అల్లు అర్జున్
అల్లు అర్జున్ తెలుగు సినిమా అగ్ర నటుడు. ఇతడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు, హాస్య నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య మనవడు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లకు మేనల్లుడు. తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, కేరళలో అల్లు అర్జున్ కు అభిమానులున్నారు. ఫేస్ బుక్ లో సుమారు రెండు కోట్ల మంది అభిమానులున్నారు. కేరళలో ఉన్న అల్లు అర్జున్ అభిమానులు బన్నీని మల్లు అర్జున్ అని పిలుస్తారు.
అల్లు అర్జున్ | |
![]() వైశాలి సినిమా పాటల విడుదల వేడుకలో అల్లు అర్జున్ | |
జన్మ నామం | అల్లు అర్జున్ |
జననం | ![]() | 1983 ఏప్రిల్ 8
ఇతర పేర్లు | బన్ని |
క్రియాశీలక సంవత్సరాలు | 2001 - present |
భార్య/భర్త | స్నేహ రెడ్డి |
పిల్లలు | 2 |
ప్రముఖ పాత్రలు | ఆర్య, బన్ని |
బాల్యంసవరించు
అల్లు అర్జున్ చెన్నైలో 1983 ఏప్రిల్ 8న అల్లు అరవింద్, నిర్మల దంపతులకు రెండవ కుమారునిగా జన్మించాడు. అతని పెద్దన్నయ్య వెంకటేష్ (బాబీ), తమ్ముడు అల్లు శిరీష్. చెన్నైలోని పద్మ శేషాద్రి పాఠశాలలో చదువుకున్నాడు. చిన్నప్పుడే విజేత సినిమా చిత్రీకరణ చూడ్డానికి వెళ్ళినపుడు అందులో బాలనటుడి పాత్రలో మొదటి సారిగా నటించాడు. పాఠశాలలో ఉన్నప్పుడే జిమ్నాస్టిక్స్ నేర్చుకున్నాడు. ఎనిమిదో తరగతిలో ఉండగా కొన్నాళ్ళు పియానో కూడా నేర్చుకున్నాడు.[1]
వ్యక్తిగత జీవితంసవరించు
చిన్నప్పటి నుంచే అర్జున్ డ్యాన్స్ అంటే అమితాసక్తిని కనబరిచేవాడు. ఇంట్లో ఏదైనా శుభసందర్భాల సమయంలో చిరంజీవి కుమారుడైన రామ్‌చరణ్ తేజ్, అర్జున్ ఇద్దరు ఆసక్తిగా పాల్గొనే వారు. మొదట్లో అర్జున్ నటుడు కావడానికి తల్లి కొద్దిగా సందేహించినా, తరువాత కుమారుని కోరికను కాదనలేకపోయింది. ఇతని వివాహము హైదరాబాదుకు చెందిన స్నేహారెడ్డితో జరిగింది.[2][3]. వీరికి అయాన్ అనే కుమారుడు, అర్హ అనే కుమార్తె ఉన్నారు. ‘శాకుంతలం’ సినిమాతో వెండి తెరపై చిన్నారి అల్లు అర్హ ఎంట్రీ ఇవ్వడమేకాక ఐదేళ్లకే రెండు నెలల కాలవ్యవధిలో 50 మందికిపైగా చదరంగం ఆటలో శిక్షణ ఇచ్చింది. అత్యంత పిన్నవయసులోనే ఆమెలో ఉన్న అసమాన ప్రతిభను గుర్తించిన ప్రఖ్యాత నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సంస్థ అల్లు అర్హ కు వరల్డ్ యంగెస్ట్ చెస్ ట్రైనర్‌గా అవార్డు అందించారు.[4] అల్లు అర్జున్ ని అభిమానులు స్టయిలిష్ స్టార్ అని పిలుస్తారు. అల్లు అర్జున్ ఎంటర్‌టైన్ కేటగిరిలో ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ చేతులమీదుగా అల్లు అర్జున్ ఈ అవార్డును అందుకున్నాడు.[5]
నట జీవితంసవరించు
