చర్చ:ఇమాంపూర్

తాజా వ్యాఖ్య: వెంకటస్వామి లింకు టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

వెంకటస్వామి లింకు మార్చు

అర్జున గారూ, ఈ పేజీలో సర్పంచి పేరు "వెంకటస్వామి". ఆ పదానికి లింకేమీ లేదు. కానీ వెంకటస్వామి అయోమయ నివృత్తి పేజీకి ఉన్న లింకుల్లో ఈ పేజీని చూపిస్తోంది. ఎందుకో అర్థం కాలేదు. గతంలో ఉన్న లింకును ఇప్పుడు తీసెయ్యడం లాంటిదేమీ చెయ్యలేదు. వేరే పేజీల్లో కూడా నేను ఇలాంటి విషయాన్నే గమనించాను. మీ వీలును బట్టి దీన్ని పరిశీలిస్తారా? __చదువరి (చర్చరచనలు) 05:23, 20 జనవరి 2020 (UTC)Reply

చదువరి గారికి, ఈ దోషం లోపంగల మూస{{Infobox Settlement/sandbox}} ద్వారా కలుగుతున్నట్లుగా గమనించాను. తెలంగాణా గ్రామాలకు వికీడేటా సమాచారం ఉపయోగించే కొత్త మూస {{Infobox India TG Village}} తో సరిదిద్దాను. --అర్జున (చర్చ) 06:28, 20 జనవరి 2020 (UTC)Reply
అర్జున గారూ, ఈ కొత్త మూస వికీడేటా నుండి డేటాను తీసుకుంటుంది. పేజీలో మూసపెట్టేస్తే చాలు, డేటా ఇవ్వనక్కర్లేదు. అక్కడ డేటా లేకపోతే, ఇక్కడ ఏమీ కనబడదు, అంతేగదండి? ఇది చాలా బాగుంది. గతంలో మీరు ఆంధ్ర గ్రామాలకు కూడా చేసినట్లున్నారు. ఆంధ్ర తెలంగాణ గ్రామాలు దాదాపుగా అన్నిటికీ వికీడేటాలో డేటా ఉంది కాబట్తి ఇది చక్కగానే పనిచేస్తుంది. పురుషులు, స్త్రీలు వంటి మిగతా డేటాను కూడా ఈ మూసల్లోకి తెచ్చే ఏర్పాటు చేస్తే ఈ మూసలు మరింత పరిపూర్ణంగా ఉంటాయి, పరిశీలించండి. ధన్యవాదాలు సార్. __చదువరి (చర్చరచనలు) 06:42, 20 జనవరి 2020 (UTC)Reply
చదువరి గారికి, నేను ప్రకాశం జిల్లా గ్రామాలకు మాత్రమే చేశాను. మరిన్ని వివరాలు చూడండి. --అర్జున (చర్చ) 04:02, 21 జనవరి 2020 (UTC)Reply
Return to "ఇమాంపూర్" page.