురించి చెప్పాల్సింది పోయి, Atom గురించి చెబుతోంది. దాన్ని సవరించాలంట్ ఏఈ పేజీలో ఉన్న సమాచారం దాదాపుగా అంతా తీసెయ్యాల్సి ఉంటుంది.
- పరమాణు సిద్ధాంతం పేజీ సరైన నిర్వచనాలనే చెబుతూ వివిధ పరమాణు మోడళ్ళను వివరిస్తోంది.
- పరమాణువు పేజీ కూడా సరైన నిర్వచనాన్నే చెబుతూ పై పేజీ లోని సమాచారాన్నే ఇస్తోంది. ఈ రెంటికీ మధ్య కొంత విభిన్నత చూపించాలి. పరమాణువు పేజీలో పరమాణు సిద్ధాంతం గురించి తక్కువ ఇచ్చి, దాని లక్షణాల గురించి వివరిస్తే బాగుంటుంది.
గతంలో @K.Venkataramana, @రవిచంద్ర గార్లు ఈ పేజీలపై పనిచేసి ఉన్నారు. వారు వీలును బట్టి వీటిని పరిశీలించి తగు సవరణలు చేసి, అయోమయాన్ని తొలగించవలసినదిగా కోరుతున్నాను. __ చదువరి (చర్చ • రచనలు) 08:23, 16 నవంబరు 2021 (UTC)
- చదువరి గారూ, మీరన్నట్లు ఈ పేజీలో మాలెక్యూల్ లేదా అణువు గురించి మాత్రమే ప్రస్తావిస్తూ పూర్తిగా తిరగరాయాలి. వీలు చేసుకుని నేను మారుస్తాను - రవిచంద్ర (చర్చ) 09:04, 16 నవంబరు 2021 (UTC)
- చదువరి గారూ, ముందు పరమాణువు (Atom) గురించిన పాఠ్యాన్ని తీసేసి ప్రామాణిక అర్థం (Molecule - అణువు) ప్రకారం వ్యాసాన్ని మొత్తం తిరగరాశాను. అయితే ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఇంకా విస్తరించాలి. - రవిచంద్ర (చర్చ) 18:13, 19 నవంబరు 2021 (UTC)
- @రవిచంద్ర గారూ, ధన్యవాదాలు, చప్పట్లు సార్. __ చదువరి (చర్చ • రచనలు) 23:25, 19 నవంబరు 2021 (UTC)