చర్చ:ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర

తాజా వ్యాఖ్య: 18 సంవత్సరాల క్రితం. రాసినది: వైఙాసత్య
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
ఈ వ్యాసాన్ని భారతదేశ చరిత్ర అనే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.
ఈ వ్యాసాన్ని ఆంధ్రప్రదేశ్ అనే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


నమస్కారము

నాది  ఒక చిన్న అభియోగము .......  "తొలి ముఖ్యమంత్రులు"  వ్యాసములొ  దామోదరము  గారు  " దళిత  నేత "  అని రాశారు .
దళిత నేత  గురుంచి  రాసినప్పుదు  బ్రహ్మణ , కాపు , రెడ్డి , ...................... నేతల  గురుంచి  ఎందుకు  రాయరు?

అయినా ఈ నెట్ యుగం లొ కూడా కులం గురించి మతం గురుంచి రాయాలా?

అందుకే నేను " దలిత " అన్న పదం తీసివేసాను .......


అలాగే స్వర్గీయ రామారావు గారి గురుంచి రాస్తున్నపుడు " డు " ప్రయోగం ఏంత వరకు సబబు ?

"దళిత" నేత విషయంలో మీరు చేసిన పని సరైనదేనని నా అభిప్రాయం. అయితే వ్యక్తుల గురించి రాసినపుడు గౌరవ వాచకాలను వాడనవసరం లేదని వికీ నియమం. రచ్చబండ చూడండి. కొత్తవారై ఉండీ ఇంత చొరవగా దిద్దుబాటు చెయ్యడం ముచ్చటగా ఉంది. ఈ మధ్య కాలంలో ఒక కొత్త వ్యక్తి ఇలా చెయ్యడం నేను చూడలేదు. మీరు సభ్యుడిగా చేరండి. స్వాగతం! __చదువరి (చర్చ, రచనలు) 02:34, 18 ఫిబ్రవరి 2006 (UTC)Reply
మీ అభిప్రాయం తో నేను ఏకీభవిస్తాను. కానీ వికిపీడియా సంఘ సంస్కరణ ఉద్యమము కాదు. ఈ తరములో కుల మత బేధాలు ఉండటము అమానుషము కానీ సంజీవయ్య గురించిన ప్రతి వ్యాసములో ఆయన తొలి దళిత ముఖ్యమంత్రిగానే కీర్తించాయి. ఆయన జీవితచరిత్రలలో అన్నింట్లో కుడా అలానే ఉంది. (అందులో రెండు మూడు దళితులు రచించినవే). అలా నొక్కిచెప్పడములో ఆనాటి పరిస్థుతులలో అది ఎంత ఘనకార్యమో మనకు అవగతమవుతుంది. కానీ సంజీవయ్య లాంటి నాయకున్ని కేవలము దళిత వర్గానికి నాయకున్ని చేశారు అనే బాధ కూడా కలుగుతుంది కానీ ఉద్వేగాలకు వికిపీడియాలో తావులేదు. మీ చొరవ అభినందణీయము. --వైఙాసత్య 08:45, 18 ఫిబ్రవరి 2006 (UTC)Reply
Return to "ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర" page.