చర్చ:ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర మార్గం

తాజా వ్యాఖ్య: వ్యాసం అభివృద్ధి చెందుతోంది టాపిక్‌లో 10 సంవత్సరాల క్రితం. రాసినది: Rajasekhar1961
వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


విలీన ప్రతిపాదనకు వ్యతిరేకం

మార్చు

ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్రమార్గం అనే ఈ వ్యాసం స్వతంత్రంగా ఉండేదుకు తగ్గ అవసరం, ప్రతిపత్తి ఉన్నాయని నా అభిప్రాయం. ఎందుకంటే కాశీయాత్రకు ఆయన వెళ్ళి వచ్చిన ఊళ్ళు, దారిలో దాటిన నదులు, తీర్థాలు కలుపుకుంటూ రోజు, రెండు రోజుల చొప్పున రాస్తే ఒక పెద్దస్థాయి వ్యాసం అవుతుంది. 14 నెలలకు పైగా ఉన్న ఈ కాలపరిమితిలో ఆయన దాదాపు 12 నెలల పాటు రోజుకో ఊరు లెక్కవేసుకుంటే ఎంతటిది అవుతుందో ఊహించవచ్చు. ఇంతటి వ్యాసాన్ని మరో వ్యాసంలో ఉంచడం ఆ వ్యాసపు సమతౌల్యతను దెబ్బతీస్తుంది.
అలాగే కాశీయాత్ర చరిత్ర తెలుగులో తొలి యాత్రాచరిత్ర మాత్రమే కాకుండా 1830ల నాడు తెలుగువారి సాంఘిక జీవనానికి ఒక ముఖ్యమైన దస్తావేజు. దీనిని ఆధారం చేసుకుని సురవరం ప్రతాపరెడ్డి తమ ఆంధ్రుల సాంఘిక చరిత్రలో 19వ శతాబ్దికి తొలి అర్థభాగానికి సంబంధించిన ఛాప్టర్ వ్రాశారు. అలాగే భాషాశాస్త్రంలో 1900-1920 మధ్యకాలంలో జరిగిన వ్యవహారిక భాషోద్యమానికి కూడా ఇది ఒక పెద్ద దన్ను. అప్పటికి దాదాపు 70-90 ఏళ్ళ క్రితం వ్రాసిన ఈ రచనలను గిడుగు రామమూర్తి పంతులు తమ వ్యావహారిక భాషావాదానికి లక్ష్యభూతమైన రచనగా స్వీకరించారు.
ఇన్ని ప్రత్యేకతలుండడంతో, హుయాన్ త్సాంగ్ భారతదేశయాత్ర 7వ శతాబ్దిలో భారతదేశచరిత్రకు, న్యూనిజ్ పర్యటన విజయనగర సామ్రాజ్యచరిత్రకు ఎంత సహాయకారియో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్, ఒడిశాల చరిత్రకు, మరీముఖ్యంగ 19వ శతాబ్ది ఆంధ్రుల సాంఘిక, రాజకీయ చరిత్రకు ఏనుగుల వీరాస్వామయ్య పర్యటన అంత ముఖ్యమైనది. ఆ గ్రామాలను ఎంతో శ్రమకోర్చి నేటి ప్రస్తుత పేర్లతో గుర్తించడం జరగుతోంది. ఇప్పటికే తయారైన అసంఖ్యాక గ్రామవ్యాసాలు, అభివృద్ధిలో ఉన్న, భారతదేశ జిల్లాల వ్యాసాలు ఆయన యాత్రావిశేషాలతో ఇంటిగ్రేట్ చేస్తున్నాం. అలాగే తెవికీలో అభివృద్ధికి నోచని కొన్ని రాజవంశాల గురించిన పేజీలు తయారుచేస్తున్నాం. ఇన్నిటి నేపథ్యంలో ఇదొక ముఖ్యమైన వ్యాసం అవుతుందని నా అభిప్రాయం. ఒకవేళ విలీనం చేసినా ఆ వ్యాస సమతౌల్యత దెబ్బతిని తిరిగి వ్యాసంగా తయారుచేయాల్సి వస్తుంది.--పవన్ సంతోష్ (చర్చ) 03:06, 2 డిసెంబరు 2014 (UTC)Reply

వ్యాసం అభివృద్ధి చెందుతోంది

మార్చు

ఈ వ్యాసం ప్రస్తుతం అభివృద్ధి చెందే దశలో ఉన్నది. ఇప్పటివరకు(డిసెంబరు 2, 2014 మధ్యాహ్నం సుమారు పన్నెండున్నర) ఈ వ్యాసంలో వీరాస్వామయ్య కాశీయాత్రలో 2 నెలలు మాత్రమే వ్రాయడం జరిగింది. ఆయన చేసిన మొత్తం యాత్ర 14నెలలకు పైగానే. ప్రస్తుతం మద్రాసు, చిత్తూరు జిల్లా, కడప జిల్లా, కర్నూలు జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా(కొంతవరకు) వ్రాశాను. ఇంకా జిల్లాలకు జిల్లాలు, రాష్ట్రాలకు రాష్ట్రాలే మిగిలివున్నాయి. ఐతే నేను ప్రతి గ్రామాన్ని విడివిడిగా గుర్తించి, ఆయా గ్రామాల్లో పుస్తకంలోని విశేషాలు చేర్చి వచ్చి ఇక్కడ అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాను. కనుక ఈ వ్యాసం క్రమశ: అభివృద్ధి చెందగలదు. పైగా గ్రామనామాల ఉచ్ఛారణ మార్పులు, కొన్నింటికి ఏకంగా పేరే మార్పు జరగడంతో వీటిని వికీలోని భౌగోళిక వివరాల ఆధారంగా ఓపికతో సమీకరించుకోవాల్సి వస్తోంది. అందులోనూ నేను ఏదైనా కోట, సంస్థానం తగలినా, వీరాస్వామయ్య ఏవైనా రాజకీయ వ్యవహారాలు వ్రాసినా తత్సంబంధిత పేజీలను సమగ్రంగా అభివృద్ధి చేశాకే ముందుకు సాగడం జరుగుతోంది. వీటన్నిటినీ పురస్కరించుకుని ఈ వ్యాసాన్ని ఈలోగా తరలించడం, విలీనం చేయడం వంటివి చేయవద్దని మనవి.--పవన్ సంతోష్ (చర్చ) 07:09, 2 డిసెంబరు 2014 (UTC)Reply

పూర్తిగా విస్తరించిన పిదమ మనకు దాని ప్రాముఖ్యత తెలుస్తుంది. ప్రస్తుతం వేరుగానే ఉంచుదాము. కొంతకాలం వేచి చూద్దాము.--Rajasekhar1961 (చర్చ) 12:27, 2 డిసెంబరు 2014 (UTC)Reply
Return to "ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర మార్గం" page.