చర్చ:అల్లు అర్జున్

అల్లు అర్జున్ వ్యాసం తెలుగు వికీపీడియా మొదటి పేజీలో ఈ వారపు వ్యాసం శీర్షికలో ప్రదర్శన కోసం ప్రతిపాదనలో ఉంది.
Wikipedia
Wikipedia


వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


వికీపీడియాలో ఏకవచనమే వాడాలి అని నిర్ణయించబడిందనుకుంటా! ఈ వ్యాసంలో గారు వంటి గౌరవసూచక పదాలు వాడారు. అవి అవసరం లేవనుకుంటా! δευ దేవా 09:08, 23 ఆగష్టు 2008 (UTC)

చిరంజీవి గారిపై గౌరవంతో (నాకూ ఆయనంటే గౌరవమే) పద్మభూషణ్ చిరంజీవి గారూ అని వ్రాశారు..బాగానే ఉందనుకుందాం..అదే ఒసమా బిన్ లాదెన్ వ్యాసం వ్రాస్తుమనుకుందాం. అక్కడ కూడా బిన్ లాదెన్ గారు అని వ్రాస్తారా? ఇద్దరిపై వ్యాసం వ్రాయటంలో మరి ఎందుకు విభిన్న ధోరణులు? ఈయన మంచివాడు, ఆయన చెడ్డవాడు అంటారా? మంచిచెడ్డలు నిర్ణయించడానికి మనం ఇక్కడ న్యాయనిర్ణేతలు కాము, గౌరవాగౌరవాల సంగతి చదువరులకు వదిలేస్తే బాగుంటుందేమో!! --వైజాసత్య 14:19, 23 ఆగష్టు 2008 (UTC)

మేనల్లుడు

మార్చు

చెల్లెలి లేదా అక్క కొడుకైతేనే కదా మేనల్లుడయ్యేది. అల్లు అరవింద్ చిరంజీవి చెల్లెల్ని కానీ అక్కను కానీ వివాహం చేసుకున్నాడా? --వైజాసత్య 14:11, 23 ఆగష్టు 2008 (UTC)

Return to "అల్లు అర్జున్" page.