చర్చ:ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ స్థానిక సంస్థల జాబితా

తాజా వ్యాఖ్య: వ్యాసాన్ని జాబితాగా మార్చాను టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

జాబితా తాజా

మార్చు

 Y సహాయం అందించబడింది

120 నుండి 125 కి పెరిగినందున, వివరాలు తాజా చేయాలి. వ్యాసానికి కృషి చేసిన వాడుకరి:యర్రా రామారావు వాడుకరి:Chandra.munnangi గారలు, ఇతరులు సహాయం చేయమని కోరుతున్నాను.--అర్జున (చర్చ) 12:01, 12 మార్చి 2021 (UTC)Reply

సంబంధిత విభాగాలలో హెచ్చరికలు చేర్చాను--అర్జున (చర్చ) 23:37, 18 మార్చి 2021 (UTC)Reply
నేను ఈ వ్యాసానికి కృషి చేయటం కాదు.సృష్టించిందినేనే.తగిన మూలాలతో తాజాకరిద్దామని 2021 మార్చి 17 సవరణలు మొదలు పెట్టాను.అర్జున గారు గమనించిన తాజాకరణ లింకు కూడా తెలిపితే బాగుండేంది.మూలాల ఆధారం లేకుండా సవరించటం నా అభిమతం కాదు.నేను ఏదైనా ఒక పని చేపట్టినప్పుడు దానిని పూర్తిగా చేస్తానుకానీ, మధ్యలో దాదాపుగా అసంపూర్తిగా వదిలే అలవాటు లేదు.మీకు తెలుసో తెలియదో,మీరు తాజాకరించాలి అనే 120 నుండి 125 వరకు పెరిగాయి అని తెలిపారు, కానీ ఇప్పటికీ ప్రభుత్వ వెబ్సైట్లో నగరపాలక సంస్థలు 16 కాకుండా, పురపాలక సంస్థలు, నగరపంచాయితీలు రెండు కలిపి 96 మాత్రమే చూపుతుంది.అంటే మీ లెక్క ప్రకారం 13 (పురపాలక సంఘాలు+ నగరపంచాయితీలు) ప్రభుత్వ వెబ్సైట్లో లోనే తాజాకరించలేదు.మీరు గమనించి సహాయం మూసలో అభ్యర్థించటం తప్పు పట్టటంలేదు కానీ,వ్యాసంలో తాజాకరించటం గమనించికూడా, తాజాకరించాలి అనే రెండు మూసలు తగిలించారే దాని విషయంలో నాకు భాధగాఉంది.చేసేవారిని శంకించినట్లుగా ఉంది. యర్రా రామారావు (చర్చ) 06:36, 19 మార్చి 2021 (UTC)Reply
అర్జున గారు ఈ వ్యాసం నేను 2021 మార్చి 19 నాటికి ఉన్నవివరాల ప్రకారం తాజాకరించాను.గమనించగలరు. యర్రా రామారావు (చర్చ) 07:41, 19 మార్చి 2021 (UTC)Reply
యర్రా రామారావు గారు, మీరు వ్యాసాన్ని నేను ఇచ్చిన మూలపు తేదీ తరువాత మీ సవరణ వరకు లభ్యమైన ఇతర మూలాలతో తాజాకరించినందులకు ప్రత్యేక ధన్యవాదాలు. అయితే నేను చేసిన సవరణలు, హెచ్చరికలు మీరు అపార్ధం చేసుకున్నట్లుగా వుంది. మీ కృషిని శంకించే ఉద్దేశ్యం నాకు లేదు. మీకు అలా అనిపించినందున నా క్షమాపణలు తెలుపుతున్నాను. మరి కొంత వివరణ: తాజాకరణకు మూలం (DTCP website) నేను చేసిన సవరణలో తెలిపాను. మీరు అది గ్రహిస్తారనుకున్నాను. ఇక వ్యాసంలో తాజాకరణ హెచ్చరికలు చేర్చడం సాధారణ చదువరులకు సమాచార స్థితి తెలుపుటకు ఉద్దేశించినది. ఇటువంటి మూసలు ఇంతకు ముందు తెవికీలో ఎక్కువగా వాడుటలేదు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి వ్యాసంలో తాజా సభ్యుల వివరాలు సరిచేయుటకు తగిన సమాచారం దొరకక, అక్కడకూడా పాత సమాచారం అచేతనం చేసి ఇటువంటి మూసలు చేర్చినది మీరు గమనించవచ్చు. ఇక నేను చర్చాపేజీలో చేసే సహాయ అభ్యర్ధనలు పరిశీలిస్తే, వ్యాసానికి ఎక్కువగా పాఠ్యం చేర్చిన పదిమంది సభ్యుల వివరాలను తీసుకొని, కృషి చేసిన అనే పదం వాడడం మీరు గమనించవచ్చు. ఈ వివరణ అపార్ధాన్ని తొలగించడానికి సహాయపడుతుందని భావిస్తాను.--అర్జున (చర్చ) 01:03, 21 మార్చి 2021 (UTC)Reply
అర్జున గారూ మీ స్పందనలకు ధన్యవాదాలు. నేను ఒక్కోసారి రాసిన తరువాత ఎందుకు రాసానా అని బాధపడుతాను.ఇందులో మీ మీద నాకు ఎటువంటి అపార్థం లేదు.అది నా అభిప్రాయం మాత్రమే. మీరు అలా భావించవద్దు అని మనవి. యర్రా రామారావు (చర్చ) 03:18, 21 మార్చి 2021 (UTC)Reply
యర్రా రామారావు గారు, మీ స్పందన పూర్తిగా అర్ధం చేసుకోలేకపోయాను. అయినా ఈ చర్చను కొనసాగించే ఉద్దేశం నాకు లేదు. ఇకపై చర్చలు అపార్ధాలకు తావు లేకుండా సామరస్య పూర్వక వాతావరణంలో జరుగుతాయని ఆశిస్తాను. --అర్జున (చర్చ) 22:36, 21 మార్చి 2021 (UTC)Reply

వ్యాసాన్ని జాబితాగా మార్చాను

మార్చు

వ్యాసాన్ని ఆంధ్రప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థలు లో విలీనం చేసి, కేవలం జాబితాగా మార్చాను. అర్జున (చర్చ) 09:45, 10 ఆగస్టు 2022 (UTC)Reply

Return to "ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ స్థానిక సంస్థల జాబితా" page.