ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర మార్గం
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
తెలుగులో తొలి యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య తాను 1830-31లో చేసిన కాశీయాత్రను కాశీయాత్రచరిత్రగా గ్రంథస్తం చేశారు. ఈ గ్రంథం 19వ శతాబ్ది తొలి అర్థభాగంలో భారతదేశ సామాజిక, రాజకీయ స్థితిగతులకు ముఖ్యమైన ఆధారాల్లో ఒకటిగా నిలుస్తోంది.[1] ప్రామాణిక సామాజిక చరిత్ర ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచనలో సురవరం ప్రతాపరెడ్డి 19వ శతాబ్ది సమాజిక చరిత్రకు గాను ఈ గ్రంథంపైనే ప్రధానంగా ఆధారపడ్డారు. ఆ ప్రాధాన్యత సంతరించుకున్న కాశీయాత్ర జరిగిన ప్రాంతాలు, తేదీల వివరాలు ఇలా ఉన్నాయి.[2]
యాత్ర
మార్చు1830 మే నెల
మార్చు- 1830 మే 18 - చెన్నపట్టణం
- మే 19 - పాలవాయి సత్రం, మాధవరం, వెంకటేశనాయుడి సత్రం (పెదపాళెము)
- మే 20 - తిరువళ్ళూరు
- మే 21 - కనకమ్మ సత్రం (కార్వేటినగరం)(రామంజేరి మార్గం మీదుగా)
- మే 22 - బుగ్గగుడి, పుత్తూరు (నగరి మీదుగా).
- మే 23 - వడమాలపేట సత్రం, అలమేలు మంగాపురం
- మే 23 నుంచి మే 30 వరకూ - తిరుపతి పట్టణంలో విడిది చేశారు. ఆ మధ్యలో ఒకనాడు తిరుమలను తిరుమల తిరుపతి పరిసరాల్లోని కొన్ని తీర్థాలను దర్శించారు.
- మే 30 - కరకరంబాడు, శెట్టిగుంట, బాలపల్లె, కోడూరు
జూన్
మార్చు- జూన్ 1 - వోరంబాడు, పుల్లంపేట
- జూన్ 2 - నందలూరు, అత్తిరాల
- జూన్ 3 - భాకరాపేట, వొంటిమిట్ట
- జూన్ 4 నుంచి జూన్ 6 వరకు - కడప
- జూన్ 7 - పుష్పగిరి(చెయ్యేరు మీదుగా వెళ్లారు), కాజీపేట
- జూన్ 8 - దువ్వూరు, వంగలి
- జూన్ 9 - అహోబిళం
- జూన్ 10 - శ్రీరంగాపురం, రుద్రవరము
- జూన్ 11 - మహానంది, బండాతుకూరు
- జూన్ 12 - వెలపనూరు, ఓంకారము, వెంపెంట
- జూన్ 13 - ఆత్మకూరు
- జూన్ 14 నుంచి జూన్ 15 వరకు - కృష్ణాపురంః, సిద్దాపురం, భీముని కొల్లము, నాగులోటి, పెద్దచెరువు(పెద్దచెరువు తక్క మిగిలినవి మజిలీలు కాదు. దారిన చూసిన గ్రామాలు)
- జూన్ 16 నుంచి జూన్ 19 వరకు - శ్రీశైలము
- జూన్ 19 - నందికుంట
- జూన్ 20 - నివృత్తి సంగమం (కృష్ణ దాటడం)
- జూన్ 21 నుంచి జూన్ 24 వరకు - ముసలిమడుగు
- జూన్ 24 - సిద్ధేశ్వరం ఘాటు, పెంటపల్లి
- జూన్ 25 - పానగల్లు
- జూన్ 26 - చిన్నమంది, వనపర్తి, గణపురం, చోళీపురం, మనోజీపేట(చోళపురం, మనోజీపేట మజిలీలు కాదు. గణపురం మార్గంలో తగిలే గ్రామాలు)
- జూన్ 27 - జడచర్ల (జడ్చర్లకు మూలకర్ర, కోటూరు, ఆలూర్ తదితర గ్రామాల మీదుగా వెళ్ళారు)
- జూన్ 28 - బాలనగరం (దీనికే నాగనపల్లె అని మరొకపేరు వ్రాశారు), జానంపేట (ఫరక్కునగరం)
- జూన్ 29 - షాపురం
యివి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.
- ↑ వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.