అల్లు అర్జున్ మొదటి చిత్రం కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి. చిరంజీవి డాడీ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించి ఆకర్షించాడు. హాస్యనటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య మనవడిగా తెలుగు సినిమా పరిశ్రమలో ఓ పెద్ద నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కుమారుడిగా మెగాస్టార్ చిరంజీవి అల్లుడుగా అల్లు అర్జున్ సినిమా పరిశ్రమ లోకి రావడం తేలికగానే జరిగింది కానీ దానిని సద్వినియోగం చేసుకొని తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నాడు. గంగోత్రి తరువాత ఓ వైవిధ్యమైన పాత్రలో ఆర్యగా యువత మనసులో స్థానం సంపాదించాడు. ఆర్యతో తెలుగులోనే కాకుండా మలయాళ కన్నడ అభిమానుల ప్రశంసలు పొందాడు. ఇప్పటికి మలయాళంలో అల్లు అర్జున్ సినిమాలన్నీ డబ్ అయ్యి విడుదల అవుతుండటం విశేషం. ఆ తర్వాత రిలీజ్ అయిన బన్నీ విజయంతో హ్యాట్రిక్ పూర్తి చేసి కమర్షియల్ హీరోగా స్థిరపడ్డాడు. అక్కడ నుంచి చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత చూపిస్తూ నటనలో ఇమేజ్తో డ్యాన్స్ లో స్టైల్ తో ప్రేక్షకుల అభిమానం కొల్లగొట్టాడు. పరుగులో కృష్ణగా చక్కని నటనతో ఆకట్టుకొని వేదంతో నవతరం నాయకులలో మల్టీస్టారర్ చిత్రాల సంస్కృతికి తెరతీసి ప్రయోగాలను ప్రారంభించాడు/ అంతేకాకుండా ఎవరో బాలీవుడ్ జనాలు చేసిన కామెంట్ ను సీరియస్ గా తీసుకొని ప్యాక్ బాడీ కల్చర్ ను తెలుగు సినిమాకు పరిచయం చేసిన ఘనత అల్లు అర్జున్ ది. ఆర్య, పరుగు సినిమాలకు నంది అవార్డు అందుకున్నాడు.
ఇతర భాషల్లో అర్జున్సవరించు
అల్లు అర్జున్ చిత్రాలన్నీ మలయాళం లోకి అనువదించ బడ్డాయి. కేరళలో మమ్ముట్టి, మోహన్ లాల్ తర్వాత అర్జున్ కే ఎక్కువ అభిమానులు ఉన్నారు, అక్కడి అభిమానులు ఆయన్ని మల్లు అర్జున్ అని పిలుస్తారు.[6]
నటించిన చిత్రాలుసవరించు
సంవత్సరం | చిత్రం | పాత్ర | కథానాయిక | ఇతర విశేషాలు |
---|---|---|---|---|
1985 | విజేత | బాల నటుడిగా | ||
1986 | స్వాతిముత్యం | బాల నటుడిగా | ||
2001 | డాడీ | గొపి | అతిథి పాత్రలో | |
2003 | గంగోత్రి | సింహాద్రి | అదితి అగర్వాల్ | విజేత, సిని"మా" అవార్డ్ - ఉత్తమ నూతన నటుడు (2004) |
2004 | ఆర్య | ఆర్య | అనురాధా మెహతా | విజేత, నంది స్పెషల్ జ్యూరీ పురస్కారం (2004) |
2005 | బన్ని | రాజా/బన్ని | గౌరీ ముంజల్ | |
2006 | హ్యాపీ | బన్ని | జెనీలియా | |
2007 | దేశముదురు | బాల గోవిందం | హన్సికా మోట్వాని, రంభ | పేర్కొనబడ్డాడు, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటుడు (2007) |
శంకర్‌దాదా జిందాబాద్ | అతిథి పాత్రలో | |||
2008 | పరుగు | కృష్ణ | షీలా | విజేత, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటుడు (2008) విజేత, నంది స్పెషల్ జ్యూరీ పురస్కారం (2008) |
2009 | ఆర్య 2 | ఆర్య | కాజల్ అగర్వాల్ | పేర్కొనబడ్డాడు, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటుడు (2009) |
2010 | వరుడు | సందీప్ | భానుశ్రీ మెహ్రా | |
వేదం | కేబుల్ రాజు | అనుష్క శెట్టి, దీక్షా సేథ్ | విజేత, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటుడు (2010) | |
2011 | బద్రీనాధ్ | బద్రీనాధ్ | తమన్నా | |
2012 | జులాయి | రవీంద్ర నారాయణ్ | ఇలియానా | |
2013 | ఇద్దరమ్మాయిలతో | సంజు రెడ్డి | అమలా పాల్, కేథరీన్ థెరీసా | |
2014 | ఐ యమ్ ధట్ చేంజ్ | లఘు చిత్రం, నిర్మాత కూడా | ||
రేసుగుర్రం | లక్ష్మణ్/ లక్కి | శృతి హాసన్ | విజేత, దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నటుడు (2014) | |
ఎవడు | సత్య | కాజల్ అగర్వాల్ | కాజల్ అగర్వాల్ తో పాటు అతిథి పాత్రలో నటించాడు. | |
2015 | సన్నాఫ్ సత్యమూర్తి | విరాజ్ ఆనంద్ | సమంత, నిత్య మీనన్, అదా శర్మ | |
రుద్రమదేవి | గోన గన్నా రెడ్డి | అనుష్క శెట్టి, కేథరీన్ థెరీసా | ||
2016 | సరైనోడు | గణ | రకుల్ ప్రీత్ సింగ్, కేథరీన్ థెరీసా | |
2017 | దువ్వాడ జగన్నాధం | దువ్వాడ జగన్నాధం / డి.జె. | పూజా హెగ్డే | |
2018 | నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా | సూర్యా | అను ఇమ్మాన్యుయేల్ | |
2020 | అల వైకుంఠపురములో | బంటు | పూజా హెగ్డే | |
2021 | పుష్ప[7] | రష్మిక మందన |
అవార్డులుసవరించు
- 2015 - ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సహాయ నటుడు - రుద్రమదేవి
బయటి లింకులుసవరించు
మూలాలుసవరించు
- ↑ ఈనాడు ఆదివారం, ఏప్రిల్ 17, 2016, శరత్ కుమార్ బెహరా వ్యాసం
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-10-31. Retrieved 2010-10-30.
- ↑ http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel6.htm Archived 2011-09-01 at the Wayback Machine అక్టోబరు 30, 2010 ఈనాడు పత్రిక
- ↑ ChennaiNovember 21, Janani K.; November 21, 2021UPDATED:; Ist, 2021 11:57. "Allu Arjun and Sneha Reddy wish daughter Allu Arha on her birthday. See posts". India Today (in ఇంగ్లీష్). Retrieved 2021-11-21.
{{cite web}}
: CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link) - ↑ telugu, NT News (2022-10-13). "అరుదైన అవార్డును గెలుచుకున్న అల్లు అర్జున్.. తొలి సౌత్ ఇండియన్ హీరోగా రికార్డు". Namasthe Telangana. Archived from the original on 2022-10-13. Retrieved 2022-10-13.
- ↑ http://www.saakshi.com/main/weeklydetails.aspx?newsId=46295&subcatid=26&Categoryid=2[permanent dead link] కేరళ లో అల్లు అర్జున్ చిత్రాల గురించి సాక్షి దినపత్రిక వ్యాసం
- ↑ Boy, Zupp (2020-11-09). "Pushpa movie update: the shooting will commence on November 10, check out the video here!". Moviezupp (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-01-11.